S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

క్షేత్రం-బీజం

కన్నతల్లి ప్రేమ కనబడుతుంది
కానీ కన్నతండ్రి కష్టం, బాధ్యత కనిపించదు
తల్లి మమకారం, ఆప్యాయత కనబడుతుంది
కానీ తండ్రి వేదన, ఆవేదన కనిపించదు
ప్రతిక్షణం పిల్లల మీద కన్నతల్లి
ఎంతో ఆప్యాయతానురాగాలు చూపిస్తుంది
ఎందుకంటే తన బిడ్డ తన పొత్తిళ్లలోకి వచ్చినప్పట్నుండి
అంతటి ప్రేమను పంచటం అలవాటయి పోతుంది ఆ తల్లికి.
కానీ అదే తండ్రి ఆ బిడ్డ భూమీద పడటానికి
తాను ఎంత కష్టపడ్డాడో, ఆ బిడ్డ తల్లి గర్భం నుండి
భూమీదకొచ్చి జీవం పోసుకోవడానికి తన కష్టాన్ని
ఎంతటిని ధారపోశాడో ఆ బిడ్డకు తెలియదు.
అటువంటి కుటుంబ బాధ్యతలు తీర్చడానికే
కన్నబిడ్డలకు దగ్గరగా ఉండలేడు.
తన కుటుంబాన్ని సాకే విషయంలో రోజంతా
కష్టపడి పని చేయడానికే ఇష్టపడతాడు తండ్రి
తల్లి పిల్లలను సాకటం, ఇంటి బాధ్యతలు నిర్వర్తించడం
ఇవే తల్లి బాధ్యతలు.
అయితే ఇంటి పనులు మాత్రమే చేయాల్సిన
బాధ్యత తల్లిది కాబట్టి ఇరవై నాల్గు గంటలు
ఇంట్లోనే ఉండి ఇంటి పనులతోపాటు
పిల్లల ఆలనా పాలనా చూసుకుంటుంది
అందుకే తల్లితో పిల్లలకు అంతటి
ప్రేమానుబంధాలు దృఢంగా తయారవుతాయి
అదే తండ్రి ఎన్నో బాధ్యతలతో తలమునకలై
అలసిపోయి వచ్చి అంతటి ప్రేమానురాగాలను
పిల్లలపై చూపించలేడు.
కాబట్టి తండ్రితో పిల్లలకు ఎక్కువ అనుబంధం
ఉండదని చెప్పవచ్చు.
తల్లి మనసు చాలా సున్నితమయినది
కానీ తండ్రి మనస్సు ఎంతో కఠినమయినది అనుకుంటారు
అలా అస్సలే ఉండదు
తల్లికన్నా తండ్రికే ఎక్కువ ప్రేమ
ఉంటుంది పిల్లలపై
తల్లికి పిల్లలను కంటికిరెప్పలా చూసుకునే
బాధ్యత ఉంటే-
తండ్రికి వాళ్లని సాకటం కోసం మధనపడే
అలుపెరుగని పోరాటం తండ్రిలో ఉంటుంది.
ఏదేమయినా క్షేత్రం తల్లి అని, బీజం తండ్రి అని చెప్పవచ్చు.
క్షేత్రం ఉంటేనే బీజానికి ఫలితం
బీజం పడితేనే క్షేత్రానికి మోక్షం.

-శ్రీనివాస్ పర్వతాల 85001 22910