S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శ్రీమాతా! అపరాజిత!

శ్రీ దుర్గా! అపరాజిత!
అష్ట్భుజీ విభ్రాజిత!
సురనర రాక్షస పూజిత!
సుమధుర గళ కలకూజిత!

కనకదుర్గ శుభసువర్ణ
కవచాలంకృత దేవీ
కోటి సూర్యకాంతి పుంజ
నాసికాభరణ ఠీవీ!

రిపుజితవగు శ్రీబాలా
త్రిపురసుందరీ మాతా!
కరుణామృత దృక్కుల చే
కొనవమ్మా మా మ్రొక్కుల

ఆదిశంకరుల పూజల
శ్రీచక్రాధిష్టితవై
చండాంశను విడి - లలితా
త్రిపుర శాంతవైనావట.

ముక్తా, విద్రుమ, హిరణ్య,
నీల, ధవళ పంచముఖీ
గానము చేసిన కాచే
గాయత్రీ! శుభగాత్రీ!

అఖిల జీవ కోట్లకు నీ
అమృతాన్నము నందించే
అన్నపూర్ణ! కాశీశ్వరి!
కన్నతల్లి! కాత్యాయని!

జ్ఞాన దీప్తి కలిగించే
సకల విద్యలందించే
సరస్వతీ! కళాద్యుతీ
శుంభనిశుంభుల భంజని!

దుర్మార్గుడు దుర్గముడిని
తునుమాడిన దుర్గాంబా!
తోమాలల వందనాల
తో - మాపూజల నందుము

మహిషాసుర మర్దిని - ఈ
మహిని సుజన వర్ధిని
సింహరాజ వాహిని! నిను
సేవింతుము, భావింతుము

విజయదశమి నాడు - రాజ
రాజేశ్వరీ దేవీ! అప
రాజిత మూర్తిగ మేమా
రాధింతుము, ధ్యానింతుము

కన్నుమిన్ను కానని - ఏ
కాముకుల మదంబునణచు
భీమబలం ప్రసాదించు
బాలకు, భామకు, బామ్మకు.

మహిళ కనులబడినంతనె
మాతృభావ దృష్టి జూచు
మంచితనం కలిగించు
మానవతను వెలిగించు.

-కె.మధుసూదనరావు 9030907191