S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సమసమాజం అంటే..

సమస్తలోకా సుఖినోభవంతు.. సర్వేజనా సుఖినోభవంతు.. అంటారు భగవాన్ విశ్వయోగి విశ్వంజీ. సమస్త లోకాలు సుఖంగా ఉండాలని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సుఖంగా ఉండాలని స్వామి ఆశీర్వదించారు. 2020 మార్చి 5 న విశ్వంజీ 76 వ జన్మదినోత్సవం. ఈ సందర్భంగా ఆంధ్రభూమి దినపత్రిక ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రశ్న: గురువు అంటే ఎవరు? వారి వల్ల ఈ సమాజానికి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది
జవాబు: సమాజంలో అన్ని వ్యవస్థలు ఏర్పాటైన తర్వాత రుషులు దూరదృష్టితో ‘గురు’ సంప్రదాయాన్ని మానవజాతికి అందించారు. ప్రతి వ్యవస్థ, ప్రతి వ్యక్తి ధర్మబద్దంగా నడవాలని, ప్రకృతి బద్ధంగా జీవించాలని, విశ్వశాంతి లక్ష్యంగా ముందుకు సాగాలన్నదే గురుపీఠాల లక్ష్యం, ధ్యేయం, కర్తవ్యం. పిల్లలను సమాజానికి ఉపయోగపడేవిధంగా తీర్చిదిద్దడం, సంస్కారం నేర్పించడం ఉపాధ్యాయులైన గురువుల లక్ష్యంగా ఉండాలి. ఏ వ్యక్తి కూడా ధర్మవిరుద్దంగా జీవించకుండా, మంచి మనిషులుగా తీర్చిదిద్దాలి. చక్రవర్తిని, ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులను శాసించే అధికారం గరువులకు ఉంటుంది. ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత శక్తిపీఠాలపై ఉంది. శ్రీకృష్ణుడు లేకపోతే భారతం లేదు. భారతం లేకపోతే భగవద్గీత ఉండేది కాదు. మనిషి ఎలా జీవించాలో జగద్గురువైన శ్రీకృష్ణపరమాత్మ గీతద్వారా బోధించారు. ఆదర్శ జీవితాన్ని ఆచరణలో చూపిన శ్రీరామచంద్రుడు ‘సకల మానవ గురువు’. గౌతమ బుద్ధుడు, మహావీరుడు, ఏసుక్రీస్తు, ప్రవక్త మహమ్మద్ తదితరులంతా శాంతి సందేశాన్ని లోకానికి అందించారు.
ప్ర: అధర్మం పెరిగినప్పుడు భగవంతుడు అవతారమెత్తుతారని అంటారు.. నిజమేనా! మనిషి రూపంలో ఉన్న భగవంతుడిని గుర్తించడం ఎలా?
జ: భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు. ఆయనకు ఒక రూపం అంటూ ఉండదు. గాలిలో, అగ్నిలో, భూమిలో, నీటిలో, చెట్టుపుట్టల్లో, ఆకాశంలో..ఇలా..విశ్వమంతా ఆయనే నిండి ఉన్నాడు. ప్రతి మనిషిలో భగవత్ శక్తి, దైవత్వం ఉంటుంది. ఎవరికివారే తమలో ఉండే కోపం, క్రోధం, లోభం, ఈర్ష్యాద్వేషాలను తొలగించుకోవాలి. అవలక్షణాలను తొలగించుకుని, దివ్యత్వాన్ని జాగృతం చేయాలి. ప్రతివ్యక్తిని పరిపూర్ణమానవుడిగా నిలబెట్టడమే కలియుగంలో భగవత్ అవతార లక్ష్యం..్ధ్యయం. ప్రేమను పెంచి, పంచుకుంటే ప్రతివ్యక్తి దైవస్వరూపుడే, పరిపూర్ణమానవుడే అవుతాడు.
ప్ర: ప్రస్తుతం ఎవరూ శాంతిగా జీవించడం లేదన్న భావన వస్తోంది.
జ: మనిషిలో శాంతి సహజంగానే ఉంటుంది. మనకై మనమే అశాంతిని సృష్టించుకుంటున్నాం. ఉన్నదాంతో సంతృప్తిపడాలి. ఇతరులతో పోల్చుకుని మనస్సు పాడుచేసుకోవద్దు. అన్నదమ్ములు, కుటుంబంలో సభ్యులు పోట్లాడుకోవడం మన సంప్రదాయం కాదు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో జీవిస్తే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. రాజకీయాల్లో ఐక్యత లేకపోవడమే సామాజిక అశాంతికి ప్రధాన కారణం.
ప్ర: త్రేతాయుగం, ద్వాపరయుగాల్లో సత్యం, ధర్మం, న్యాయం బాగా ఉండేవి.. కలియుగంలో ఇవి లోపించాయి అంటుంటారు.. నిజమేనా?
జ: త్రేతాయుగం, ద్వాపరయుగాల్లో రాక్షసులు ప్రత్యేకంగా ఉండేవారు. ఇప్పుడు ప్రతి మనిషిలో దైవీగుణాలు, రక్షస ప్రవృత్తి గుణాలు ఉన్నాయి. రాక్షస గుణాలను అదుపులో ఉంచుకుని దైవీగుణాలతో జీవించాలి. పాలకులు ధర్మంగా ఉంటే సమాజం ధర్మంగా ఉంటుంది.
ప్ర: కుటుంబ జీవనం ఎలా ఉంటే బాగుంటుంది?
జ: భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శంగా ఉన్నదంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనె్నడీ ప్రశంసించారు. పోప్‌పాల్ కూడా భారతీయ కుటుంబ వ్యవస్థ మంచిదంటూ కితాబిచ్చారు. భార్యాభర్తలు శారీరక కలయికకోసం పెళ్లి చేస్తారు. నాగరికం పేరుతో విశృంఖలత్వ జీవన విధానం మంచిది కాదు. ప్రేమను పెంచుకుని, పంచుకోవడం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది. అది సామాజిక శాంతికి దోహదపడుతుంది. పిల్లల పెంపకం బాధ్యత తల్లిదండ్రులదే. జాతిరత్నాలుగా వారిని తీర్చిదిద్దాలి.
ప్ర: పీఠాధిపతులు, మఠాధిపతులు తదితరుల బాధ్యత ఏమిటి?
జ: నేడు పీఠాధిపతులు, మఠాధిపతుల మధ్య ఐక్యత కొరవడ్డది. ఒక్కొక్క విధానాన్ని ప్రచారం చేస్తూ, జనంలో చీలిక తెస్తున్నారే తప్ప, ప్రజలంతా సమానమేనని, వసుధైక కుటుంబం ఏర్పాటుకు పనిచేయకపోవడం పెద్దలోటుగా చెప్పుకోవచ్చు. పీఠాలకు లక్షలాది మంది వస్తుంటారు. వారిని మంచిమనుషులుగా తీర్చిదిద్దగలగాలి. స్వధర్మాన్ని పరిరక్షించుకుంటూనే ఇతరుల ధర్మాన్ని గౌరవించాలే తప్ప హాని కలిగించవద్దు. గురువులు తన తపశ్శక్తిని బీజరూపంలో శిష్యులకు ఇస్తారు. మంత్రసిద్ధిద్వారా దాన్ని ఫలవంతమైన జీవనం కోసం వాడాలి. జీవితాన్ని ప్రేమమయం, అమృతమయం చేసుకోవాలి. గురుసంప్రదాయానికి మారుపేరు భారతదేశం.
ప్ర: విశ్వశాంతి ఎలా సాధ్యం?
జ: విశ్వమంతా పంచభూతాలతో ఏర్పడ్డది. పంచభూతాలైన గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం ప్రశాంతంగా ఉంటే విశ్వం ప్రశాంతంగా ఉంటుంది. పంచభూతాల మధ్య సమతుల్యత లోపిస్తే వాటి మధ్య ఘర్షణ మొదలై వైపరీత్యాలు వస్తాయి. నేడు నాగరికం పేరుతో పంచభూతాలను కలుషితం చేస్తూ, వైపరీత్యాలకు మనుషులే కారణమవుతున్నారు. పశుపక్ష్యాదులు ధర్మబద్దంగా జీవిస్తున్నాయి. మనుషులే ధర్మానికి హాని కలిగిస్తున్నారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు, పాలకులు పంచభూతాలను పరిరక్షించేందుకు, అవి కలుషితం కాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. పంచభూతాలు మనిషి జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో ఆలోచించి, ప్రభుత్వాలే అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ప్రకృతిని కాపాడుకోవాలన్న అంశంలో ప్రజల్లో, పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోతే జీవితం దుర్భరంగా మారుతుంది. పంచభూతాలు శాంతింగా ఉండేందుకు మన రుషులు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ వస్తున్నారు.
ప్ర: ప్రభుత్వం ఏదైనా పాలన ఎలా ఉండాలి?
జ: పరిపాలన ప్రజారంజకంగా, ధర్మబద్ధంగా ఉండాలి. ఒక రాజకీయ పార్టీకి ప్రజలు పట్టం కడితే సమాజంలో ఆనందం వెల్లివిరిచేలా, శాంతియు జీవనం కొనసాగేలా పరిపాలన ఉండాలి. స్వయంశక్తి సంపన్నులుగా ప్రజలందరినీ తీర్చిదిద్దాలి. ప్రజలు తమ అవసరాలకోసం ప్రభుత్వంపై ఆధారపడేలా మారకుండా చూడాలి. ప్రతి కుటుంబానికి ఆహారం, దుస్తులు, ఇల్లు ఉండాలి. అందరికీ ఉచితంగా విద్య, వైద్యం అందించగలగాలి. ప్రతి ఒక్కరు శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా బలంగా మారేలా చూడాలి. ప్రభుత్వానికే ప్రజలంతా చేయూత ఇచ్చేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రజల్లో ఆత్మవిశ్వాసం, నమ్మకం కలిగించాలి. ప్రశాంతంగా నిద్రపోవచ్చన్న భావన ప్రజల్లో కలిగించగలగాలి.
ప్ర: సమసమాజ స్థాపన అంటే ఏమిటి?
జ: ప్రజలంతా సమానులే అన్న విధంగా సమాజం ఉండాలి. కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రజల అవసరాలు తీర్చగలగాలి. రాజ్యాంగబద్ధంగా సలక జనులకు సమాన హక్కులు ఇవ్వాలి. ఆచరణలో వీటిని చూపించాలి. ఎవరు తప్పు చేసినా శిక్ష ఉండాలి. అవినీతి లేని పాలన సాగాలి. సమసమాజమంటే ఇదే.
ప్ర: యోగశక్తి దేనికి ఉపయోగపడుతుంది?
జ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగుల యోగశక్తి, మహాత్ముల మహాత్యం విశ్వశాంతి కోసమే ఉపయోగపడుతోంది.
ప్ర: విశ్వరక్షణ ఎలా జరుగుతుంది?
జ: ప్రకృతి భగవత్ స్వరూపం, ప్రకృతి నియమాల ప్రకారం నడుస్తుంది. ఫృథ్విరక్షణకు అష్టదిక్పాలకులు ఉన్నారు. ఎనిమిది దిక్కులా ఎనిమిది శక్తులు ఉన్నాయి. భగవత్ స్వరూపమైన ప్రకృతిలో మనం జోక్యం చేసుకోకుండా ఉంటే మంచే జరుగుతుంది.