S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సాహిత్య సంక్రాంతి

సీ॥ పల్లవి చరణాలఁ బల్లవించెడి తెలుం
గుల పాట బోగి పొంగలియె కాగ
హృద్యవౌ మన తెల్గు పద్యమే కోవెలన్
స్వామి నైవేద్యమై సౌరుమీ అం
లలిత సమాహార కళల నాటకమె మేల్
చెలువైన బొమ్మల కొలువు కాగ
పలు పోకడలు పోవు వచన కవిత్వాలె
హేలలౌ గాలిపటాలు కాగ
భవ్య రుచులీను మన జానపదుల కళలు
లీల ముంగిట రంగవల్లికలు కాగ
సహిత రస మహితా భోగసంపదలను
తెలుగు సాహిత్య సంక్రాంతి తేజరిల్లె

-రామడుగు వేంకటేశ్వర శర్మ 9866944287