S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెలుగుభాష తియ్యందనం

తే॥ తెలుగు కవితల సొబగులు తెలిసి రాగ
తెలుగు కవుల ధీశక్తియు తెల్ల వౌగ
తెలుగు వెలుగుల జిలుగులు కలియబోసి
తెలుగు ప్రజలెల్లరు పుడమి భళియనంగ॥

తే॥ తెలుగు తియ్యదనము నింపు తేనె భాష
పంచదార భాష యగును పాల భాష
తినగతినగ తెల్గు పనస తొనల భాష
మేటి తెలుగు భాషకు నెవ్వి సాటిరావు॥
తెలుగు నేలను ఆనాడు ఎందరో రాజులు - శాతవాహనులు, రాష్టక్రూటులు, విష్ణుకుండినులు, శాలంకాయనులు, పల్లవ చాళుక్యులు మొదలగు వారెందరో పాలించి, సాహిత్య సాంస్కృతిక వైభవంతో విరాజిల్లచేశారు. అందువల్లే నేటికీ ఆంధ్ర జాతి భాషా సంస్కృతులు అలరారుతూ కొంత కొంతైనా వ్యాప్తి చెందుతున్నాయి. కానీ మనం భాష విషయం గమనించాల్సిన అవసరం ఉంది. రోజురోజుకు - నానాటికీ తీసికట్టు నాగంభట్టులాగా తెలుగు భాష అన్ని విధాల కనుమరుగౌతుంది. కట్టు బొట్టు, తీరుతెన్నులు, పిల్లల వేషధారణలో కూడా ఎక్కువగా పాశ్చాత్య ధోరణులు సంక్రమిస్తున్నాయనటంలో సందేహం లేదు. దీన్నిబట్టి తెలుగు స్థానే ఇంగ్లీషు ఆక్రమించి రెసిడెన్షియల్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఆంగ్లం వేళ్లూనుకొని పోయింది. మమీ డాడీ సంస్కృతి వచ్చింది. అదే అందం ఆనందంగా, కొంత సంస్కారంగా కూడా తల్లిదండ్రులు ఇతరులు భావిస్తున్నారు. పోనీ మమీ డాడీలతో సరిపెడుతున్నారా? అంటే నిత్యం వాడుకునే ఇంట్లో గల ఉప్పు, కూర, పంచదార, గుడ్డు, అన్నం, పెరుగు మొదలగు తెలుగు స్వచ్ఛమైన పదాలున్నా కూడా సాల్ట్, కర్రి, షుగర్, ఎగ్, రైస్ కర్డ్ అని ఉచ్చరిస్తున్నారు. కానీ పరిశీలిస్తే ‘రైస్’ అనే దానికి అన్నం, బియ్యం అనే రెండర్థాలున్నాయి. ఇలాగే ఆంటీ (ఆంట్) అంకుల్ అనే వాటికి అత్త మామయ్యలు అనే అర్థం. ఈ వాడకంలోను మార్పు రావాలి. (అమ్మా నాన్న అని పిలవాలి. మమీ, డాడీ మరవాలి)
సంస్కృతం జశళ ఖఔ్యశ ఘ ఆజౄళ డ్ఘశఒరీజఆ జఒ ఘ ద్యిజూ’ఒ జ్ఘశఖ్ఘ్ళ. ఱఖఆ యోతీ జఆ జఒ ఘ జూళ్ఘజూ జ్ఘశఖ్ఘ్ళ, (ఒకఫ్పుడు సంస్కృతం దైవ భాష - దేవతల భాష ప్రస్తుతం మృత భాష అయ్యింది. అట్టి మృత భాషైన సంస్కృతానే్న రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో సైతం బతికించుకోవటానికి ప్రయత్నం చేస్తూ, వారివారి ప్రాంతీయ భాషల్ని జీవభాషలుగా మలుచుకొంటున్నారు. రానురాను తెలుగు భాష సంస్కృత భాషా రక్షణ ప్రయత్నం కంటే దిగజారిపోతుంది.
తెలుగును పరిపరి విధాల రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే గాక చాలావరకు, ప్రజలు, మేధావులు, కవి పండిత రచయితలపై కూడా ఆధారపడిందనటంలో సత్య దూరము కాదు. ఈ విషయంలో తమిళ, కన్నడ రాష్ట్ర వాసులు ఆ భాషా ఛాయలు మెరుగులు తరిగిపోకుండా, తగ్గిపోకుండా, వనె్న తరగకుండా భాషను కాపాడుకుంటున్నారు. తమిళులు, కన్నడిగులు ఎక్కడ చూసినా, అడుగడుగునా హోటళ్లు, బడ్డీ బంకులు, సినిమా హాళ్లు ఒక చోటేమిటి అన్నీ కార్యాలయాలు, సంస్థలపైన, వారివారి ప్రాంతీయ భాషల్లో పేర్లు శీర్షికలు వ్రాసుకుంటున్నారు. తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. ఆ తర్వాతనే ఇంగ్లీషుకు ప్రాధాన్యమిస్తున్నారు. తమిళనాడులో కొన్నిచోట్లయితే, అసలు మచ్చునకైనా నామ ఫలకాలపై (పలకలపై, పట్టికలపై) ఇంగ్లీషు (ఆంగ్లము) కనిపించదు. యం.జి.రామచంద్రన్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకున్న ప్రభుత్వాల వరకు ఆ నియమ నిబంధనే పాటిస్తున్నారు.
దక్షిణ రాష్ట్రాలలో తొలుత ప్రాచీన హోదా లభించింది. తమిళానికే రెండో వరుసలో కన్నడానికి హోదా, ఆ తర్వాత ఎన్నాళ్లకో తెలుగునకు సంక్రమించింది. పాఠశాలల్లో, కళాశాలల్లో సైతం ప్రథమ భాషగా వాళ్ల భాషల్ని ప్రవేశపెట్టి ఆయా పాఠ్య పుస్తకాలను కూడా అచ్చు వేయిస్తున్నారు. రాష్ట్రేతరులైనా తప్పనిసరిగా తమిళాన్ని ఒక భాషగా ఎంచుకోవాల్సిందే. తమిళ ప్రభుత్వం ‘నిర్బంధ తమిళ విద్యా చట్టాన్ని’ అమల్లోకి తెచ్చింది. తమిళం ప్రాధాన్యం కాని పరభాషా (తెలుగు, హిందీ, సంస్కృతం వారైనా) విద్యార్థికి ఎక్కువ మార్కులు వచ్చినా గ్రేడ్లు, ర్యాంకులు ఇవ్వరు. ఐచ్ఛికంగా ఇంగ్లీషు ఉండనే ఉంటుంది. అప్పుడప్పుడు ఆయా సంస్థలు, విద్యా సంస్థలు, ఆదాయ వ్యయ పట్టికలు, వార్షిక నివేదికలు కూడా తమిళ, కన్నడ భాషల్లోనే సిద్ధం చేసి పఠిస్తున్నారంటే ఆశ్చర్యంగాదు, నమ్మదగిందే.
ఈ విధంగా మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల్లో సాహితీ సంస్కృతుల్లో కూడా పూర్వ వైభవాన్ని సంతరింపజేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆ విధంగా వారు భాషకు, సంస్కృతికి సొగసులు, సొబగులు అద్దుకుంటున్నారు. తమిళం తళతళలాడుతూ, కన్నడం కస్తూరిలాగా వనె్న తరగకుండా ఉంటున్నాయంటే ప్రభుత్వ సహకారంతో ప్రజల కృషే. వారు ఆంగ్లాన్ని సైతం వదలకుండా అవసరం మేరకే నేర్చుకుంటున్నారు.
తమిళ, కన్నడ, తెలుగు భాషలకు చెందిన ప్రాచీన కేంద్రాలు మైసూర్‌లో ఏర్పడ్డాయి. కానీ తమిళ ప్రజలు కృషి చేసి పట్టుదలతో మైసూరు నుంచి వారి రాష్ట్రానికే పరిశోధనా కేంద్రం సొంతం చేసుకున్నారు. మరి మన మాతృభాషైన తెలుగునకు ఏదైనా తెగులు, చెదలు, బూజు - ఏమైనా అనుకోండి, కొన్ని గమనించి పరిశీలించి ప్రభుత్వం తరఫున, మేధావుల తరఫున కొంత అప్రమేయమైన కృషి జరగాలి. అలనాడు నందమూరి తారక రామారావుగారి ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామ, తాలూకా, మండల స్థాయిలోను కొంతమేరకు ఆంగ్ల స్థానే తెలుగు అమలు జరిగింది. కొన్ని ఆంగ్ల నామాలను, శీర్షికలను కూడా పాతుకుపోయిన పాతకాలం నాటి హెడ్డింగులు (శీర్షికలు), స్వచ్ఛమైన తెలుగులోకి మార్చడం జరిగింది. ఈ విషయంలో ప్రస్తుతం ప్రభుత్వం కూడా అట్టి కృషి చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే భాషా ఔన్నత్యం, సంస్కృతీ సంప్రదాయాలను రక్షించుకున్న వారవౌతాము.
ప్రస్తుతం పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగాలు పొందాలన్నా ఇతరత్రా అవకాశాలు రావాలన్నా ఆంగ్లం తప్పనిసరని, ఇంగ్లీషు మీడియం (ఆంగ్ల మాధ్యమం)లో అభ్యసిస్తేనే కేంద్రంలోను, విదేశాల్లోను ఉద్యోగాలు వస్తాయనే భావన విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో సైతం నాటుకు పోయింది. ఇది కాదనలేని నిజం.
మన రాష్ట్రంలోగల వసతులు వనరులను చక్కబరచుకొని ప్రభుత్వం తరఫున విద్యార్థులకు మార్గం సుగమం చెయ్యాలి. ప్రభుత్వం తప్పనిసరిగా (విధిగా) పాఠశాల, కళాశాల స్థాయిలో తెలుగును ప్రవేశపెట్టినా నిర్బంధంగా అమలుపరచాలి.
తల్లి ఉగ్గుపాలతో రంగరించినట్టు అమ్మ భాష నేర్పినట్లు, ప్రాథమిక స్థాయిలో అంటే కనీసం రెండు, మూడు తరగతుల నుంచే సుమతి, వేమన శతకాల్లోని పద్యాలను ఏర్చి కూర్చి పాఠ్యాంశాలుగా చేర్చాలి.
కొన్ని కమ్మని ప్రార్థనా పద్యాలను సుభాషిత శ్లోకాలను, ఇతర శతక పద్యాలను కూడా తెలుగు పాఠ్య ప్రణాళికలో జత చెయ్యాలి. ప్రభుత్వం తరఫున నడపబడే పాఠశాలల్లో అన్ని స్థాయిల్లో తెలుగు మాధ్యమం వారికి కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించి అమలు చేయటం తగినది. పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు తప్పనిసరిగా ఇంటర్, డిగ్రీల వరకు తెలుగు నభ్యసించాలి.
కొన్ని షరతులకు లోబడి తరగతుల్లో ఎక్కువగా తెలుగు మాధ్యమానే్న ప్రవేశపెట్టాలి.
ఒకప్పుడు తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకొనేలాగా, మళ్లీ అది మొదలు కావలసిన అవసరం ఉంది. ఈ-సేవ, సాఫ్ట్‌వేర్లలో కూడా తెలుగును విరివిగా ఉపయోగంలోనికి తేవాలి.
అన్ని సంస్థల్లో దరఖాస్తులు మొదలైన వాటిని తెలుగులోనే అచ్చు వేయించాలి. తదుపరి ఇంగ్లీషు ఉండుగాక! మన రాష్ట్రంలో మొదటి ప్రాధాన్యం తెలుగునకే ఇస్తూ అన్ని పోటీ పరీక్షల ప్రశ్నపత్రావళిని కూడా తెలుగులోనే రూపొందించాలి.
వ్యావహారిక భాషలో (మూడు ప్రాంతాల్లో వున్న జనుల వాడుక భాష) పదాలు తయారుచేసి ఒక వ్యాకరణ గ్రంథాన్ని మేధావులు, విమర్శకులు సిద్ధం చేయాలి.
మూడు ప్రాంతాల్లో గల వృత్తి తదితర సంబంధమైన పదాలతో పదకోశాలు, నిఘంటువులు తయారుచేయాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వం ఒక విషయంలో మంచి పని చేస్తున్నదని చెప్పక తప్పదు. బస్సులు మొదలైన వాటిపైన లోపల పేర్లను స్పష్టంగా తెలుగులోనే వ్రాస్తున్నారు. అదే విధంగా చట్టం తెచ్చి అన్ని చోట్ల అమలు చేయాలి.
మొత్తం మీద నేటి పరిస్థితిని గమనిస్తే మన రాష్ట్రంలోనే భావి భారత పౌరులు, తెలుగు వారసులుగా కాబోయే మన తెలుగు బిడ్డలకు చదువు మాతృభాషలో చదువుకొనే స్థితి లేదు. చదువును కొనే స్థితిలో వుంది. అంటే విద్య వ్యాపారాత్మకమైంది. ఆకాశాన్నంటే ధరల్లాగా ప్రైవేటు విద్యా సంస్థలు అనేకం పుట్టుకొచ్చి అర్హత లేని ఉపాధ్యాయులతో బోధింపజేసి డబ్బును వేలకు వేలే కాదు. లక్షలుగా వసూలు చేస్తున్నారంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఈ విధానాన్ని అరికట్టడంలో పూర్తిగా విఫలవౌతుందని చెప్పలేం గానీ, దానికి తగిన చర్యలు తీసుకొనడానికి తలుచుకుంటే పూనుకోగలదు. నిజంగా అలా చేయగలిగితే కొంతకు కొంతైనా మెరుగౌతుంది. కలసికట్టుగా తెలుగును రక్షించుకోగలం. అనేక విధాలుగా పలు పద్ధతుల్లో తెలుగును మృతభాషగా కానీయక అమృతభాషగా పెంపొందింపజేయడానికి మేధావులు, అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా రాజకీయవేత్తలు సేవా దృక్పథంతో అంకిత భావంతో కృషి సలపగలగాలి. అప్పుడే సంస్కృతంలోని శర్కరాపాకం, తమిళంలోని అమృతపాకం, కర్ణాటక కస్తూరి గుబాళింపులు కలసి తెలుగు అమృతమయవౌతుంది. ఇది ఆంధ్రుల భాష. మనం తెలుగు వాళ్లం. అట్టి వీరి తెలుగు భాష తెరచాటైతే, సంస్కృతి కూడా కనుమరుగవుతుంది. అందుకే తెలుగు భాషతోపాటు సంస్కృతీ సంప్రదాయాలను రక్షించుకోవడానికి అందరం నడుం బిగిద్దాం.
‘ప్రయత్నిస్తే సాధించలేనిది లేదు. కోరికలున్నంత మాత్రాన చాలదు’ (ఉద్యమేన హి సిధ్యంతి కార్యాణి, న మనోరథైః)

-డా.ఆలా హనుమంతరావు 9390437643