S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పుణ్యఫలం

ఒక రోజు శంకరుడు భిక్ష కోసం ఒక ఇంటి ముందు నిలిచాడు ‘్భక్షాందేహీ!’ అంటూ మూడుసార్లు పిలిచాడు.
అది ఒక పూరిల్లు.
శంకరుడు ప్రహరీ బయట నుండి భిక్ష అర్థించాడు.
కాసేపటికి తలుపు చాటు నుండి వృద్ధ స్ర్తి తల బయటకు పెట్టి అతన్ని చూసింది.
‘్భక్షాందేహీ!’ అని అర్థించాడు.
‘నాయనా! నీకు భిక్ష పెట్టటానికి మా ఇంట్లో ఏమీ లేవు. కాని భిక్ష అడిగిన వారిని ఉత్త చేతులతో పంపకూడదు. నా దగ్గర ఒక్క ఉసిరికాయ ఉంది. దానిని నీకు అభ్యంతరం లేకపోతే భిక్షగా ఇస్తాను’ అని ఆ ముసలి తల్లి చెప్పింది.
‘తల్లీ నీ భిక్ష స్వీకరించడానికి నాకేం అభ్యంతరం? అలాగే’ శంకరుడు బదులు ఇచ్చాడు.
‘అయితే నాయనా! కొంచెం లోపలికొచ్చి భిక్ష స్వీకరించు. నేను బయటకు రాలేను’ అని సిగ్గుపడుతూ చెప్పింది.
శంకరుడు విస్మయానికి లోనై లోనికి వచ్చాడు.
ఆమె తలుపు చాటు నుండే చెయ్యి చాచి అతని పాత్రలో తను సేకరించిన ఉసిరికాయను వేసింది.
‘తల్లీ, భిక్షను తలుపు చాటు నుండి ఏల వేయుచున్నావు? నీ చిన్నకొడుకు లాంటి వాడిని. బయటకొచ్చి వేయవచ్చు కదా?’ సందేహంతో అడిగాడు శంకరుడు. అతను సర్వసంగ పరిత్యాగి.
‘ఏమని చెప్పను నా దుస్థితి? నా ఒంటి మీద కట్టుకోవడానికి సరియైన వస్త్రం లేదు. అంతా చిరుగులు. ఈ దుస్థితిలో నేను ఇతరుల కంట పడటం ఏమి న్యాయం?’ ఆ తల్లి దీనంగా అంది తలుపు చాటున నిలబడే.
శంకరుడికి ఆమె పేదరికం అర్థమైంది. తినడానికి తిండి లేదు. కట్టుకొనడానికి బట్టలేదు. ఆయన హృదయం ద్రవించి పోయింది. ఒక ముసలి స్ర్తికి ఇంతటి దుర్భర స్థితి ఏల కలిగిందని ఆవేదన చెందాడు. లక్ష్మీదేవిని ప్రార్థించాడు. ఆమె అతనికి ప్రత్యక్షమైంది. మరి ప్రార్థించిన వాడు సామాన్యుడు కాదు కదా, అపర శంకరుడు.
‘అమ్మా! లక్ష్మీదేవి! ఈమెకు ఇంతటి దారిద్య్రం ఎందుకు? దయుంచి కాసిని సంపదలు ఇవ్వవచ్చు కదా!’ అని ప్రార్థించాడు ఆమె కోసం తను సన్యాసియైనా, సిరిసంపదల పైన ఆశలేనివాడైనా కూడా.
‘శంకరా! ఈమె పూర్వజన్మలో ఒక్క పుణ్యకార్యం కూడా చేయలేదు. అందుకే ఈమెకు సిరులు ఇవ్వలేకపోయాను’ అని చెప్పింది లక్ష్మీదేవి, తన నిస్సహాయతను వ్యక్తీకరిస్తూ.
‘అమ్మా! మహాలక్ష్మీ! ఈమె నాకు ఉసిరికాయ దానం చేసింది. ఈ భిక్షను స్వీకరించాను. ఆమెకు పుణ్యం కలిగింది కదా, దాని కోసమన్నా ఆమెకు సిరులు ఇవ్వవమ్మా!’ అని అడిగాడు శంకరుడు దీనంగా, తన పట్టుదల వదలకుండా.
‘శంకరా! సకల విద్యాపారంగతుడవు! నీకు తెలియనిదా! ఈ జన్మలో చేసుకున్న పుణ్య ఫలం మరు జన్మలో కదా అనుభవిస్తారు’ అంటూ లక్ష్మీదేవి చెప్పింది ధర్మసూత్రాన్ని, కర్మసూత్రాన్ని.
‘తల్లీ! నువ్వు తల్చుకుంటే ఆమెకు ఈ జన్మలోనే ఆ పుణ్య ఫలం అందించగలవు. నాకోసం ఈమెను అనుగ్రహించు’ అని ప్రార్థించాడు శంకరాచార్యులు, దయార్దహృదయుడై.
అప్పుడు శంకరుడు లక్ష్మీదేవిని కనకధార స్తోత్రం ద్వారా స్తుతించాడు.
లక్ష్మీదేవి సంతసించి బంగారు ఉసిరికాయలు ఆ ముసలి తల్లి ఇంటిలో కురిపించింది కొన్ని క్షణాలు.
అప్పటి నుండి ఆ బీద ముసలి తల్లి కష్టాలు తీరిపోయాయి.
శంకరులు ఘటనాఘటన సమర్థులని ఈ సంఘటన తెలియజేస్తున్నది. ఈ జన్మలో పుణ్యం చేసుకోనిది మరుజన్మలో సుఖపడలేమని ఈ వృత్తాంతం నిరూపిస్తున్నది.

-వియోగి