S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంస్కార్ భారత్

జాబాలీ! లేవరా, బారెడు ప్రొద్దెక్కింది.
ఊ. కాసేపుండు తాతయ్యా, లేస్తాను.
ఎంతసేపు పడుకుంటావు? ప్రొద్దెక్కేవరకు పడుకోవడం దరిద్ర లక్షణంరా. లేలే.
ఏమిటి తాతయ్యా నువ్వు రోజూ లేపి చంపుతుంటావు. అవును బారెడు ప్రొద్దెక్కిందంటావు. అసలు సూర్యుడు అస్తమిస్తాడా ఉదయిస్తాడా ఏమిటి? నీ చేదస్తం గాని.
ఏడిసావులే. ఆ మాత్రం నాకూ తెలుసు తిరిగేది భూమే గానీ సూర్యుడు కాదని. అన్నాడు నిగమాంతశర్మ.
ఐతే సూర్యుడు ఉదయించాడంటావేమిటి? అన్నాడు జాబాలి తాత పప్పులో కాలేశాడన్న గర్వంగా.
ఇది నేనన్న మాట కాదురా మనవడా! వేలవేలేండ్లుగా అందరూ రోజూ పొద్దునే్న చూస్తున్న దాన్ని గురించి వేదర్షులు చెప్పిన మాటేరా.
అయితే వాళ్లు అలా ఎందుకు చెప్పారు? బహుశా వాళ్లకు కూడా బాగా తెలియదేమో. ఎగతాళిగా అన్నాడు జాబాలి.
నీ మొహం ఋషులకు తెలియకపోవడమేమిటి? నువ్వు రైల్లో చాలా సార్లు వెళ్లావు కదా కిటికీలోంచి చూస్తే ఎలా కనిపించింది? ప్రశ్నించాడు నిగమాంతశర్మ.
పక్కనున్న చెట్లు, పొలాలు, కొండలు అన్నీ వ్యతిరేక దిశలో (వెనక్కి) కదిలిపోతున్నట్లు కనిపిస్తాయి.
మరి కదిలిపోతున్నది రైలు కదా. కదలనివి కదులుతున్నట్లు ఎందుకలా కనిపించాయి?
అది కూడా తెలియదనుకొన్నావా? తాతయ్యా! అలా కదలిపోవడానే్న సాపేక్ష సిద్ధాంతమంటారు. మాకు సైన్సులో ఆ లెసన్ వచ్చింది. అన్నాడు తేలిగ్గా జాబాలి.
సూర్యుడు ఉదయించినట్లు, అస్తమించినట్లు కనబడటం కూడా అంతేరా. అలా ఋషులు చెప్పిన మాట వెనకాల కూడా ఉన్నది మీ మాస్టారు చెప్పారన్నావు ఆ సిద్ధాంతమే. అంటూ ఒక్క మొట్టికాయ వేశాడు తాత శర్మ.
మరి తాతయ్యా భూమే తిరుగుతుందని, సూర్యుడు తిరగడు అన్న విషయం భారతీయులకు తెలియదని మా మాస్టారు చెప్పారేమిటి? అడిగాడు జాబాలి అయోమయంగా.
ఔను మీ మాస్టారే కాదు అందరూ అలానే చెబుతారు. ఎందుకంటే తెల్లమొగాల వాళ్లు (ఆంగ్లేయులు) భారతీయులకు అసలు విజ్ఞానశాస్తమ్రే తెలియదని తెల్లమొగాలవాళ్లే రాసిన పుస్తకాలను చదువుకొని ఆ పాఠాలే చెప్పేవాళ్లు అలానే చెప్పక మరేం చెబుతారు? అన్నాడు శర్మ నిస్పృహగా.
అయితే తాతా! సాపేక్ష సిద్ధాంతాన్ని క్రీ.శ. 1916లో కనిపెట్టిన ఐన్‌స్టీన్ కంటే ముందే వేదర్షులకు తెలుసా? ఆశ్చర్యంగా అడిగాడు జాబాలి. భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా భారతీయ గురువుల చేతనే భారతీయ విద్యార్థులకు తరతరాలుగా బోధింపబడుతున్న మారని విద్యావ్యవస్థను చూసి నవ్వాలో ఏడవాలో తెలియని శర్మ దీర్ఘంగా నిట్టూర్చి కాసేపటికి ఇలా అన్నాడు. ఒరే తాతా! ఋషులకు తెలియపోవడానికి సాపేక్ష సిద్ధాంతం ఐన్‌స్టీన్‌కు ముందు లేదేమిటా? ఐన్‌స్టీన్ రాసిన గ్రంథం లభించినట్లుగా అనేక కారణాల వల్ల మనకు ఋషుల శాస్త్ర గ్రంథాలు లభించకపోవడం వలన భారతీయులకు ఆ విషయమే తెలియదనుకొంటున్నారు కానీ అసలా విషయమే తెలియకపోతే భూభ్రమణం గురించి, సూర్య కేంద్రక సిద్ధాంతం గురించి ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రంథాలని ప్రఖ్యాతి పొందిన వేదాలలో ఋషులు ఎన్నో శాస్ర్తియాంశాలను చెప్పగలిగేవారా? అవే తరువాత కాలంలో వచ్చిన విజ్ఞానశాస్త్ర గ్రంథాలకు ఆధారాలయ్యాయి. తెలుసా? విను మరి. ఉదాహరణకు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉందని నాల్గు వేదాల్లో ఋషులు ఏకకంఠంతో ఎలా చెప్పారో.
సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది
మం. అయం గౌః పృశ్ని రక్రమీత్ అసదన్ మాతరంపురః, పితరంచ ప్రయన్‌త్స్వః
ఋ.మం.10.సూ.189. మం. 1/శు.య.వే.3.6./అథర్వ. 1.31.1./సా.వే.630/1376
(్భ. సూర్యాకర్షణ చేత జలసహితమైన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. తల్లి అయిన భూమి చుట్టూ తిరిగే చంద్రుడు తండ్రి అయిన సూర్యుని చుట్టూ సూర్యప్రభావం చేతనే తిరుగుతున్నాడు).
మం. ప్రదైవో దాసో అగ్నిర్దేవ ఇందో న మజ్మనా
అను మాతరం పృథివీం వి వావృతే తస్థౌ నాకస్య శర్మణి. సా.వే.మం.7
(్భ. పరమేశ్వరుడు భూమిని సూర్యమండలం చుట్టూ తిప్పుచున్నట్లు బలశాలి అయిన దివోదాసుడనే రాజు రాజ్యాన్ని తనకనుకూలంగా తిప్పుకొని పాలిస్తున్నాడు)
మం. దౌర్భధాన దేవ సవితః పరస్యాం పృథివ్యాం శతే,
ద్వేష్టి యంచ వయం ద్విష్మస్తమతో మా వౌక్. (శు.య.వే.అధ్యా. 1 మం.26)
(్భ. సూర్యుడు సమస్తవస్తుజాలాన్ని వహించే భూమిని సూర్యుడు తన కిరణజాలమనే పాశాలతో ఆకర్షించి బంధించిన విధంగా మమ్ము బంధించే శత్రువులను, ధర్మవిరోధులను సామ దాన భేద దండోపాయాలతో బంధిస్తూ ఉన్నాము)
మం. దేవస్యత్వా సవితుః ప్రసవేశ్వినో ర్భాహభ్యాం పూష్ణో హస్త్భ్యాం,
అగ్నీ షోమాభ్యాం జుష్టన్ని యు నజ్మి. శు.యజు.వే. 6.9.
(్భ. సూర్యుడు తన కిరణాలలోని ధారణ, ఆకర్షణ శక్తుల చేత భూమిని ఆకర్షించి పట్టుకొనియున్నట్లు శిష్యుడా! నేను నిన్ను ప్రీతిపూర్వకంగా ఆకర్షించుచున్నాను).
ఆగాగు తాతయ్యా! గ్రహనక్షత్రాదులన్నిటిని సూర్యుడే ఆకర్షించి నిలుపుతున్నాడట కదా. వేదర్షులకా విషయం తెలుసా మరి? అడిగాడు జాబాలి అది తెలియకపోవచ్చునేమో నన్న ఉద్దేశంతో.
సూర్య కేంద్ర సిద్ధాంతం
పిచ్చి మొహమా! కదా అంటున్నావు. ఇంతకీ నీకా విషయం తెలియదా? పోనీ. సూర్యకేంద్రక సిద్ధాంతమని నేడు శాస్తజ్ఞ్రులు చెప్పే ఆ విషయం కూడా ఋషులకు బాగా తెలుసు.
మం.మహిత్రీణా మవోస్తు ద్యుక్షం మిత్రశ్యార్యార్యష్ణు దురాధర్షం వరుణస్య. (శు.యజు.వే. అధ్యా.3 మం.31)
(్భ. ఓ ఈశ్వరా! శరీరమూ, విశ్వంలోని ప్రాణవాయువు వలన, ఆకర్షణ శక్తి చేత విశ్వంలోని సర్వపదార్థాలను ఆకర్షించే సూర్యశక్తి వలన మరియు విశ్వంలోని జలం వలన సకల విధాల మేము నిశ్చల స్థితిని, సంరక్షణను పొందుతాము)
మం. మిత్రో దాధార పృథివీ ముతద్యాం, మిత్రః కృష్టీః కృ.య.వే. కాం 3.ప్ర 4అను 11 మం.16, ఋ.1.164..2.
మం. త్రినాభి చక్ర మజర మనర్వం యేనామా విశ్వాభువనాని తస్థుః = ఋ 1.164.2/ అధర్వ. వే. 9.9.2 క్రీ.శ. 1453లో కోపర్నికస్, క్రీ.శ. 1632లో గెలీలియోలు కనిపెట్టింది ఈ సిద్ధాంతానే్న.
తాతా! ఓ సందేహం. మన పూర్వులు భూమి బల్లపరుపుగా ఉందన్నారు కదా. అప్పుడది సూర్యుని చుట్టూ తిరుగుతుందని ఎలా చెప్పారు? జాబాలి అన్నాడు. ఒరే. ఆకును చూపించి దాంట్లో పత్రరంధ్రాలు (చిల్లులు) ఉన్నాయా అంటే ఎవరైనా ఒప్పుకొంటారురా? అవును. సైన్సు స్టూడెంట్ తప్ప ఎవడూ ఒప్పుకోడు. మరైతే సైన్సు తెలియని సామాన్యుడికి నువ్వు చిల్లులున్నాయని చెబుతావా? చెప్పను ఏమి? వాడికి సైన్సు తెలియదు కాబట్టి. తన దోవకు వచ్చిన మనవణ్ని చూచి సంతోషించి, ఔను అలాగే భూమి పైకి బల్లపరుపుగా కనబడుతుంది కాబట్టి అలా చెప్పారే గానీ వేదర్షులు మాత్రం భూమి గుండ్రంగానే ఉందని, అలా ఉన్న భూమి దక్షిణ ద్రువంలో ప్రజలు జీవిస్తున్నారని వర్ణించారు. విను. ఆ మంత్రం అంటూ గణగణా చదివాడు శర్మ.
మం. చక్రాణా సః పరీణహం పృథివ్యా హిరణ్యే న మణినా శుంభమానాః
న హిన్వానా సస్తి తిరుస్త ఇంద్రం పరిస్పశో అదధాత్ సూర్యేణ. ఋ. మ. 1. సూ. 33. మంత్రం. 8 భూమికి గురుత్వాకర్షణశక్తి.
తాతగారు చెబుతున్న కొద్దీ కొంటె ప్రశ్నలు పెరిగిపోసాగాయి. జాబాలీకి మనస్సులో. అన్నీ సరే భూమి గుండ్రంగా తిరుగుతూందని ఋషులు చెప్పారు కదా. మరి నేలపై ఉండే జనం, చెట్లు చేమలు, కొండలు, నదులు, సమముద్రాలు ఇలా అన్నీ తిరిగే భూమి వేగానికి ఎగిరి దూరంగా పడిపోవాలి కదా అలా ఎందుకు పడిపోవడం లేదు? అడిగాడు. తాత జవాబు చెప్పలేడేమోనని. ఏరా! భూమికి గురుత్వారక్షణశక్తి ఉందని న్యూటన్ చెప్పింది వేదర్షులకు తెలియదేమోననేగా నీ ప్రశ్న? భూమికా శక్తి న్యూటన్‌కు ముందే ఉంది. తెలిసినా తెలియకపోయినా ఎప్పుడూ ఉండే సృష్టి ధర్మాన్ని ‘‘ఋత’’మంటుంది వేదం. భూమికున్న ఆ ఋతం ఋషులకు తెలిసిన తరువాతే న్యూటన్‌కు తెలిసింది. ఆపిల్ పండు నేలపై పడటం చూచి అదలా ఎందుకు పడిందని న్యూటన్‌కు వచ్చిన ఆలోచనే క్రీ.శ. 505లోనే వరాహమిహిరుడికీ కలిగి భూమికి ఆకర్షణ శక్తి ఉందని ఎప్పుడో కనుగొన్నాడు.
శ్లో. గగన ముపైతి శిఖిశిఖా క్షిప్తమపి క్షిత ముపైతి గురుకించిత్
యద్వదిహ మానవానాం అసురాణాం తద్వదేవాంగః పంచసిద్ధాంతి అధ్య.13 శ్లో.4.
శో. ఈ మాటే సూర్యసిద్ధాంతమనే గ్రంథంలో (అధ్యా.12 శ్లో. 32) కూడా ఇట్లే చెప్పబడింది.
శ్లో.మధ్యే సమంతాదండస్య భూగోళో వ్యమ్ని తిష్ఠతి.
బిభ్రాణ పరమాం శక్తిం బ్రహ్మణో ధారణాత్మికామ్.
చిత్రమేమంటే భూమికి తన పరిధిలోని పదార్థాలనే కాదు అంతరిక్షంలోని వానిని కూడా ఆకర్షించుకునే విశేష శక్తి కూడా ఉందని భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణిలోని భువనకోశమనే 6వ అధ్యాయంలో పేర్కొన్నాడు.
శ్లో. ఆకృష్టిశక్తిశ్చ మహీతయా యత్ స్వస్థం గురుస్వాభిముఖం స్వశక్త్యా
ఆకృష్యతే తత్పతతీవభాతి సమే సమంతాత్ క్వ పతత్వియం ఖే.
వీరు చెప్పిన ఈ సిద్ధాంతానే్న వేలవేల ఏండ్లకు ముందే సామవేదం ‘‘జగదీశ్వరా! భూమి సకల పదార్థాలను తనవైపే ఆకర్షించుకుంటున్నట్లుగా మాస్తుతులన్నింటినీ నీవే ఆకర్షించుకొనుచున్నావం’’టూ
మం. ఇమే త ఇంద్ర! తే వయం పురుష్టుత యే త్వారభ్యం చరామసి ప్రభూవసో,
న త్వదన్యో గిర్వణో గిరః సఘత్ క్షోణీరివ ప్రతి తద్దర్య నో వచః సామ. 373.
అని ప్రస్తావించింది. ఇలా ఒకటేమిటి ఈనాడు కనుగొన్న అనేక శాస్త్రాంశాలు ప్రాచీన వేద, శాస్త్ర గ్రంథాలలో కనబడుతున్నాయంటూ శర్మ ఆగాడు. ఇంకేమైనా సందేహాలున్నాయా అన్నట్టు. మనవడు జాబాలి ఏదో ఆలోచనలో పడి కొద్దిసేపటికి తేరుకొని ‘‘ఆ తాతా! భారత, రామాయణ, పురాణాలలో దేవతలతో బాటు మనుషులు కూడా విమానాలలో తిరిగేవారని చెప్పారు కదా. నిజంగా అవున్నాయా? మనవడి కుతూహలానికి ముచ్చటపడిన శర్మ వాడిని నిరుత్సాహపరచకూడదని సర్దుకు కూర్చుని ఇంకా చెప్పబోతుండగా భర్త కోసం కాఫీ తెస్తూ శారదమ్మ గదిలోకి వచ్చింది.’’ ఒరే జాబ! తాతను బలేబలే ప్రశ్నలడుగుతున్నావే. ఇక తాతను విసిగించకు. వాటికి జవాబులు నేను చెబుతాన’’ నంటూ కాఫీకప్పు టీపాయ్ మీద పెట్టి చెప్పడమారంభించింది. నిజమే ఇప్పుడున్నవన్నీ అప్పుడూ ఉన్నాయి. విను మరి. రెండు రెక్కలుండే విమానంలో మనమిప్పుడు విహరించినట్లే అప్పుడూ విహరించేవారు
మం. ఆ విద్యునద్భిర్మరుతః స్వర్కైరథేభిర్యాత ఋష్టిమద్భి రశ్వపర్ణై
ఆ వర్షిష్ఠయాన ఇషా వయో న పప్త తాసుమాయాః ఋ.మం.1.సూ.77. మంత్రం.1.
అంతేకాదు. గుర్రాలు, కళ్లాలు లేని మూడు చక్రాల వాహనాలలో మనుషులు ఆటోల్లో మనలాగే అప్పుడూ తిరిగేవారు.
మం. అ నశ్వజాతో అ నభీశు రుక్థ్యో రాతస్తృచక్రః పరివర్తతే రజః, ఋ.మం.4. సూ.36 మంత్రం.1.
బస్సుల్లో మనం ప్రయాణిస్తున్నట్లే ఆనాడూ వాయుశక్తితో వేగంగా వెళ్లే వాహనాల్లో వాళ్లూ పయనిస్తూ ఉండేవారు.
మం. క్రీళం వః శర్థో మారుత మనర్వాణం రథే శుభం కణ్వ అభి ప్ర గాయత, ఋ.మం.1.సూ. 37. మంత్రం.1
మం. వాతరంహో భవ వాజి న్యుజ్య మాన ఇంద్రస్యేవ దక్షిణః శ్రీయైధి,
యుంజంతు త్వా మరుతో విశ్వ వేదస ఆతేత్వష్టా పత్సు జవం దధాతు. శు. యజు.వే. అధ్యా.9. మం.8.
మం. పృథివ్యాః సధస్థా దగ్ని పురీష్య మంగిర స్వదాభరాగ్నిం పురీష్యమంగిర
స్వదచ్ఛే మోగ్నిం పురీష్య మంగిరస్వద్బ రిష్యామః శు.యజు.వే. అధ్యా.11. మం.16.
జాబూ అర్థమయ్యిందా ఎప్పుడో, మనలాగే జల, వాయు, సౌర శక్తుల్ని వినియోగించి వాళ్లు కూడా వాహనాల్లో ప్రయాణించేవారని, ఈ మాటలన్నీ జాబాలికి చాలా ఆశ్చర్యమనిపించి ‘‘బామ్మా! కన్యాశుల్కంలో’’ అన్నీ వేదాలలో ఉన్నాయష’’ అని ఎగతాళిగా గురజాడ అనిపించారేమిటి?’’ అని ప్రశ్నించాడు. ఒరే వెర్రిమొహం. ఎగతాళి కాదది. చదువు సంధ్యలేమీ లేని వారికి కూడా వేదాల్లో అన్నీ ఉన్నాయన్న విషయం తెలుసునని ఆయన అభిప్రాయంరా అంది శారదమ్మ ఠక్కున. అంతటితో ఊరుకోలేదు. దేవుణ్ని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడని చెబితే బ్రహ్మాండమొకటే గానీ బ్రహ్మాండకోటులెక్కడున్నాయని? హేతువాదులు ఎగతాళి చేసేవారు. మరి ఈమధ్య శాస్తజ్ఞ్రులే రెండు వందల సౌరమండలాలున్నాయని, సూర్యుడి నుండి ఓంకార ధ్వని వెలువడుతూందని ఎనె్నన్నో కనుగొన్నారు. ఇప్పుడు వారు బ్రహ్మాండమండలాలున్నాయని చెప్పిన మాట ఋగ్వేదం మరియు కృష్ణయజుర్వేదం వేలవేల ఏండ్ల కిందటే దిక్కులేడింటిలో అనేక బ్రహ్మాండాలున్నాయని స్పష్టంగా చెప్పాయి.
మం. సప్తదిశో నానా సూర్యాః సప్తహోతార ఋత్విజ
దేవా యే సప్త తేభిః సోమాభి రక్ష న ఇంద్రాయేంద్రో పరిస్రవ. ఋ.మం.9 సూ.మంత్రమ్.3.
మం. యద్ధ్యావ ఇంద్ర తే శతగ్‌ం శతం భూమి రుతస్యుః,
నత్వా వజ్రిన్ సహస్రగం సూర్యా అను న జాత మష్టరోదసి. కృ.య.వే. కాం.2 ప్రపా.4 అనువా. 14 మం.3.
అమ్మబాబోయ్ బామ్మా! నీకు, తాతయ్యకు ఇన్ని విషయాలు తెలుసా! అంటూ మంచమీద నుంచి ఎగిరి ఒక్క గంతేసి జాబాలి బామ్మను తాతను పొదివి పట్టుకుని నువ్వూ, తాతయ్య వృద్ధాశ్రమానికి వెళ్లకండి ఇక్కడే ఉండిపోండి అంటూ గట్టిగా కౌగలించుకున్నాడు. ఎందుకురా? నాన్నా అంది శారదమ్మ మనవడి తల నిమురుతూ. ఎందుకేంటి బామ్మా! అమ్మా నాన్న ఎప్పుడూ ఇలాంటివేమీ చెప్పనే చెప్పరు. అసలు వాళ్లు నాతో సరిగా మాట్లాడటానికైనా టైముండదు. మీరేమో ఏ పండక్కో పబ్బానికో ఇలా వచ్చి అలా వెళ్లిపోతారు. ఇంట్లో తాతలు బామ్మలూ ఉండి స్కూళ్లల్లో, కాలేజీలలో ఎప్పుడూ చెప్పని ఇలాంటి కల్చరల్ మరియు సివిలైజేషన్ విషయాలు చెబుతూ ఉంటే మోదీగారు చెప్పినట్లు భారతదేశం స్వచ్ఛ్భారతే కాదు. సంస్కార భారతమే అవుతుంది. అవును. నాకు తెలియకడుగుతా అసలు మీరెందుకు వృద్ధాశ్రమానికి వెళ్లారు? ఆవేశంగానే అన్నాడు జాబాలి. ఆ మాట వినగానే మనవడెంతెత్తు ఎదిగిపోయాడో నన్న సంతోషంతో బాటు వాడికి పదేళ్ల వయస్సులో ఆశ్రమానికి వెళ్లవలసి వచ్చిన నాటి దుస్సంఘటనలన్నీ ఒక్కసారి మనస్సులోకి తొంగి చూశాయి. తెలియకుండానే వారి మనస్సు ఉద్రేకపడింది. కానీ ఎంతైనా కడుపుతీపి కదా. అడ్డువచ్చింది. కొడుకును వాడి కొడుకు ముందు చులకన చేయడానికి మనసు రాలేదు. అలాంటి సంఘటనలను ఇంటింటి రామాయణాలే అనుకొని ఎలాగో దంపతులు తమాయించుకుకున్నారు. ‘‘ఆ ఏమీ లేదురా. అమ్మానాన్నా ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్లాలి కదా. నువ్వూ, చెల్లీ పెద్ద చదువులకు త్వరలో రాబోతున్నారు. మీ అందరికీ మేమడ్డమెందుకని మేమే ఆశ్రమానికి వెళ్లాం.’’ అంటూ ఎంతైనా వాడు ఇంజినీరింగు చదువుతున్న పెద్దపిల్లాడు కదా. వాడికి తాతబామ్మలు ఇంట్లో జీతంలేని పనివాళ్లలా ఉండేందుకు కూడా మీ అమ్మానాన్నలకిష్టం లేదని చెప్పలేక మొహంపక్కకు పెట్టి చెప్పింది శారదమ్మ. ఆ వాలకం బట్టి ఏదో తన దగ్గర దాస్తున్నారని జాబాలి గ్రహించి ఏదో అడగబోయాడు జాబాలి.
అంతలో కొడుకుతో బాటు కొంగు నడుంలోకి దోపుకుంటూ కోడలు గదిలోకి చర్రున వచ్చింది. ‘‘వాడు అమెరికా వెళ్లవలసిన పిల్లాడు. వాడితో ఇంతసేపూ చెప్పిన ఊసిబోని కబుర్లు ఇహ చాల్లెండి. ఎనిమిదైపోయింది. ఆకలి వేయడం లేదేరా జాబూ? లే వచ్చి టిఫిన్ తిను.’’ అని వచ్చినంత వేగంగా అక్కడి నుండి కొడుకు వెళ్లిపోయాడు. కష్టపడి వినయమొలకబోస్తూ కొడుకు వెనకాల కోడలూ వెళ్లిపోయింది.
విషయమర్థమైపోయింది. ఎంతకాలమైనా వీళ్లు మారరని. ఆ సాయంకాలమే ఒకరి చెయ్యి మరొకరు పట్టుకొని శర్మ, శారదమ్మలు ఆటో ఎక్కారు ఆశ్రమానికి. టాటా చెబుతున్న కొడుకు కోడలి పక్కన జాబాలి కనబడలేదు. కనుచూపు మేర దాటిపోయింది ఆటో.

-డా.పాలకోడేటి జగన్నాథరావు 9490620512