S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శూన్యంలో జీవితం

ఎక్కడ మరిచిందో
ఎలా మరిచిందో... ఓ అంతుచిక్కని ప్రశ్న
సమస్యలన్నీ చుట్టూ తిరుగుతుంటే
ప్రశ్నగా తన కనుల ముందు తానే!

గతమంతా ఓ సుడిగుండం
కాలం తిప్పేసిన ఓ చక్రంలో
భవితన్నది ఉందో లేదో
బ్రతుకు జాడ మరిచాక
వర్తమానం వ్యధే
తెగిపడుతుందో... ముడి పడుతుందో...
తెలియని ఓ విచిత్ర అల్లికతో ప్రయాణం!

అడుగులన్నీ ముళ్లబాటలో సోగి
గుంతల్లో ఇరుక్కుపోయాక
దారంతా కన్నీటి నదులు కలిసిన సాగరాలే
ఆశల మకరందపు పరిమళాలు ఆవిరైపోతుంటే
పుట్టుకకే అర్థం లేని నిర్జీవం!

దిక్కులు పరచిన దిశలో
ఎల్లలు ఎరుగని తపన...
బంధాలు వీడి
రేయింబవళ్ల కలల ప్రయాణంలో
స్పందన లేని హృదయం
డబ్బే లోకమని పరుగులు పెడుతుంది!

నిజాన్ని శోధించలేక
అబద్ధాన్ని జీర్ణించుకోలేక...
నమ్మిన సిద్ధాంతమే జీవితమని
జీవితానికి అదే ప్రాణమని
వెర్రి ఆరాటంలో బ్రతుకు పోరాటం..!
మతి తప్పి గతి తప్పి
తనకు తానుగా నాలుగు కన్నీటి చుక్కలతో
దిక్కులు ఏకమైన ఏ దిక్కుకు కానరాక
ఆవహించిన వౌనాన్ని కవచంలా కప్పుకుంది
తనని తాను ఎక్కడ మరిచిందో...!!!

-స్వప్న మేకల