S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మళ్లీ మా వూరికి...

జ్ఞాపకాలని పురావస్తు ప్రదర్శనశాలలో
బంధించలేను
కంటి క్రీనీడలలోనో, పొరలు గప్పిన మనసు పేటిక మూలలలోనో దోబూచులాడుతనే వుంటయి
దాలికుండలో కాగుతున్న పాల నురగల వాసన వోలె
కాళ్లు ముడుచుకొని కడుపుల పెట్టి తల్లిని
పెనవేసుకొని పండుకొంటున్న బిడ్డ
ముద్దుల గావురం వోలె
అపురూపవౌతనే వుంటయి
కొత్త స్వప్నాలని వీపు బరువుగ కట్టుకుని
ప్రయాణిస్తూ వుంటే వుండొచ్చు
కాలం రెక్క విసురుకు ఎటో కొట్టుకొని పోతే పోవచ్చు
ఉషోదయ రాగాల వెంట నడిచి వుంటే వుండొచ్చు
కాలుకు ముల్లు గుచ్చిన తొవ్వ
కండ్లల్ల రక్తపుజీరై మెరుస్తనే వున్నది
చెరువు గట్టున పొదిచ్చిన యిసుక గూడు
తడియారని చెయ్యెత్తి పిలుస్తనే వున్నది
లోలోతుల గడి గాని దడి గాని ఏమీ కట్టుకోలేదు
పరాకుగానో చిరాకుగానో వీసమెత్తు
విషాక్షరం చిమ్మలేదు
అమితాసక్తులతోనో అనాసక్తులతోనో చెలిమి
చెలిమల నేం తోడుకోలేదు
అనడానికో నోటి మిషిని వినడానికో చెవి మిషిని
వుంటే వుండొచ్చు
తాలింపు వేసిన చాటింపు చేసిన కథలకు కాళ్లు మొలవవొచ్చు.. కంచె దూకవచ్చు
ఉదయిస్తున్న సూర్యుడి వైపే నిలబడి వున్న,
కొక్కొరొకో అన్న పిలుపు వినడానికి
చీకటి దాడిలో గుడ్డిదైన ఆకాశం కోసం పాటై, ఘంటానాదం వినిపిస్తున్న
పచ్చగడ్డి భగ్గుమంటున్న మనుషుల మధ్య పచ్చటి పొలాల్ని సేద్యం చేస్తున్న
అవును.. మొన్న నిన్న ఇయ్యాల జ్నాపకాలనే శ్వాసించి, జీవించి, బ్రతుకుతున్న
మళ్లోసారి రేపు
మా వూరికి పోతున్న!
వూరు నేను అవిభాజ్యమే
ఎప్పటికైనా.

-దాసరాజు రామారావు