S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (1.12.2019 నుంచి 7.12.2019 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాల్లో స్పష్టత. పదోన్నతులుంటాయి. గౌరవం పెంచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల మరింత మేలు. కొంత ఆలస్యం ఇబ్బంది పెట్టే సూచనలు. ఉన్నత లక్ష్యాల వైపు దృష్టి. పితృవర్గ వ్యవహారాల్లో అనుకూలత. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. కార్యనిర్వహణ దక్షత. కొత్త పనులపై ఆసక్తి. లాభాల వల్ల సంతోషం. పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తాయి. దైవ స్థానాలకు వెళ్లడం వల్ల ఇంకా మేలు కలుగుతుంది. సంతానవర్గ వ్యవహారాల్లో సంతోషం, సంతృప్తి కలుగుతాయి. క్రియేటివిటీ పెంచుకుంటారు. సంతృప్తిగా గడుపుతారు. వారాంతంలో ఖర్చులు పెట్టుబడులు అధికం. దూర ప్రయాణాలకు అవకాశం. విందులు, వినోదాలు, విహారాలు, విలాసాలకు అవకాశం.
వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం. అనుకోని సమస్యలున్నా శ్రమతో కార్యక్రమాలను నిర్వహిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు చేజారకుండా కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని అనుకోని సమస్యలున్నా అధిగమించి గౌరవం పెంచుకుంటారు. వారం మధ్యమంలో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాల్లో సంతృప్తి ఉన్నా శ్రమాధిక్యం. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. తండ్రివర్గ సంబంధమైన కార్యక్రమాల్లో చుక్కెదురు అవుతుంది. అప్రమత్తంగా మెలగాల్సి వస్తుంది. సామాజిక స్థితి మెరుగుపరచుకునే ప్రయత్నం ఉంటుంది. నిర్ణయాదులు లాభిస్తాయి. వారాంతంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. లాభాలపై దృష్టి అధికంగా ఉంటుంది. శ్రమ రహిత ఆదాయంపై మక్కువ అధికం.
మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య సమస్యలు. ఊహించని సంఘటనలు. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. ముఖ్య కార్యక్రమాలను వాయిదా వేయడం మంచిది. శ్రమ రహిత ప్రయోజనాలపై దృష్టి వద్దు. భాగస్వామ్యాల్లో ఒత్తిడులుంటాయి. పరిచయాలు స్నేహానుబంధాల విషయంలో జాగ్రత్త అత్యవసరం. వారం మధ్యమంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కార్యనిర్వహణ దక్షత. కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. సుదూర ప్రయాణాల గూర్చి చర్చిస్తారు. దైవ ధ్యానం, ఆధ్యాత్మిక ప్రయాణాలకు అనుకూలం. వారాంతంలో వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. అధికారిక కార్యకలాపాలలో పాల్గొంటారు. చేస్తున్న పనిలో నైపుణ్యం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు విస్తరిస్తాయి. కొత్త స్నేహానుబంధాలకు అవకాశం. పాతమిత్రుల కలయిక. వ్యాపార వ్యవహారాల్లో కొంత ఆచితూచి వ్యవహరించాలి. కొంత పోటీతత్వం ఉంటుంది. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. గుర్తింపు కోసం ప్రయత్నిస్తారు. ఆత్మవిశ్వాసంతో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బాధ్యతలు విస్తరిస్తాయి. వారం మధ్యమంలో అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. తొందరపాటు వల్ల కార్యనాశనం. దైవధ్యానం, దానం వల్ల కొంతవరకు మేలు కలుగుతుంది. నూతన నిర్ణయాదుల వాయిదా చాలా మంచిది. వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. వారాంతంలో ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. వైజ్ఞానిక, పరిశోధన, ఉన్నత విద్యారంగాల వారికి అత్యంత అనుకూలం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో వ్యతిరేకతలపై విజయం. పోటీలు అధిగమిస్తారు. గుర్తింపు పొందే ప్రయత్నం. రుణ రోగాదులను అధిగమించాల్సి ఉంటుంది. ఆలోచనల్లో వత్తిడులుంటాయి. శ్రమాధిక్యం. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. కార్యనిర్వహణ దక్షత. వారం మధ్యమంలో భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు, స్నేహానుబంధాలకు అనుకూలం. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. బాధ్యతలు సంతోషంగా నిర్వహిస్తారు. పాత మిత్రుల కలయిక. నిర్ణయాదులు కొంత ఆలస్యంగా తీసుకుంటారు. జీవిత భాగస్వామితో ప్రయాణాలకు అవకాశం. వారాంతంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్త వహించాలి. అనుకోని సంఘటనలకు అవకాశం. చికాకులుంటాయి. నూతన నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఈ వారం ప్రారంభంలో ఆలోచనలకు రూపకల్పన. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. సృజనాత్మక వ్యవహారాలు ఫలిస్తాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. సంతాన వ్యవహారాల్లో శుభ పరిణామాలు. నూతన కార్యక్రమాలపై దృష్టి. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ఆహార విహారాల్లో ఒత్తిడులుంటాయి. వారం మధ్యమంలో వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు లభిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. రుణ రోగాదులు ఇబ్బంది పెట్టే అవకాశం. అన్ని పనుల్లోనూ జాగ్రత్త వహించాలి. పోటీ రంగంలో అనుకూలత. శ్రమాధిక్యం. ఖర్చులు అధికం. విశ్రాంతి కోసం ప్రయత్నం. వారాంతంలో పరిచయాలు విస్తరిస్తాయి. స్నేహానుబంధాలూ సంతృప్తినిస్తాయి. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. సామాజిక గౌరవం పెరుగుతుంది.
తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఈ వారం ప్రారంభంలో సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాలకు అనుకూలం. గృహ వాహనాదుల గూర్చి చర్చిస్తారు. ప్రయాణావకాశాలు. విద్యారంగంలోని వారికి అనుకూలత. సౌఖ్యంగా గడుపుతారు. సామాజిక గౌరవం పెంచుకుంటారు. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. అధికారిక వ్యవహారాలకు అనుకూలం. వారం మధ్యమంలో ఆలోచనలు ఫలిస్తాయి. సృజనాత్మక వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. కొత్త పనులపై దృష్టి. సంతానవర్గ వ్యవహారాలకు అనుకూలం. వ్యాపార వ్యవహారాలకు అనుకూలం. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. సేవకవర్గ సహకారం లభిస్తుంది. విశ్రాంతి కోసం ప్రయత్నం. వారాంతంలో వ్యతిరేక ప్రభావాలను అధిగమిస్తారు. పోటీలు ఒత్తిడులను అధిగమిస్తారు.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. సేవక వర్గ సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. సోదరవర్గ వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మీడియా రంగంలోని వారికి అనుకూలత. శుభవార్తలు వింటారు. పాత మిత్రుల కలయిక. మాటల్లో కొంత జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. వారం మధ్యమంలో ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి. గృహ వాహనాది సౌకర్యాలపై దృష్టి. మాతృవర్గ బంధువుల ప్రభావాలుంటాయి. విందులు వినోదాలపై ప్రత్యేక దృష్టి. పార్టీలకు అవకాశం. సౌఖ్యంగా గడపడానికి ప్రయత్నిస్తారు. అయినా శ్రమ తప్పకపోవచ్చు. సామాజిక గౌరవం పెంచుకుంటారు. వారాంతంలో సంతానవర్గ వ్యవహారాలపై దృష్టి. ఇంటిలో సంతోషంగా గడుపుతారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో అనుకూలత. బంధువర్గ వ్యవహారాలను నిర్వర్తించే అవకాశం ఉంటుంది. బాధ్యతలు అధికవౌతాయి. శారీరక ఒత్తిడి తప్పకపోవచ్చు. నిర్ణయాదులు తీసుకోవడంలో ఆలస్యానికి అవకాశం. మాట తీరులో జాగ్రత్త వహించాలి. తొందరపాటు కూడదు. ముఖ్య నిర్ణయాదులు వాయిదా వేయడం శ్రేష్ఠం. వారం మధ్యమంలో సంప్రదింపులు సంతోషాన్నిస్తాయి. కొత్త వార్తలకు అవకాశం. మీడియా రంగంలోని వారికి గుర్తింపు. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలున్నా శ్రమ కూడా తప్పకపోవచ్చు. అప్రమత్తంగా మెలగాలి. సోదర వర్గ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వారాంతంలో ఆహార విహారాలకు అనుకూలం. గృహ వాహనాది సౌకర్యాలపై దృష్టి. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. ప్రయాణాలకు అవకాశం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బాధ్యతలు అధికం. గుర్తింపు లభిస్తుంది. నిర్ణయాదుల వల్ల కొంత శ్రమ. కాలం, ధనం వ్యర్థం కావచ్చు. ప్రయాణాల్లో కొంత జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. వారం మధ్యమంలో కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. బంధువర్గ వ్యవహారాలు చర్చకు వస్తాయి. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం. కొన్ని అనుకోని సమస్యలు ఎదురయ్యే సూచనలు. విశ్రాంతిని కోల్పోవలసి రావచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. వారాంతంలో సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. సోదరవర్గ సహకారం లభిస్తుంది.
కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులకు అనుకూలం. విశ్రాంతి లభిస్తుంది. ప్రయాణాలకు అవకాశం. సౌఖ్యంగా గడుపుతారు. సౌకర్యాలు సమకూర్చుకుంటారు. పరామర్శలకు అవకాశం ఉంటుంది. లాభాలున్నా ఆశించిన సంతోషం ఉండకపోవచ్చు. పెద్దలతో కొంత జాగ్రత్తగా మెలగాల్సి వస్తుంది. వారం మధ్యమంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బాధ్యతలు కూడా అధికవౌతాయి. వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. శ్రమ ఉన్నా కార్యనిర్వహణ ఉంటుంది. భాగస్వామితో జాగ్రత్తగా మెలగాలి. పరిచయాలు విస్తరించే అవకాశం. గుర్తింపు, గౌరవాలు పెంచుకుంటారు. వారాంతంలో కుటుంబంలో అనుకూలత. ఆర్థిక వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. మాట విలువ పెరుగుతుంది. బంధువర్గ వ్యవహారాల్లో తృప్తి.
మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ వారం ప్రారంభంలో పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నం. అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి ఉంటుంది. లాభాలు ఆశించినంతగా ఉండకపోవచ్చు. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమాధిక్యం. సామాజిక గౌరవం కోసం ప్రయత్నం. కొత్త పనుల నిర్వహణకు అవకాశం. సృజనాత్మకత. సంతానంతో సంతోషం. వారం మధ్యమంలో వేరువేరు రూపాల్లో పెట్టుబడులుంటాయి. కాలం ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. విశ్రాంతి లభిస్తుంది. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. పరామర్శలకు అవకాశం ఉంటుంది. పోటీ రంగంలో గుర్తింపు కోసం ప్రయత్నం. శ్రమాధిక్యం. వారాంతంలో అనేక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. వేరు వేరు పనుల నిర్వహణలో సంతోషం. సంతృప్తి.

-డాక్టర్ సాగి కమలాకర శర్మ