S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (6.10.2019 నుంచి 12.10.2019 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత వ్యవహారాల నిర్వహణలో సమస్యలు. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలం. పలుకుబడి తగ్గే సూచనలు. క్రమంగా సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. పదోన్నతులకు అవకాశం. సౌకర్యాలపై దృష్టి. ఆహార విహారాలకు కూడా అనుకూలం. తండ్రి తరఫు బంధువుల కలయిక. గుర్తింపు, గౌరవాదులు విస్తరిస్తాయి. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ లాభాలు కనిపిస్తాయి. సంతోషంగా గడుపుతారు. ప్రతి పనిలోనూ ప్రయోజనం ఉంటుంది. పెద్దల ఆశీస్సులు పరిపూర్ణంగా లభిస్తాయి. సంతానవర్గ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. వారాంతంలో ఖర్చులు అధికవౌతాయి. పెట్టుబడులు తప్పకపోవచ్చు. పరామర్శలకు అవకాశం. తొందరపాటు కూడదు. వ్యతిరేకతలు అధికమయ్యే సూచనలు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. సంతాన వర్గంతో కొంత జాగ్రత్తగా మెలగాలి. క్రియేటివిటీ తగ్గే సూచనలు. ప్రణాళికా లోపాలకు అవకాశం. ఆలస్య నిర్ణయాదుల వల్ల సమస్యలు. క్రమంగా వ్యతిరేక ప్రభావాలు అధికవౌతాయి. పోటీలు ఒత్తిడులున్నా విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. వ్యవహార విజయం. ఖర్చులు, పెట్టుబడులు, ప్రయాణాలకు అవకాశం. సంతోషంగా, సౌఖ్యంగా గడుపుతారు. వారం మధ్యమంలో సామాజిక అనుబంధాలను పెంచుకుంటారు. భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు. పాత మిత్రుల కలయిక. కొత్త కార్యక్రమాలపై దృష్టి. ఆత్మవిశ్వాసంతో వ్యవహారాలు కొనసాగిస్తారు. కార్యనిర్వహణ దక్షత. బాధ్యతలు అధికం. వారాంతంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్త. అనుకోని ఇబ్బందులు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో నిర్ణయాదులు శ్రమకు గురి చేస్తాయి. కొత్త పనులకు దూరంగా మెలగాలి. ఆలస్య కార్యక్రమాలుంటాయి. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. ఆత్మ విశ్వాస లోపాలకు అవకాశం. సామాజిక అనుబంధాల్లో కొంత మెరుగు. క్రమంగా కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. నిల్వధనంపై ప్రత్యేక దృష్టి. బంధువర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. అన్ని పనుల్లో శుభ పరిణామాలు. వారం మధ్యమంలో మంచి వార్తలు అందుతాయి. మిత్రుల కలయిక. దగ్గరి ప్రయాణాలు. ఉన్నత వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మీడియా మిత్రులకు అనుకూలత. అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. వారాంతంలో సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. గృహ వాహనాదులు ప్రభావితం చేస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఈ వారం ప్రారంభంలో అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త. ముఖ్య నిర్ణయాదుల వాయిదా మంచిది. క్రమంగా ఉన్నత లక్ష్యాలు సాధిస్తారు. మంచి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలం. దానధర్మాల వల్ల కీర్తి ప్రతిష్ఠల వృద్ధి. సంప్రదింపులకు అనుకూలం. ఇతరుల సహకారం లభిస్తుంది. మంచి వార్తలు వినే అవకాశం. వారం మధ్యమంలో సామాజిక హోదా పెంచుకుంటారు. కార్యనిర్వహణ దక్షత. అనేక బాధ్యతలను నిర్వర్తిస్తారు. పదోన్నతులకు అవకాశం. అధికారిక వ్యవహారాలు నిర్వర్తించాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు, గౌరవాదులు విస్తరిస్తాయి. ఆహార విహారాలు సంతోషాన్నిస్తాయి. వారాంతంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. వేరు వేరు కార్యక్రమాల నిర్వహణపై దృష్టి.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. సౌఖ్య లోపాలు. గృహ వాహనాదుల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాదులు తీసుకోవాలి. ప్రయాణాల్లో ముందు జాగ్రత్తలు అవసరం. క్రమంగా ఆలోచనలకు రూపకల్పన. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. సృజనాత్మక శక్తి విస్తరిస్తుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. నిర్ణయాదులు లాభిస్తాయి. కొత్తపనులపై దృష్టి. వారం మధ్యమంలో వ్యతిరేకతలు అధికం. పోటీలు ఒత్తిడులను అధిగమించాలి. రుణ రోగాదులు ప్రభావితం చేస్తాయి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. విశ్రాంతి కోసం ప్రయత్నం. ప్రయాణాదులకు అవకాశం. పరామర్శలు ఉంటాయి. వారాంతంలో భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో ఖర్చుల విషయంలో జాగ్రత్త. ప్రయాణ లోపాలు. పరామర్శలుంటాయి. అప్రమత్తంగా మెలగాలి. విశ్రాంతి లోపాలు. తప్పనిసరి పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. క్రమంగా ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. కొత్త పనులపై దృష్టి. బాధ్యతలు విస్తరిస్తాయి. కార్యనిర్వహణ దక్షత. కృషి శీలత పెంచుకుంటారు. భాగస్వామ్యాల్లో అత్యంత అనుకూలత. సంతోషంగా కాలం గడుపుతారు. బిజీగా ఉంటారు. వారం మధ్యలో కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. ఆర్థిక నియంత్రణ ఉంటుంది. బంధువర్గ వ్యవహారాల్లో సమర్థతను చూపిస్తారు. ఊహించని సంఘటనలుంటాయి. సమస్యలన్నింటినీ అధిగమిస్తారు. వారాంతంలో సంప్రదింపులకు అనుకూలం. సమాచార రంగంలోని వారికి శుభ వర్తమానాలు.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో సామాజిక అనుబంధాల విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపాటు కూడదు. భాగస్వామితో జాగ్రత్తగా మెలగాలి. అనుకోని సమస్యలు ఉంటాయి. క్రమంగా ఆర్థిక, సామాజిక వ్యవహారాల్లో ఇబ్బందులకు అవకాశం. ఊహించని సంఘటనలు. శ్రమతో కార్యక్రమాలుంటాయి. ముఖ్య నిర్ణయాదులను వాయిదా వేసుకోవడం మంచిది. వారం మధ్యమంలో ఉన్నత వ్యవహారాల నిర్వహణ. కీర్తిప్రతిష్ఠలు పెంచుకుంటారు. ఆధ్యాత్మిక వ్యవహారాలకు అనుకూలత. ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తారు. సంప్రదింపులకు అనుకూలం. ఇతరుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. వారాంతంలో హోదా పెరుగుతుంది. అధికారిక వ్యవహారాల్లో అనుకూలత. పదోన్నతులకు అవకాశం. కార్యనిర్వహణ దక్షత.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపుల్లో జాగ్రత్త వహించాలి. సేవక వర్గ సహకారం లభిస్తుంది. ప్రయాణాదుల్లో ఒత్తిడులు తప్పకపోవచ్చు. చికాకు వార్తలకు అవకాశం. మీడియా రంగంలోని వారికి ఇబ్బందులు. క్రమంగా సౌకర్యాలు పెంచుకుంటారు. గృహ వాహనాదుల విషయంలో కొత్త నిర్ణయాలుంటాయి. సౌఖ్యంగా గడుపుతారు. ఆహార విహారాల్లో సంతోషం. విందులు వినోదాల కోసం కాలం ధనం వెచ్చిస్తారు. వారం మధ్యలో మంచి ఆలోచనలు. సంతానంతో సంతృప్తి. కొత్త నిర్ణయాదులుంటాయి. అన్ని పనుల్లోనూ అనుకూలత. ప్రయోజనకరంగా ఉంటుంది. పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తాయి. క్రియేటివిటీ ఉంటుంది. ప్రణాళికలను రచిస్తారు. వారాంతంలో పోటీలు ఒత్తిడులు తప్పకపోవచ్చు. అన్ని పనుల్లోనూ ఆచితూచి వ్యవహరించాలి.
కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో అశించిన లాభాలు అందక ఇబ్బంది పడతారు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. ఆశీస్సులు లభించకపోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను పెంచుకోవాలి. క్రమంగా ఖర్చులు పెట్టుబడులు అధికవౌతాయి. విశ్రాంతి లభిస్తుంది. సౌఖ్యంగా గడుపుతారు. విందులు వినోదాలు ఉంటాయి. ప్రయాణాదులకు అవకాశం. వ్యతిరేకతలపై విజయం. పోటీ రంగంలో గుర్తింపు. వారం మధ్యమంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కొత్త పనులపై దృష్టి. బాధ్యతలు విస్తరిస్తాయి. సామాజిక అనుబంధాలకు అనుకూలం. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలున్నా ఆశించిన సంతోషం దొరకకపోవచ్చు. వారాంతంలో కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెంచుకుంటారు. నిల్వధనం పెరుగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో పోటీలు, ఒత్తిడులు అధికం. వ్యతిరేకతల విషయంలో జాగ్రత్త. అనవసర విషయాల వైపు దృష్టి పెట్టవద్దు. సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం. క్రమంగా భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. పరిచయాలు విస్తరిస్తాయి. ఆత్మవిశ్వాసం. స్నేహితులు కలుసుకుంటారు. ప్రయాణాదులకు అవకాశం. నిర్ణయాదుల్లో శుభ పరిణామాలు. బాధ్యతలు అధికం. కార్యనిర్వహణ దక్షత. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్త. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. ముఖ్య నిర్ణయాదులను వాయిదా వేయడం మంచిది. అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. వారాంతంలో ఉన్నత కార్యక్రమాలు. సుదూర ప్రయాణావకాశాలు. వైజ్ఞానిక, సాంకేతిక, పరిశోధనా రంగంలోని వారికి సరియైన ఫలితాలు వస్తాయి.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో ఒత్తిడులు. ఆర్థిక సమస్యలు. బంధువర్గ వ్యవహారాల్లో అనవసరంగా తలదూర్చవద్దు. నిల్వధనం పోగొట్టుకునే అవకాశం. మాట విలువ తగ్గవచ్చు. క్రమంగా సంప్రదింపులకు అనుకూలం. మీడియా రంగంలోని వారికి అన్ని రకాలుగా మేలు. దగ్గరి ప్రయాణాలు. సోదర వర్గంతో అనుకూలత. మంచి వార్తలు వినే అవకాశం. ఉన్నత లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికలుంటాయి. వారం మధ్యమంలో విందులు వినోదాలపై దృష్టి. సంతోషం కోసం, సౌఖ్యం కోసం ప్రయాణం చేస్తారు. విద్యా రంగంలోని వారికి అనుకూలత. ఆహార విహారాలుంటాయి. సామాజిక హోదా పెరుగుతుంది. మాతృవర్గం వారితో కలుస్తారు. వారాంతంలో అభీష్టాలు నెరవేర్చుకునే ప్రయత్నం. ఆలోచనలకు రూపకల్పన.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమ. అధికారిక లోపాలుంటాయి. హోదా తగ్గవచ్చు. పదోన్నతులు కోరవద్దు. సేవాభావంతో విస్తరించాలి. సామాజిక గౌరవం కోల్పోయే అవకాశం. క్రమంగా అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. సంతోషంగా గడుపుతారు. కొత్త పనుల నిర్వహణపై దృష్టి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వారం మధ్యమంలో పెట్టుబడులు తప్పవు. విశ్రాంతిగా గడిపే ప్రయత్నం. ఖర్చులున్నా అభివృద్ధి ఉంటుంది. మంచి పనుల కోసం కాలం ధనం వెచ్చిస్తారు. ప్రయాణాదులకు అవకాశం. కొనుగోళ్లు ఉంటాయి. వ్యతిరేక ప్రభావాలను అధిగమించాల్సి ఉంటుంది. పోటీలు ఒత్తిడులు చికాకులు ఉంటాయి. వారాంతంలో నిర్ణయాదులు లాభిస్తాయి. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని పనుల్లోనూ విజయాలుంటాయి.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744