S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పుట్టిన రోజు బహుమతి ( స్ఫూర్తి)

‘అమ్మా ఈ నెలలోనే నా పుట్టిన రోజు’ వేద ఉత్సాహంగా చెప్పింది.
‘ఈ పుట్టిన రోజుకి పార్టీని వేరే విధంగా చేద్దాం’ ఆమె తల్లి చెప్పింది.
‘వేరే విధంగా అంటే? ఎలా?’ వేద అడిగింది.
‘మీ ఫ్రెండ్స్‌ని ఇంకా అందర్నీ వాళ్లు తెచ్చే బహమతులని అనాథ శరణాలయంలోని పిల్లలకి ఉపయోగించేవిగా తీసుకురమ్మని కోరదాం. నీ పార్టీ కూడా అనాధ పిల్లల సమక్షంలో చేసుకుందాం’
‘అంటే నాకు వచ్చే బహుమతులన్నీ వాళ్లకి ఇచ్చేయాలా?’ వేద ఆశ్చర్యంగా అడిగింది.
‘అవును’
‘నాకు ఇది నచ్చలేదు’
‘నీ క్రితం పుట్టిన రోజుకి నీకు వచ్చిన బహుమతులు కొన్నిటి పేర్లు చెప్పు’ తల్లి కోరింది.
వేద ఆలోచించింది కానీ ఒక్కటీ గుర్తుకు రాలేదు. వేద తల్లి ఆ పదకొండు వస్తువుల పేర్లని చెప్పి అడిగింది.
‘అవునా?’
‘అవును’
‘వాటిలో ఒకోటి ఏమయ్యాయో చెప్పనా? నాలుగిటిని నువ్వు ఒక్కసారి మాత్రమే వాడి ఆ తర్వాత ముట్టుకోలేదు. మూడు పగిలిపోయాయి. ఓ బొమ్మకి బేటరీ లేక ఆర్నెల్లుగా వాడటంలేదు. ఓ బహుమతిని నీ తమ్ముడికి ఇచ్చావు. ఒకదాంతో ఆడి ఆడి విరగ్గొట్టావు. పదకొండోది ఎక్కడ ఉందో కూడా నీకు తెలీదు. మాయం అయింది. అవునా?’
‘అవును. నువ్వు చెప్తే గుర్తుకు వచ్చింది’
‘పదకొండు బహుమతుల్లో నువ్వు ఒక్కదానే్న చక్కగా ఉపయోగించుకున్నావు. మిగిలిన పది అనాథ పిల్లలకి ఇచ్చి ఉంటే వారు ఆడుకునేవాళ్లు కదా? ఆడుకోడానికి ఇప్పుడు నీకు చాలా బొమ్మలు ఉన్నాయి. ఇంక కొత్తవి అవసరం లేదు. పైగా నాన్న నీకు తరచు కొత్త బొమ్మలు కొని తెస్తూనే ఉన్నారు’
వేద కొన్ని క్షణాలు ఆలోచించి చెప్పింది.
‘నువ్వు చెప్పింది నిజమే అమ్మా! నా పుట్టిన రోజుకి వచ్చే బహుమతులని అనాథ పిల్లలకి పనికి వచ్చేవిగా తీసుకురమ్మని చెప్దాం. నిజానికి నువ్వు చెప్పేదాకా ఈ మంచి పని నాకు తట్టలేదు’ వేద ఉత్సాహంగా చెప్పింది.
‘నేను నీ పుట్టిన రోజుకి అనాథాశ్రమంలోని వారికి భోజనానికి డబ్బు కడ్దామని వెళ్తే, వాళ్లు ఆ పండుగని వారి మధ్య చేసుకుంటే తమకి కొంత ఛేంజ్‌గా ఉంటుందని సూచించారు. దాంతో నాకు ఈ ఆలోచన కలిగింది’ వేద తల్లి చెప్పింది.

మల్లాది వెంకట కృష్ణమూర్తి