S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నైరుతి దోషంతో ఆర్థిక ఇబ్బందులు (వాస్తు)

బుజ్జి (పాలకొల్లు)
ప్రశ్న: నేను వ్యాపారం చేస్తుంటాను. ఒకరోజు వ్యాపారం బాగా సాగితే, మరోరోజు వ్యాపారం అస్సలు ఉండదు. దీనికి వాస్తు కారణం అవుతుందా? అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం.
జ: మీ వ్యాపారం సాఫీగా సాగాలి అంటే మొదటిగా మీరు వ్యాపారం నిర్వహిస్తున్న స్థలంలో నైరుతిపరమైన లోపాలు ఉన్నాయి. వాటిని సరిచేసుకోండి. అలాగే ప్రతిరోజూ మీ వ్యాపార సంస్థలో సాంబ్రాణి ధూపం వేయండి. అలాగే గుమ్మడికాయను మీ వ్యాపార సంస్థ ప్రధాన ద్వారం దగ్గర వేలాడదీయండి. వీటి వల్ల కొన్ని దృష్టి దోషాలు తగ్గుతాయి. అలాగే మీ వ్యాపారం లాభాల బాట పడుతుంది.
కౌశిక్‌రెడ్డి (రేణిగుంట)
ప్రశ్న: మేం ఒక స్థలం కొనుగోలు చేసి అందులో వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నాం. నా పేరు మీద ఏ దిశ యోగిస్తుంది?
జ: మీ వ్యవహార నామ రీత్యా మీకు దక్షిణం దిశ బాగా యోగిస్తుంది. అలాగే మీ వ్యాపార కార్యకలాపాలకు కూడా దక్షిణ దిశ యోగిస్తుంది.
దివ్య (చినగంజాం)
ప్రశ్న: మేము ఇటీవల చాలా పాతకాలంనాటి ఇంటిని కొనుగోలు చేశాం. ఆ ఇంటిని తీసి నూతన గృహాన్ని నిర్మించాలనుకుంటున్నాం. పాటించవలసిన పద్ధతులేమిటి?
జ: పాత ఇంటిని కూల్చి వేయడానికి ముందు కొన్ని పద్ధతులు పాటించాలి. ఎందువల్లనంటే ఆ ఇంటికి సంబంధించిన చెడు ఫలితాలను మీరు అనుభవించకుండా ఉండటానికి. కాబట్టి దీనికి సంబంధించి వాస్తు పండితులను కలవండి.
శ్రీలేఖ (వికారాబాద్)
ప్రశ్న: నైరుతి మూలలో పెద్ద గొయ్యి ఉన్నటువంటి స్థలాన్ని కొనుగోలు చేయవచ్చా? ఒకవేళ కొనుగోలు చేయాలి అంటే ఏమైనా పరిష్కారాలున్నాయా?
జ: నైరుతిలోగల గొయ్యిని పూడ్చడానికి అవకాశం ఉంటే ఆ స్థలాన్ని కొనుగోలు చేయండి. అలా చేయడానికి అవకాశం లేకపోతే ఆ స్థలాన్ని కొనుగోలు చేయవద్దు.
బి.ఎన్.రెడ్డి (చిట్యాల)
ప్రశ్న: పెరిగిన మూలలను వేరుచేసిన తర్వాత ఆ స్థలాన్ని వాడుకోవచ్చా?
జ: పెరిగిన మూలలను వేరు చేసిన తర్వాత ఆ స్థలాన్ని అస్సలు ఉపయోగించకూడదు. దాని వలన వేరు చేసిన ఫలితాలను పొందలేరు. *

-వాస్తు శిఖామణి చివుకుల రాఘవేంద్ర శర్మ -96 42 70 61 28