వారం వారం గోచారం (3.11.2019 నుంచి 9.11.2019 వరకు)
Published Saturday, 2 November 2019మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. అధికారిక వ్యవహారాలు, కార్యనిర్వహణలో ఒత్తిడులుంటాయి. పదోన్నతులకు అవకాశం. పితృవర్గ వ్యవహారాలపై దృష్టి. ఆధ్యాత్మిక లక్ష్యాలపై కూడా దృష్టి ఉంటుంది. పనుల్లో ఆలస్యం కూడా జరుగవచ్చు. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాలకు, సౌకర్యాలకు అనుకూలంగా ఉంటుంది. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కొత్త పనుల నిర్వహణకు అనుకూలం. లాభ దృష్టి అధికవౌతుంది. ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. వారాంతంలో విశ్రాంతి కోసం ప్రయత్నం. ఖర్చులు అధికం. విందులు, వినోదాలు, విహారాలపై దృష్టి. ప్రయాణాలకు అవకాశం.
ఘసింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఈ వారం ప్రారంభంలో పోటీలు ఒత్తిడులు వ్యతిరేకతలు అధికం. కార్యనిర్వహణలో శ్రమ ఉన్నా కార్యసాధన ఉంటుంది. రుణ రోగాదులను అధిగమిస్తారు. ఆలోచనల్లో కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. ఆలస్య నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి. సంతాన వర్గ సమస్యలు ప్రాధాన్యం వహిస్తాయి. వ్యతిరేకతలపై విజయం. కాంపిటీషన్స్‌పై దృష్టి ఉంటుంది. వారం మధ్యమంలో పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. అనేక కార్యక్రమాలపై దృష్టి. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. పాత మిత్రుల కలయిక లేదా సమాచారం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. బాధ్యతలను నిర్వర్తిస్తారు. నూతన కార్యక్రమాల నిర్వహణపై దృష్టి. వారాంతంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్త పాటించాలి. అనుకోని సమస్యలు. తొందరపాటు నిర్ణయాలు కూడదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఈ వారం ప్రారంభంలో కుటుంబ వ్యవహారాలు సంతోషాన్ని ఇస్తాయి. బంధు వర్గం వల్ల సంతృప్తి. మాట విలువ పెరుగుతుంది. ఆర్థిక నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. నిల్వధనం పెంచుకుంటారు. కొన్ని అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్యమూ ఇబ్బంది పెడుతుంది. నిర్ణయ శక్తి లోపిస్తుంది. వారం మధ్యమంలో సంప్రదింపులకు అనుకూలం. మంచి వార్తలు, సమాచారం అందుతుంది. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. సుదూర లక్ష్యాలపై దృష్టి. పరిశోధనాత్మక వ్యవహారాలుంటాయి. సమాచారానికి వెంటనే స్పందించకుండా ఉంటే మంచిది. సోదరులతో సంతోషం. ఆధ్యాత్మిక యాత్రలు ఫలిస్తారు. వారాంతంలో ఆహార విహారాలు సంతోషాన్నిస్తాయి. విద్యా రంగంలోని వారికి అనుకూలం. శ్రమతో ఫలితాలుంటాయి.
వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఈ వారం ప్రారంభంలో అత్యున్నత వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. కీర్తి ప్రతిష్ఠలపై దృష్టి. కొన్ని అనుకోని సమస్యలుంటాయి. ముందుకు వెళ్లకుండా ఆపుతుంటాయి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దానధర్మాల వల్ల మరింత మేలు కలుగుతుంది. పరిశోధన, వైజ్ఞానిక రంగాల వారికి అనుకూలం. దగ్గరి ప్రయాణాలుంటాయి. వారం మధ్యమంలో వృత్తి ఉద్యోగాదులకు అనుకూలం. అధికారిక కార్యక్రమాలపై దృష్టి. పితృవర్గ వ్యవహారాలుంటాయి. పదోన్నతులపై దృష్టి ఉన్నా అప్రమత్తంగా ఉండాలి. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాల కోసం ప్రయత్నం. సుఖంగా గడుపుతారు. వారాంతంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. భాగస్వామ్యాలకు అనుకూలం. పరిచయాలు స్నేహానుబంధాలు వికసిస్తాయి.
కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఈ వారం ప్రారంభంలో అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. సృజనాత్మక శక్తి పెరుగుతుంది. స్పెక్యులేషన్స్ లాభిస్తాయి. సంతానవర్గంతో సంతోషంగా గడుపుతారు. కార్యనిర్వహణ దక్షత. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. లాభాలు సంతోషాన్నీ సంతృప్తినీ ఇస్తాయి. సౌకర్య లోపాలకు అవకాశం. వారం మధ్యమంలో వ్యతిరేకతలు పోటీలు ఒత్తిడులకు గురి చేస్తాయి. కార్యనిర్వహణలో తలమునకలు కావాలి. శ్రమాధిక్యం. రుణ బాధలుంటాయి. శత్రుభావన తగ్గించుకోవాలి. శారరీకమైన ఒత్తిడి తప్పకపోవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. మొండితనం తగ్గించుకోవాలి. వారాంతంలో పరిచయాలు పెంచుకుంటారు. భాగస్వామ్యాల్లో అనుకూలత. వేరు వేరు కార్యక్రమాల నిర్వహణపై దృష్టి ఉంటుంది. నిర్ణయాలను వాయిదా వేసుకోవాలి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఈ వారం ప్రారంభంలో ఆత్మవిశ్వాసంతో కార్యక్రమాల నిర్వహణ. ధైర్యంగా వ్యవహరిస్తారు. బాధ్యతలు అధికం. శ్రమతో గుర్తింపు లభిస్తుంది. శరీరం, ఆరోగ్యంపై దృష్టి పెరుగుతుంది. సామాజిక అనుబంధాలు బలపడతాయి. భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశం. అన్ని పనుల్లోనూ అనుకూలత. వారం మధ్యమంలో కుటుంబ గౌరవం పెరుగుతుంది. బంధువర్గంతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక నిర్ణయాలకు అనుకూలం. నిల్వధనం పెంచుకుంటారు. మాట తీరు వల్ల సంతోషం. సంతృప్తి. కొన్ని అనుకోని సంఘటనలున్నా అధిగమిస్తారు. ఊహించని సమస్యలుంటాయి. శ్రమ రహిత ఆదాయంపై దృష్టి. వారాంతంలో సంప్రదింపులకు అనుకూలం. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మంచి వార్తలు అందుతాయి. లాభాలు అత్యధికమైన ఆనందాన్నిస్తాయి.
మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఈ వారం ప్రారంభంలో అనుకోని సమస్యలుంటాయి. ఇబ్బందులకు అవకాశం. ఊహించని సంఘటనలుంటాయి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కొత్త పనులను వాయిదా వేసుకోవాలి. నిర్ణయాదులు ఇబ్బంది పెట్టే అవకాశం. భాగస్వామ్యాల్లో జాగ్రత్త. వారం మధ్యమంలో ఉన్నత లక్ష్యాలపై దృష్టి. సుదూర ప్రయాణాలపై ప్రణాళికలుంటాయి. దైవ, ధార్మిక కార్యక్రమాలు ప్రభావితం చేస్తాయి. పరిశోధనలు కొనసాగుతాయి. కొత్త సమాచారం అందుతుంది. కీర్తిప్రతిష్ఠలు పెంచుకునే ప్రయత్నం. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలం. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. వారాంతంలో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అధికారిక వ్యవహారాలకు అనుకూలం. సామాజిక గౌరవం పెరుగుతుంది.
తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఈ వారం ప్రారంభంలో సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాలకు అనుకూలం. సౌఖ్యంగా కాలం గడుపుతారు. గృహ వాహనాది వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాదులు తీసుకునే అవకాశం. శ్రమాధిక్యం. విద్యారంగంలోని వారికి అనుకూలత. సామాజిక గౌరవం పెరుగుతుంది. పదోన్నతులకు కూడా అవకాశం. వారం మధ్యమంలో ఆలోచనలకు రూపకల్పన. సేవకవర్గ సహకారం లభిస్తుంది. సమాచార లోపాలుంటాయి. వార్తలు కలవరపెట్టే అవకాశం. సంతానంతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు చేస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. వారాంతంలో వ్యతిరేకతలు అధికం. పోటీ రంగంలోని వారికి అనుకూలత. ఒత్తిడులుంటాయి. చికాకులను అధిగమించాలి. కుటుంబ, ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు.
కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఈ వారం ప్రారంభంలో ఖర్చులు అధికవౌతాయి. అనేక రూపాల్లో పెట్టుబడులకు అవకాశం. కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు. తొందరపాటు కూడదు. విశ్రాంతి కోసం ప్రయత్నం. లాభాలున్నా ఆశించిన సంతోషం అందకపోవచ్చు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. వ్యతిరేకతలను అధిగమించాల్సి వస్తుంది. వారం మధ్యమంలో నిర్ణయాదులు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కొత్త పనులపై దృష్టి. కార్యనిర్వహణ దక్షత. భాగస్వామ్య అనుబంధాలు మెరుగుపడతాయి. సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. అన్ని పనుల్లోనూ శుభ పరిణామాలు. వారాంతంలో కుటుంబంలో సంతోషం. నూతన కార్యక్రమాలపై దృష్టి. ఆర్థిక వ్యవహారాల్లో సంతృప్తి. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం. మాట తీరులో సంతోషం.
కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఈ వారం ప్రారంభంలో పరిచయాలు విస్తరిస్తాయి. పాత మిత్రుల కలయిక. పోటీ రంగంలో శ్రమ ఉంటుంది. భాగస్వామితో వ్యతిరేకతలు రాకుండా చూసుకోవాలి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. స్నేహానుబంధాల విషయంలో అప్రమత్తంగా మెలగాలి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కొత్త పనులపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్త. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. చికాకులుంటాయి. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. రోగ నిరోధక శక్తి తగ్గే సూచనలు. ముందు జాగ్రత్తలు అవసరం. కొత్త పనులను వాయిదా వేసుకోవడం మంచిది. వారాంతంలో ఉన్నత లక్ష్యాలపై దృష్టి. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. ఆలోచనలకు రూపకల్పన. కొన్ని ఒత్తిడులు, ఘర్షణలు, చికాకులున్నా శ్రమతో అధిగమిస్తారు.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. సహకారం లభిస్తుంది. మంచి వార్తలు అందుతాయి. దగ్గరి ప్రయాణాలుంటాయి. కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్త అవసరం. మాటల్లో తడబాటుకు అవకాశం. కీర్తి ప్రతిష్ఠలకు అవకాశం. సోదర వర్గ వ్యవహారాల్లో సంతోషం, సంతృప్తి. వారం మధ్యమంలో సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. విందులు వినోదాలకు అవకాశం. విహార యాత్రలుంటాయి. సౌఖ్యంగా కాలం గడుపుతారు. శ్రమ తప్పకపోవచ్చు. విద్యారంగంలోని వారికి అనుకూలత. సామాజిక గౌరవం పెంచుకుంటారు. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. అధికారిక కార్యక్రమాల బాధ్యత. వారాంతంలో ఆలోచనలు ఫలిస్తాయి. మంచి ప్రణాళికలుంటాయి. సృజనాత్మకత పెరుగుతుంది. అన్ని రకాల వ్యవహారాల్లోనూ అనుకూలత కలుగుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ వారం ప్రారంభంలో లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ప్రయోజనాలు సంతోషాన్నీ సంతృప్తినీ ఇస్తాయి. నూతన కార్యక్రమాలపై దృష్టి. ఆలోచనలకు రూపకల్పన. సృజనాత్మక వ్యవహారాలపై దృష్టి. సంతానంతో సంతోషంగా గడుపుతారు. వారం మధ్యమంలో ఖర్చులు పెట్టుబడులు అధికవౌతాయి. ప్రయాణాలకు మంచి అవకాశం. వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు లభిస్తుంది. వేరు వేరు రూపాల్లో ధనాన్ని వెచ్చించే అవకాశం. అన్ని పనుల్లోనూ శుభ పరిణామాలు. వారాంతంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కొత్త పనులపై దృష్టి. కార్యనిర్వహణ దక్షత. బాధ్యతలు విస్తరిస్తాయి. భాగస్వామ్యాలపై దృష్టి. పరిచయాలు స్నేహానుబంధాలలో కొంత జాగ్రత్త అవసరం. అన్ని పనుల్లోనూ అనుకూలత. సంతోషం. సంతృప్తి.