వలపు జల్లు
Published Sunday, 19 January 2020తొలకరి మొలకల చిరుజల్లు
చెలి పెదవుల చిరునవ్వు
చెలి నునువెచ్చని నిశ్వాసలు మేనుతాకి
నాలో.. లోలో.. తీగసాగె మరుల కొలుపు...
మెలగసాగె ఎనె్నన్నో వలపు పిలుపు పల్లవులు
పదము పదమునై పాడనా
అణువు అణువునై వేడనా
నీ కాలి అందియలు గల్లన
నా గుండెలోయల జల్లన
మెదిలెను ప్రేమ భావం
ఎద తెలియని ఏదో రాగం
భావములో భావమునై అను తాపమునై
రాగములో అనురాగమునై రస యోగమునై
చిరునవ్వు చాలు
చెలి మది గెలవటానికి
కనుగీటు చాలు
ఎద వీణియ మీటడానికి
నీ దరి చేరటానికి.