S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దివ్య శక్తి

సౌందర్యపు తోటలో పూసిన
సున్నిత పుష్పం
అసాంఘిక హస్తాల్లో నలుగుతున్న
కన్నీటి శిల్పం
కాలం సంకెళ్లు త్రెంచుకున్న
గెలుపు బావుటా
వికృత ఆలోచనల పంజాదెబ్బకు
విలవిల్లాడుతున్న మనోనిబ్బరం
వివక్షతా అగాధాల్లోకి నెట్టివేయబడుతున్న
చైతన్య సామర్థ్యం
ప్రణాళికల రూపకల్పనలో
అద్భుతాలను సృష్టించగల మేథ
సమాజపు తలలో నాలుకై
సంచరించే అమృత కలశం
అలసిపోయిన మనిషి బ్రతుకును
సేదదీర్చే మాతృ స్పర్శ
నిర్మలత్వపు పెదవులతో
మనుగడను శాసించే దివ్యశక్తి
బలహీనపరిచే చిన్నచూపుల ప్రశ్నకు
బడబానలమై ఉప్పొంగే సమాధానం
అంబగా..
అనంతాకృతులు దాల్చే జీవన స్ఫూర్తి
బతుకమ్మగా..
అఖిల జగతిని వెలిగించే ప్రాణజ్యోతి.

-డేగల అనితాసూరి 927500819