S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వైవిధ్య దామోదరం!

బాల్యంలో పంచతంత్ర కథలు, టామ్ అండ్ జెర్రీ - దాంతోపాటు జంగిల్ బుక్ ఆకర్షిస్తాయి. అడవి.. జంతువులు.. పక్షులు ఇట్లా అందరిలో ఓ జంతు ప్రపంచం దాగి ఉంటుంది. చిత్వ్రైవిధ్య దామోదరం!కారుడు నయాకోటి దామోదర్ మానసిక ప్రపంచంలో ఆ జంతుజాలం పిసరంత ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే ఆయన కాన్వాసుల నిండా పక్షులు.. జంతువులు.. పెంపుడు జంతువులు తమ ఉనికిని చాటుతాయి. వీక్షకులను పలకరిస్తాయి. ప్రసన్న వదనాలతో తదేకంగా చూసేలా చేస్తాయి. అబ్బురపరుస్తాయి.
పక్షులు - కీటకాలు, పురుగులు.. పచ్చదనం సృష్టించేందుకు చిన్న పిల్లల మనస్తత్వం అవసరం. పరిణతి చెందిన రీతిలో జంతుజాలాన్ని చూపాలనుకుంటే ఎదిగిన మనస్తత్వం అవసరం. విచిత్రమేమిటంటే ఈ రెండు తత్త్వాలు దామోదర్‌లో స్పష్టంగా కనిపిస్తాయి. ఆయనలోగల ఆ భావమంతా తిరిగి కాగితంపై కాన్వాసుపై ప్రతిఫలిస్తోంది. ఒకే ఫ్రేమ్‌లో ఈ రెండు తత్త్వాలను పలికించడం ఒక ప్రయోగం... ఓ సరికొత్త వ్యక్తీకరణ. ఆ ప్రయోగాన్ని, ఆ భావ వ్యక్తీకరణను అలవోకగా చేసే స్థాయికి దామోదర్ సాధన ద్వారా చేరుకున్నారు. దీని వెనుక కృషి - అంకితభావం, తాదాత్మ్యత, నిరంతర పరిశ్రమ.. తానులో తాను రమించడం కనిపిస్తోంది. ఇవన్నీ మొదటి శ్రేణి చిత్రకారుని లక్షణాలు. అవన్నీ దామోదర్‌లో దండిగా ఉన్నాయి కాబట్టి ఆయన ప్రథమ శ్రేణి చిత్రకారుడంటే అతిశయోక్తి అవదు.
ఈ చిత్రకారుడు గీసిన అనేకానేక చిత్రాల్లో ఒక దాంట్లో.. ఫోర్‌గ్రౌండ్‌లో ఓ పులి.. బ్యాక్ గ్రౌండ్‌లో ‘తెర’పై ఇతర అనేకానేక జంతువులు కనిపిస్తాయి. అవన్నీ అమాయక బాలుడు వేసినట్టుగా అస్పష్టంగా ఉంటాయి. బాల్య చేష్టగా కనిపిస్తాయి. ఈ ‘జెక్సాస్టా పొజిషన్’ శైలినే చిత్రకారుడు తనదైన సిగ్నేచర్ శైలిగా చేసుకున్నాడు. ప్రతి మనిషి ద్వంద్వానికి ప్రాతినిధ్యం వహిస్తాడని, అందుకే తాను బ్యాక్‌గ్రౌండ్‌లో బాలలు గీసిన చందంగా అసంఖ్యా జంతుజాలాన్ని చిత్రించానని, ప్రముఖంగా మాత్రం పులి దర్శనమవుతుందని, దాంతో అటు పిల్లల్ని ఇటు పెద్దల్ని తన బొమ్మల ద్వారా ఒకే ఫ్రేమ్‌లో ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నానని అంటున్నారు. అందరికి అర్థమయ్యే బొమ్మలు గీయడమే తన లక్ష్యమని అందులో భాగంగా ఈ శైలిని ఎంపిక చేసుకున్నట్టు ఆయన వివరించారు. ఆయన బొమ్మల్లో వినూత్నత.. విశేషత కనిపిస్తోంది. చిత్రకారుడి మానసిక స్థితి వీక్షకుడికి అతి సులువుగా బోధపడుతుంది. కొంచెం మనసు పెట్టి ఆలోచించేందుకు ఆస్కారం ఉంది. ఆ రకంగా చిత్రకారుడు తన ప్రయోగంలో కృతకృత్యుడయ్యాడని చెప్పాలి.
మరో కాన్వాసు మధ్యలో ఫోర్‌గ్రౌండ్‌లో రంగుల రామచిలుక ఎగురుతూ కనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో నలుపు తెలుపుల్లో అనేక ఆకృతులు, చిత్రాలు, మనుషులు, ఇల్లు అగుపిస్తాయి. ఈ చిత్రం మరో రకమైన అనుభూతికి ఆధారంగా నిలుస్తోంది. వైవిధ్యం స్పష్టంగా అవగతమవుతుంది. చిత్రకారుడికి కావలసిందే ఈ రకమైన వైవిధ్యం.. అందులో ఆయన విజయం సాధించారు.
మరో కాన్వాసులో ఓ ఎద్దు ఠీవిగా ఫోర్‌గ్రౌండ్‌లో కనిపిస్తుంది. దాని చూపులు వీక్షకులను గుచ్చుకుంటాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎర్రటి రంగుపై పక్షులు, పూలు, క్రూర జంతువులు, సాధు జంతువులు ఇట్లా మరో ప్రపంచం కొలువుదీరి కనిపిస్తుంది. అవన్నీ ఓ క్రమ పద్ధతిలో అమర్చినట్టు కనిపించడం విశేషం. నక్కాశి వాళ్లు బొమ్మల కథ కోసం తయారుచేసే ‘పరదా’ను ఇది గుర్తు చేస్తుంది.
ఈ థీమ్ ద్వారా మరో పద్ధతిలో దామోదర్ మరికొన్ని బొమ్మలు చిత్రించారు. ఓ కిటికీ లాంటి ఖాళీ స్థలం నుంచి ఓ మేలుజాతి గుర్రం తన తల బయటపెట్టి తీక్షణంగా చూస్తుంటే.. ఆ కిటికీ చుట్టూ ఉన్న గోడ లాంటి ‘స్పేస్’లో చెట్లు మేఘాలు చందమామ, చేప.. ఇట్లా వివిధ ఆకృతులు మరో స్టైల్‌లో కనిపిస్తాయి. మొత్తం ఫ్రేమ్ కొత్తదనంతో కొలువుతీరింది. తనదైన ప్రత్యేక శైలిలోనే అయినా వైవిధ్యంతో కూడుకుని కనిపిస్తుంది.
మరో బొమ్మలో ఓ పిల్లి ఫోర్‌గ్రౌండ్‌లో కూర్చొని పైకి చూస్తుంటే.. దాని వెనక అనేక ఆకారాలు అగుపిస్తాయి. అన్ని బొమ్మల బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే ఆకారాలు పిల్లల మనస్తత్వానికి ప్రతీకగా ఉంటాయి. ప్రధానమైన బొమ్మ మాత్రమే చేయి తిరిగిన చిత్రకారుడు గీసినట్టు కనిపిస్తుంది. అయితే అన్నీ ఒకే రకంగా గాక, వైవిధ్యంగా కనిపించడమే చిత్రకారుడి విజయంగా భావించాలి.
మరో బొమ్మలో ఓ పక్షి వృత్తాకార రంగుల గూడులో ఫోర్‌గ్రౌండ్‌లో కనిపిస్తే వెనకాల నలుపు తెలుపులో పిల్లలు గీసిన గీతలు.. ఆకారాలు అగుపిస్తాయి. ఇట్లా ఒకటా.. రెండా అనేక పద్ధతుల్లో తన సృజనను చిత్రకారుడు వ్యక్తం చేశాడు. అందులో వైవిధ్యం, ద్వంద్వం - దాగుడు మూతలు - ధైర్యం - దైన్యం, అమాయకత్వం - ప రిణత అన్నీ పరిఢవిల్లి కనిపిస్తాయి. ఈ ప్రత్యేక పద్ధతి దామోదర్‌ను పది మంది చిత్రకారుల్లో ప్రత్యేకంగా నిలిపింది. ఏ చిత్రకారుడైన కోరుకునేది ఇదే.
ఈ ప్రత్యేకతను సాధించేందుకు దామోదర్ చేసిన పరిశ్రమ తక్కువేమీ కాదు. లలిత కళలకు ఏ మాత్రం సంబంధం లేని కుటుంబంలో మెదక్ జిల్లా రామచంద్రాపురం (ఆర్.సి.పురం) సమీపాన గల సుల్తాన్‌పూర్ గ్రామంలో 1981లో జన్మించారు. ప్రాథమిక విద్య అక్కడే జరిగింది. బాల్యం నుంచి చదువుపైకన్నా బొమ్మలు గీయడంపై అధిక ఆసక్తి ఏర్పడింది. దాన్ని పసిగట్టిన పాఠశాల అధ్యాపకులు ప్రోత్సహించారు. చిత్రకళనే తిండి.. నిద్రగా భావించడంతో ఇంటర్ తరువాత 2002 సంవత్సరంలో జెఎన్‌టియులో బిఎఫ్‌ఏ కోర్సులో చేర చిత్రకళలోని మెళకువలు తెలుసుకున్నాడు. నాలుగేళ్లు అధ్యాపకులు ‘సాన’పట్టగా ప్రతిరోజూ ప్రాక్టీస్ చేయగా, సాధన కొనసాగించగా రంగుల రహస్యంగా కొంత తెలిసింది. ‘గీత’లోని మర్మం బోధపడింది. ఎన్నో ఎనె్నన్నో ఆకర్షణలు, ఎన్నో పాశ్చాత్య ఇజాలు, బొంబాయి బాయ్స్ లాంటి కొత్తతరం చిత్రకారుల దూకుడు, డిజిటల్ ప్రింట్స్‌లోని తేలికైన పనితీరు.. ఇట్లా ఎన్నో ఎదురైనా వాటిని మనసు పైకి తీసుకోకుండా, సరళమైన, స్వచ్ఛమైన తేలిక రంగుల్లో జంతు ప్రపంచాన్ని చిత్రించడానే్న ఇష్టపడుతున్నానని నయాకోటి దామోదర్ నవ్వుతూ చెప్పారు.
ఆ అంకిత భావంతో తనదైన ప్రత్యేక శైలిలో బొమ్మలు గీసినందుకు హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ నుంచి ఆయన బంగారు పతకాన్ని అందుకున్నారు. అనేక ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ప్రశంసలందుకున్నారు.
అదే కళాశాలలో ఎంఎఫ్‌ఏ కోర్సులో టాపర్‌గా నిలిచినందుకుగాను ఈ జనవరి తొలి వారంలో మరో బంగారు పతకాన్ని దామోదర్ అందుకున్నారు. ఆ రకంగా తన కెరీర్‌కు బంగారు బాటలు వేసుకుంటున్నారు. అలా తనపై బాధ్యత పెరిగిందంటున్నారు.
* నయాకోటి దామోదర్ 7659949822

-వుప్పల నరసింహం 9985781799