S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

టేబిల్ గడియారం

చిన్నప్పుడు మా ఇంట్లో వున్న ఒకే ఒక యంత్ర సాధనం గడియారం. అది గుండ్రంగా వుండేది. చుట్టూ స్టీల్ ఫ్రేమ్. తెల్లటి డయల్. దాని మీద నల్లటి కాలాన్ని సూచించే రెండు అంకెలు. మూడు ముల్లు. దానిపైన ఆ గడియారాన్ని పట్టుకోవడానికి ఒక కొక్కెం. దాని వెనుక కుంజీ (కీ)లు ఉండేవి. ప్రతిరోజూ దానికి కీ ఇవ్వాల్సిందే. అది కాలాన్ని సూచించాలంటే కీ తప్పనిసరి. కీ ఇవ్వకపోతే అది నడవకపోయేది.
అది నడవకపోయినా మమ్మల్ని మాత్రం రోజూ అదే సమయానికి నిద్రలేపి చదువుకొమ్మని చెప్పేవాళ్లు. అప్పుడప్పుడు కీ ఇవ్వకుండా వున్నా ఫలితం వుండకపోయేది. ఉదయానే్న నిద్ర లేపడానికి గడియారంతో పనిలేదు.
ఉదయం నాలుగు గంటలకి మా రాజేశ్వరుని గుడి మైకులో సుప్రభాతం విన్పించేది. ఆ తరువాత అరగంటకి మా మల్లయ్య వచ్చేవారు మా బర్రెల (గేదె) పాలు పిండడానికి. దీనితో మా బాపు నిద్రలేచేవాడు. ఓ అరగంట అటూ ఇటుగా మేం నిద్ర లేవాల్సి వచ్చేది. చలికాలం చాలా కష్టంగా వుండేది నిద్ర లేవడం. దుప్పట్లు కప్పుకొని అయినా అందరూ చదవాల్సిందే. ఇప్పటి మాదిరిగా నిశ్శబ్దంగా చదువుకోవడం అప్పుడు లేదు. గట్టిగా చదివేవాళ్లం. ఒకరి శబ్దం మరొకరికి అసౌకర్యంగా వుండకపోయేది. గట్టిగా చదువకపోతే వాళ్లు నిద్రపోతున్నట్టే లెక్క. మా పెద్దవాళ్లు వాళ్ల గొంతు విన్పించకపోతే వారిని పిలిచేవారు. మళ్లీ వాళ్లు గట్టిగా చదివేవాళ్లు.
పేరుకు అలారమ్ పీస్ గడియారం. దానితో సంబంధం లేకుండా మమ్మల్ని నిద్ర లేపేవాళ్లు. ఎవరన్నా ఉదయానే్న ఊరు వెళ్లాల్సి వున్నప్పుడు మా గడియారం ప్రాముఖ్యత బాగా పెరిగిపోయేది.
ఉదయం బస్సులు మిస్ కాకుండా వుండాలని ఉదయం లేస్తామన్న గ్యారంటీతో సంబంధం లేకుండా అలారమ్‌ని గట్టిగా నమ్మేవాళ్లు. అంతేకాదు దాన్ని పడుకున్న వ్యక్తులకి దూరంగా వుంచేవాళ్లు. యథాలాపంగా ఆఫ్ బటన్ నొక్కకుండా వుండటానికి.
మా గుడి మీద సుప్రభాతం చదివే అమ్మగారు ఏ అలారమ్ పెట్టుకునేవారో నాకు తెలియదు. ఒకటి మాత్రం తెలుసు మా మల్లయ్య దగ్గర మాత్రం అలారమ్ పీస్ లేదు. మా అమ్మాబాపుల దగ్గర అలారమ్ పీస్ వుంది. కానీ దానితో సంబంధం లేకుండా వాళ్లు నిద్ర లేచేవాళ్లు.
దీనికి కారణం - వాళ్ల బాధ్యత. అది వాళ్ల మనసులో వుండేది. అందుకే వాళ్లు అందరినీ నిద్ర లేపేవాళ్లు.
తరువాత, తరువాత మా అలారమ్ గడియారం ఎన్నో రూపాంతరాలు చెంది కన్పించకుండా పోయింది. టెలిఫోన్ స్మార్ట్ఫోన్‌గా రూపాంతరం చెందింది. గడియారమే కాదు, ప్రపంచమే స్మార్ట్ఫోన్‌గా మారిపోయింది.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001