S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అప్రమత్తంగా ఉన్నాం: వైద్య మంత్రి

నావల్ కరోనా వైరస్‌పై అప్రమత్తంగా ఉన్నాం. ప్రభుత్వ పరంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నందువల్ల ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క వ్యక్తికి కూడా ఈ వైరస్ సోకలేదు. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో వైద్య పరీక్షలకు ఏర్పాట్లు చేశాం. విదేశాల నుండి వచ్చే ప్రతి ప్రణాణీకుడికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఏ మాత్రం అనుమానం ఉన్నా సదరు వ్యక్తులను ‘ఐసోలేట్’ చేసి ట్రీట్‌మెంట్ ఇస్తున్నాం. ఇందుకోసం గాంధీ దవాఖానా, ఛాతీ వ్యాధుల దవాఖానా, ఫీవర్ దవాఖానాల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశాం. అనుమానిత వ్యక్తులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నాం. ప్రత్యేక వార్డులున్న ఆసుపత్రులతో పాటు ఇతర ఆసుపత్రుల్లో అవసరమైన ‘మాస్క్’లను అందుబాటులో ఉంచాం. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, రోగులకు వీటిని అందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేయూత ఇస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రితో పాటు ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాను. నేను ప్రత్యేక శ్రద్ద తీసుకుని హైదరాబాద్‌లోని అన్ని ఆసుపత్రులను సందర్శించాను. వైద్య చికిత్సకు సంబంధించి జరిగిన ఏర్పాట్లు ఫకడ్బందీగా ఉండేలా చూశాను. తెలంగాణలో ఒక్కరికి కూడా కరోనా ఇప్పటి వరకు సోకలేదు. దుబాయి నుండి బెంగుళూరు మీదుగా హైదరాబాద్‌కు బస్సులో వచ్చిన ఒక వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు వెల్లడి కావడంతో అతడికి గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స ఇస్తున్నాం. ఈ వ్యక్తితో కలిసిన ప్రయాణించిన వారికి, కుటుంబ సభ్యులకు, అతడితో మాట్లాడిన వారికి కూడా ముందు జాగ్రత్తచ ర్యలుగా వైద్య పరీక్షలు నిర్వహించినాము. వైద్య పరీక్షలు చేసిన అంరికీ ఫలితాలు నెగిటిగవ్‌గా వచ్చాయి. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా మాకు సహకరిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ప్రత్యేక వార్డులు (ఐసోలేట్ వార్డులు) ఏర్పాటయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆశా వర్కర్లతో సహా జిల్లా స్థాయి అధికారులందరికీ ఈ అంశంపై అవగాహన కల్పించాం.
ప్రజల అవసరాలకోసం ‘104’ ఫోన్‌ను ఏర్పాటు చేశాం. ఎవరైనా అనుమానాలు ఉంటే ఈ నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. నావల్ కరోనా వైరస్ కు చికిత్స కావాలంటే ఇదే నెంబర్ వైద్య నిపుణులు సలహాలు ఇవ్వడంతో పాటు బాధితులు ఎవరైనా ఉంటే వారిని ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేశాం. రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, ఆయుష్ కమిషనర్లతో చర్చించాను. జిల్లా స్థాయి అధికారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఫకడ్బందీ ఏర్పాట్లు చేశాం. మందులు కొనుగోలు, చికిత్స, వైద్యపరికరాల ఏర్పాటు, ప్రచారం తదితర అవసరాలకోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశాం. ఈ కమిటీలకు ఐఏఎస్ అధికారులను ఇంచార్జీలుగా పెట్టి యుద్ధప్రాతిపదికపై పనులు జరిగేలా చర్యలు తీసుకున్నాం. సిబ్బందికి ప్రోత్సాహం కలిగించేందుకు అదనపు వేతనాలు కూడా ఇస్తున్నాం.
-ఈటల రాజేందర్.
వైద్య, ఆరోగ్య శాఖ మాత్యులు, తెలంగాణ ప్రభుత్వం.
*
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
*
* చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. కనీసం 20 సెకన్లపాటు కడుక్కోవాలి.
* బయట నుండి ఇంటికి రాగానే చేతులను కడుక్కోవాలి. విధి నిర్వహణకు ముందు, ఆ తర్వాత కూడా చేతులను కడుక్కోవాలి.
* నీళ్లు, సబ్బు అందుబాటులో లేకుంటే సానిటైజర్ జెల్‌ను ఉపయోగించాలి.
* తుమ్మినా, దగ్గినా ముక్కుకు, నోటికి జేబు రుమాలు లేదా టిస్యూ పేపర్‌ను అడ్డుపెట్టుకోవాలి.
* ఉపయోగించిన టిస్యూను చెత్తడబ్బాలో వేసి చేతులు కడుక్కోవాలి.
* అనారోగ్యంగా ఉండే వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది.
* చేతులు శుభ్రంగా లేకపోతే వాటితో కళ్లు, ముక్కు, నోటిని రుద్దుకోరాదు.