S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎండమావి

ఎడారులు, సముద్రాలలో సాధారణంగా కనిపించే దృశ్యం ఇది. కాంతి కారణాల వక్రీభవనం కారణంగా ఏర్పడే దృగ్విషయమే ఎండమావి. దూరంగా వున్న ఒక పదార్థం నుంచి మరో పదార్థంలోకి ప్రవేశించేటపుడు కాంతి కిరణాల రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారుతుంది. దాంతో కాంతి కిరణాలు ఆ పదార్థంలో ప్రయాణించే వేగం తగ్గుతుంది. దీనినే వక్రీభవనపు ఎరిడ్‌గా పేర్కొంటుంటారు. అందువల్ల సాంద్రత అధికంగా వుండే చల్లని గాలి నుంచి కాంతి కిరణాలు పలుచగా వుండే వెచ్చని గాలిలోకి ప్రవేశించినపుడు కొంత వక్రీభవనం చెందుతాయి. ఈ విధంగా వొంపు తిరిగిన కిరణాలు భూమి ఏటవాలు కారణంగా మామూలుగా కనిపించని దూరపు వస్తువులను కనిపించేట్లు చేస్తాయి.
‘ఎడారిలో దృశ్యం’ లాంటి ఎండమావులను దిగువ స్థాయి ఎండమావులుగా పేర్కొంటారు. ఇవి వస్తువులను అవి వున్నదానికంటే దగ్గరదిగా కనిపించేటట్లు చేస్తాయి. దృగ్గోచర ప్రాంతం నుంచి వచ్చే కాంతి నేల మీద ప్రతిబింబాలు కనిపించేట్లు చేస్తాయి. నేల బాగా వేడిగా ఉండి అక్కడి గాలి ఆపై ప్రాంతపు గాలికంటే తక్కువ సాంద్రత గలదిగా మారినపుడు ఈ ఎండమావులు ఏర్పడతాయి. పై భాగపు చల్లని గాలిగుండా ప్రయాణించి వచ్చిన కాంతి కిరణాలు వెచ్చని గాలిలోకి ప్రవేశించినపుడు దూర ప్రాంతపు వస్తువులను దగ్గరగా చూపిస్తాయి. సాధారణంగా నేలకు చేరుకునే కిరణాలు ఈ సందర్భంలో వీక్షకుడి కంటికి చేరతాయి.

-నాయక్