S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సాక్షి

అబ్బో! వలపోత
ఒక సుదీర్ఘ జీవన చరిత్ర
దుఃఖం
మన పరిస్థితుల్లోంచి చూసి
నిర్ణయించేది కాదు.

చలనశీలి కాలం
దుఃఖం ముందు స్తంభించి పోతుంది
కొండలు మరింత ఘనీభవిస్తాయి
ఆకాశం ఇంకా శూన్యవౌతుంది
చెట్టూ చేమలూ పశు పక్ష్యాదుల
సమస్త చరాచర జగత్తు
ఒక శ్రుతిలో ధ్వనిస్తాయి.

అబ్బో! ఏడుపు
ఒక ఎడతెరిపి లేని గాడుపు
ఏ మాధ్యమాలూ దీనికి సాటిరావు
మనకందేవి అరుపులే కాదు
అగాథంలోంచి ఉరిమే మెరుపులు
ఒక విహ్వలత
ఒక వొడువని కథ.

చీకట్లో కాలం కనిపించదు
స్పర్శిస్తుంది
వెలుగులో కూడా అంతే!

గడియారంలో నలిగే క్షణాలు
బిందు శకలాలై రాలుతాయి
దుఃఖ విరామం
మరో తుఫానుకు నాంది పలుకుతుంది
సానుభూతులు
కృత్రిమ తోరణాలౌతాయి
గుండె లయ తప్పినప్పుడల్లా
కాలం గాయపడుతుంది.
అబ్బో!
నిన్నటిదాకా జీవితం చలితం
ఇప్పుడు విచలితం. *

- డా. ఎన్.గోపి