S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (17.11.2019 నుంచి 23.11.2019 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఈ వారం ప్రారంభంలో ఆహార విహారాలపై దృష్టి. విందులు వినోదాల కోసం శ్రమిస్తారు. ఖర్చులు చేస్తారు. గృహ వాహనాది సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. మాతృవర్గ వ్యవహారాలపై దృష్టి. పదోన్నతులకు అవకాశం. శ్రమతో గుర్తింపు. సామాజిక గౌరవం ఉంటుంది. అధికారిక కార్యకలాపాలుంటాయి. సౌఖ్యంగా గడుపుతారు. విద్యారంగంలోని వారికి అనుకూలత. వారం మధ్యమంలో ఆలోచనలకు రూపకల్పన. సృజనాత్మకత. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. సంతానవర్గ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని ఊహించని సమస్యలకు అవకాశం ఉంటుంది. లాభాల కోసం ప్రయత్నం. ఆశించిన లాభాలు అందక అసంతృప్తి. వారాంతంలో పోటీ రంగంలో గుర్తింపు. వ్యతిరేక ప్రభావాలపై విజయం సాధిస్తారు. కార్యక్రమాల నిర్వహణలో కొంత చికాకు తప్పదు.
వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలుంటాయి. సోదర వర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మంచి వార్తలు వింటారు. ఉన్నత విద్య, ఉద్యోగాదులుంటాయి. కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. విహార యాత్రలకు అనుకూలం. వారం మధ్యమంలో ఆహార విహారాలుంటాయి. శ్రమ ఉన్నా సౌఖ్యంపై దృష్టి ఉంటుంది. విందులు వినోదాలకు వెచ్చిస్తారు. భాగస్వామ్యాల్లో అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. అధికారిక భాగస్వామ్యాల్లో జాగ్రత్త అవసరం. విద్యారంగంలోని వారు కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాలుంటాయి. వారాంతంలో క్రియేటివిటీతో పని చేస్తారు. ప్లానింగ్ అనుకూలిస్తుంది. పిల్లల వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి.
మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో అనుకూలత. నిల్వధనంపై దృష్టి. మాట తీరులో అసంతృప్తి. శ్రమ రహిత ప్రయోజనాలపై దృష్టి ఉంటుంది. బంధువర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. లాభాలు ఆశించినంతగా రాకపోవడం వల్ల కొంత అసంతృప్తి ఉంటుంది. వారం మధ్యమంలో కమ్యూనికేషన్స్ పెంచుకుంటారు. వేరు వేరు వ్యక్తుల నుండి సమాచారం అందుతుంది. అధికారిక వ్యవహారాల్లో పోటీలు అధికం. కీర్తి ప్రతిష్టలుంటాయి. దగ్గరి ప్రయాణాలున్నా కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. సోదరవర్గ అనుబంధాలు చర్చల్లోకి వస్తాయి. శ్రమతో గుర్తింపు లభిస్తుంది. వైజ్ఞానిక, విద్య, ఉద్యోగాదుల్లో గుర్తింపు. కీర్తిప్రతిష్ఠలకు అవకాశం. వారాంతంలో గృహ వాహనాది సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. శ్రమ ఉన్నా సౌఖ్యంగా గడిపే ప్రయత్నం.
కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఈ వారం ప్రారంభంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అనేక కార్యక్రమాలను నిర్వహించాల్సి వస్తుంది. బాధ్యతలు అధికం. కార్యనిర్వహణ దక్షత ఉంటుంది. భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. వేరు వేరు కార్యక్రమాల్లో బిజీ అవుతారు. గుర్తింపు. వారం మధ్యమంలో కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. కుటుంబ, బంధువర్గ బాధ్యతల నిర్వహణ ఉంటుంది. నిల్వధనం ప్రభావితం చేస్తుంది. ఆలోచనల్లో కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. సంతానవర్గ వ్యవహారాలు శ్రమకు గురి చేయవచ్చు. శ్రమ రహిత ప్రయోజనాలపై దృష్టి. అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్యం. వారాంతంలో సంప్రదింపులకు అనుకూలం. మంచి వార్తలు వింటారు. సౌఖ్యంగా గడుపుతారు. దగ్గరి ప్రయాణాలకు అవకాశం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఈ వారం ప్రారంభంలో ఖర్చులు, పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. విశ్రాంతి లభిస్తుంది. సౌఖ్యంగా గడుపుతారు. ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. సౌకర్యాలు సమకూర్చుకుంటారు. వ్యతిరేక ప్రభావాలను అధిగమిస్తారు. పోటీలలో విజయం సాధిస్తారు. పరామర్శలకు అవకాశం ఉంటుంది. వారం మధ్యమంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. నూతన కార్యక్రమాలపై దృష్టి. దీక్షగా బాధ్యతల నిర్వహణ. ధైర్యంగా ఉంటుంది. శక్తి సామర్థ్యాలు విస్తరిస్తాయి. ఆరోగ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తారు. అలంకరణ కూడా ఉంటుంది. సంతోషం. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలుంటాయి. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరించే అవకాశం. కొంత సౌఖ్య లోపం. వారాంతంలో కుటుంబ, బంధువర్గ బాధ్యతలను నిర్వహిస్తారు.
కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో అన్ని రూపాల్లోనూ ప్రయోజనాలుంటాయి. లాభాలు విస్తరించే అవకాశం. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కొత్త పనుల నిర్వహణపై దృష్టి. కార్యనిర్వహణలో బిజీగా గడుపుతారు. సంతోషంగా ఉంటుంది. సంతాన వర్గ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వారం మధ్యమంలో ఖర్చులు పెట్టుబడులు అధికం. అధికారిక వ్యవహారాల కోసం వెచ్చిస్తారు. దగ్గరి ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. విశ్రాంతి కోసం యత్నం. పరామర్శలకు అవకాశం ఉంటుంది. సంప్రదింపులకు అనుకూలం. విందులు వినోదాలకు అవకాశం ఉన్నా అధికమైన వ్యయం జరుగుతుంది. వారాంతంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమాలను అధికంగా నిర్వహించాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాల నిర్వహణపై దృష్టి. నిర్వహణ సామర్థ్యం, దక్షత విస్తరిస్తాయి.
తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. చేస్తున్న పనిలో సామర్థ్యం కోసం ప్రయత్నం. సామాజిక గౌరవం పెంచుకుంటారు. అధికారిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. పితృవర్గ వ్యవహారాలు సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తాయి. పదోన్నతులుంటాయి. గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. లాభాలు సంతోషాన్ని కలిగిస్తాయి. కుటుంబంలో కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. మాటల్లో అధికారిక ధోరణి తగ్గించుకోవాలి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కొత్త పనుల నిర్వహణపై దృష్టి. నూతన కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. వారాంతంలో ఖర్చులు పెట్టుబడులు అధికం. వ్యాపారాదుల కోసం వెచ్చిస్తారు. ప్రయాణాదులకు అవకాశం. విందులు వినోదాలు విహార యాత్రలు ప్రభావితం చేస్తాయి.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం. సుదూర ప్రయాణాదులు నిర్వహిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. అన్ని పనుల్లోనూ అనుకూలత. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. సంప్రదింపులకు అనుకూలం. విద్య, ఉద్యోగ, వైజ్ఞానిక పరిశోధనా రంగాల్లో అనుకూలత. వారం మధ్యమంలో వృత్తిలో శుభ పరిణామాలు. అధికారిక కార్యాలకు అనుకూలత. సామాజిక గౌరవం పెరుగుతుంది. పదోన్నతులకు అవకాశం. శారీరకమైన ఒత్తిడులుంటాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. పితృవర్గ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. గుర్తింపు కలుగుతుంది. వారాంతంలో లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వేరువేరు రూపాల్లో ప్రయోజనాలుంటాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఈ వారం ప్రారంభంలో అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త. ఊహించని సంఘటనలుంటాయి. కార్యనిర్వహణలో జాగ్రత్త. ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం మంచిది. శ్రమ రహిత ప్రయోజనాలకు అవకాశం ఉంటుంది. తొందరపాటు కూడదు. వారం మధ్యమంలో ఉన్నత వ్యవహారాలను నిర్వహిస్తారు. లక్ష్యాలను సాధిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు సాధించేందుకు ప్రయత్నం. అన్ని పనుల్లోనూ శుభ పరిణామాలు. సంప్రదింపులకు అనుకూలం. వ్యర్థంగా కాలం ధనం కోల్పోయే అవకాశం. పరామర్శలుంటాయి. ఆరోగ్యం కోసం వెచ్చించాల్సి వస్తుంది. వారాంతంలో వృత్తి ఉద్యోగాదులను సమర్థంగా నిర్వహిస్తారు. అధికారిక వ్యవహారాలపై దృష్టి. సామాజిక గౌరవం పెంచుకుంటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఈ వారం ప్రారంభంలో పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామ్యాల్లో అనుకూలత. అన్ని పనుల్లోనూ శుభ పరిణామాలు. కొత్త పనులపై దృష్టి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కార్యనిర్వహణ దక్షత. శ్రమతో కార్యక్రమాలుంటాయి. భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాలి. కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు. అధికారిక లోపాలు. లాభాలు సమస్యలకు గురి చేస్తాయి. ప్రయోజనాలు ఇబ్బంది పెట్టే అవకాశం. ఊహించని సంఘటనలు. ముఖ్య కార్యక్రమాలను వాయిదా వేయడం మంచిది. రాజకీయ వ్యవహారాలకు దూరంగా మెలగాలి. వారాంతంలో ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. నూతన కార్యక్రమాలపై దృష్టి. పరిశోధనలకు అనుకూలం. సుదూర ప్రయాణాలు లాభిస్తాయి.
కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో పోటీలు, ఒత్తిడులు, వ్యతిరేక ప్రభావాలు తప్పకపోవచ్చు. రుణ రోగాదులు ప్రభావితం చేస్తాయి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. కాంపిటీషన్స్‌లో విజయం సాధిస్తారు. పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేయాల్సి వస్తుంది. గుర్తింపు లభిస్తుంది. శారీరకమైన అలలసట ఉంటుంది. వారం మధ్యమంలో పరిచయాలు విస్తరిస్తాయి. అధికారిక భాగస్వామ్యాలకు అనుకూలత. వృత్తి ఉద్యోగాదుల్లో పదోన్నతులున్నా సమస్యలకు కూడా అవకాశం. సామాజిక గౌరవం పెంచుకుంటారు. స్నేహానుబంధాలు పెంచుకున్నా కొంత అప్రమత్తంగా మెలగాలి. జీవిత భాగస్వామితోనూ సమస్యలు రాకుండా చూసుకోవాలి. వారాంతంలో అనుకోని సమస్యలుంటాయి. వ్యాపారాదుల్లో ఊహించని ప్రయోజనాలపై దృష్టి. శ్రమ రహిత లాభాలకు దూరంగా మెలగడం మంచిది.
మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గంతో సంతోషంగా గడుపుతారు. సృజనాత్మకత పెరుగుతుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అన్ని పనులూ నిర్వహిస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. నూతన నిర్ణయాదులు లాభిస్తాయి. సంతోషం. వారం మధ్యమంలో వ్యతిరేక ప్రభావాలు పెరుగుతాయి. విజయం సాధిస్తారు. కార్యనిర్వహణ దక్షత. పోటీలు ఒత్తిడులు చికాకులను అధిగమించాలి. రుణ రోగాదులను అధిగమిస్తారు. కాంపిటీషన్స్‌లో విజయం సాధిస్తారు. శ్రమాధిక్యం. గుర్తింపు లభిస్తుంది. సుదూర ప్రయాణాదులపై దృష్టి. ఉన్నత వ్యవహారాలు నిర్వహించే అవకాశం. వారాంతంలో పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

-డాక్టర్ సాగి కమలాకర శర్మ