S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిర్దయుడు

ప్రముఖ దర్శకుడు బి.నర్సింగరావు ఫోన్ చేసి ‘మీకు మన ఆర్టిస్టులు ఎవరైనా ఫోన్ చేశారా?’ అని అడిగారు. ‘చేయలేదు. ఎందుకని?’ అడిగాను.
‘న్యాలపల్లి రాజేశ్వర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అతని పార్ధీవ శరీరాన్ని వాళ్ల ఊరు తీసుకొని వెళ్తున్నారు’ చెప్పారు.
స్థాణువులా నిలబడిపోయాను. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చిన్నవాడు. ఇప్పుడిప్పుడే మంచి చిత్రకారుడిగా పేరు పొందుతున్న వాడు మరణించినాడన్న వార్త నన్ను బాగా ఆందోళనకి గురి చేసింది.
ఆంధ్రభూమిలో బొమ్మలు వేస్తున్నప్పటి నుంచి రాజేశ్వర్ నాకు తెలుసు. చిత్తరువులు (పొట్రేయట్) వేయడంలో అతనికి ఎవరూ సాటి లేరు. ఆ తరువాత పేయింట్స్ వేయడం మొదలుపెట్టాడు. ఈ మధ్యే అతను వేసిన పేయింటింగ్స్ అన్నీ చూశాను. శివుడు, పార్వతీ వున్న పేయింటింగ్ తెచ్చుకున్నాను. అది మా డ్రాయింగ్ రూంలో వ్రేలాడుతూ వుంటుంది. ఆ బొమ్మ గురించి మాట్లాడని వ్యక్తులు ఎవరూ కన్పించలేదు. మా ఇంటికి వచ్చిన అందరూ ఆ పేయింటింగ్ గురించి, అదే విధంగా ఆ చిత్రకారుడి గురించి అడగని వ్యక్తులు లేరని చెప్పవచ్చు. అతనిదే మరో పేయింటింగ్ తెచ్చుకోవాలని అనుకుంటున్నప్పుడు అతను మరణించిన వార్త తెలిసింది.
నర్సింగరావు మా ఇంటికి వచ్చినప్పుడు ఆ చిత్రం ప్రస్తావన వచ్చింది. ఆర్ట్ ఎట్ తెలంగాణలో రాజేశ్వర్ కన్పించక పోవడం గురించి ఆయనతో విచారించాను. మరో పుస్తకం వేయాలని నర్సింగరావు అన్నారు. ఆ పుస్తకం రాకముందే, ఇప్పుడిప్పుడే బాగా వృద్ధిలోకి వస్తున్న చిత్రకారుడు మరణించడం అత్యంత విషాదం.
రాజేశ్వర్ వేస్తున్న బొమ్మలు అన్నీ శివుడూ పార్వతీ, కృష్ణుడు వగైరా. అన్నీ దేవతల బొమ్మలే. అందరూ గాడ్ ఈజ్ గ్రేట్ అంటూ వుంటారు. ఎందుకలా అంటారో నాకు అర్థం కాలేదు, ఈ మరణ వార్త విన్నప్పుడు. దేవుడు నిర్దయుడు.
దేవుడి దృష్టి ఏముందో? తన బొమ్మలు రాజేశ్వర్‌తో వేయించుకోవడానికి తీసుకొని వెళ్లాడేమో. రాజేశ్వర్ మా గోడ మీదే కాదు నా హృదయంలో కూడా వేలాడుతుంటాడు.
జీవితం ఎంతో చిన్నది.
జీవితాన్ని ఓ ప్రయాణంలా తీసుకోవాలి.
అందరినీ ప్రేమించడమే మనం చేయాల్సింది. *

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001