మంత్రబంధం
Published Saturday, 12 October 2019నా కిష్టం..
నీకేమో కష్టం
నీకు ఇష్టం...
నాకేమో కష్టం
వందకు 90 శాతం
ఇదే తంతు.. ఐనా సాగుతోంది జీవనం
బంధమంటే అదే
మంత్రాలతో కలిపారుగా మరి
అవి కలవని ధృవాలను
కలిసే ఉండమంటుంది
జీవనమంటే అదే మరి
గౌరవించుకుంటే
గమ్యం మనదవుతుంది
దాంపత్యం పండవుతుంది
కెరటాలు ఎంత ప్రయత్నించినా
సముద్రాన్ని వీడవు
ఉప్పు వద్దని కడలి అనుకున్నా
ఎంత మాత్రం కుదరదు
అదే వాటి బంధం, అనుబంధం.