S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కాపాడుకుందాం!

వీనుల విందయిన
పలుకులతో
మదిలోని మర్మాన్ని
మధురంగా తెలుపుతూ
సుధామధురమైన
భావంతో
మస్తిష్క మధనానికి
ఆకృతినిస్తూ
ముత్యాల సరాల లిపితో
తన శిఖ నలంకరించిన
అమూల్య గ్రంథాలంకారాల
మణులతో
అజంతం అనంతం
అద్భుతం అఖండం
అమరం అయి,
పరాయి భాష
కరాళ నృత్యం చేస్తుంటే
కళావిహీనమై
తన అస్థిత్వానికి
కన్నీటి సౌధాన్ని నిర్మిస్తూ
కలవరబడుతున్న
తెలుగు భాషని
బతికించుకుందాం
కనుమరుగవకుండా
కాపాడుకుందాం!
*

-వేమూరి శ్రీనివాస్ 99121 28967