S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

థూ

ఔను
నేను నేనే
నాకు జీవం లేదు
ద్రవ్యరాశి కొలమానం ఉంది

నా సృష్టికి
మూలం శోధించినా
దొరకట్లేదు

నన్ను మాత్రం
విరివిగా విచ్చలవిడిగా
ఎక్కడపడితే అక్కడ
జుర్రుకుంటున్నారు

పైకి ఇసిరిన రాయి
గురుత్వాకర్షణ శక్తి కన్నా
ఎక్కువ నా ఆకర్షణ
న్యూటన్ నన్ను
పరిగణనలోకి తీసుకుంటే
ఇంకెన్నో విశేషాలు

నాకై నిరీక్షణ
నేనో ఆదాయ వనరు
సహజ వనరులున్నా
నాకై అర్రులు చాచే
చచ్చేదాకా నా సాంగత్యంలో
నాకు చలనం లేదు
నన్ను బంధిస్తారు
నన్ను బిగిస్తారు
అవసరమైనప్పుడల్లా నాలో మునకేస్తారు
మళ్లీ కట్టేస్తారూ

పురాణాల నుండి
చరిత్ర దాటి
వర్తమానం దాకా
నేనిలా దాసోహమై
నా దాసులని చేసుకున్నా
నాకొరిగిందేమీ లేకున్నా
నేనో తరగని వనరులా
దినదినాభివృద్ధి పథంలో

నేను లేనిది రాజ్యం లేదు
నేను లేని ఊరు లేదు
నా ఉనికికి ప్రమాదమే లేదు
తరతరాలుగా నేనున్నా
ముందు తరాలు సైతం
నా వెంట

ప్రతి ఘోరకృత్యానికి
నన్ను సాకును చేస్తుంటే
బంధనాలు తెంచుకుని
రాజ్యంపై తుపుక్కున
ఉమ్మేయాలన్పిస్తుంది
ఐనా తుడిచేసుకుంటుందేమో
సిగ్గూ ఎగ్గూలేని రాజ్యం
నేనే మద్యాన్ని.

-గిరిప్రసాద్ చెలమల్లు.. 9493388201