S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కందమూలాలు-2

ఆయుర్వేధ గ్రంథాల్లో దీన్ని లైంగిక శక్తిని పెంచే ద్రవ్యాలలో ఒకటిగా (ఎఫ్రొడిజియాక్స్) చెప్తారు. బలకరమైన ఔషధాల్లో ఒకటి. ఇంకా ఇతర ఔషధ ప్రయోజనాలు కూడా దీనికున్నాయి. శరీరానికి సుఖంగా ఉండే పరిస్థితిని కలిగిస్తాయి. అనీజీగా, నలతగా ఉన్నదనిపించటం దీని వలన తగ్గుతుందన్నమాట. ముఖ్యంగా క్షీణింపజేసే వ్యాధుల్లో దీన్ని ఔషధంగా ప్రయోగిస్తారు.
నిజానికి నేలతాడి లేత దుంపలు కూరగాయల మార్కెట్లోకొస్తే సామాన్య మానవుడికి ఒక అద్భుత బలకర ఔషధం అందుబాటులోకి వచ్చినట్టే లెక్క. సుఖ సంసారాన్ని పెంచే ద్రవ్యం చేతికి అందితే అంతకు మించిన వరం ఇంకేముంటుంది?
నేలతాడి గడ్డలు అని మూలికలు అమ్మే షాపుల్లో లేదా, పెద్ద పచారీ షాపుల్లో అడగండి దొరుకుతాయి. ఎండించిన దుంపలే దొరుకుతాయి. వాటి శుభ్రం చేసుకుని మెత్తగా దంచిన పొడిని అరచెంచా నుండీ ఒక చెంచా వరకూ తీసుకుని, వేడిపాలలో వేసుకుని జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, ఏలకులు, జీడిపప్పు వగైరా చేర్చి తాగండి. రోజూ ఉదయం పూట లేదా రాత్రిపూట తీసుకోవచ్చు. చిక్కిపోతున్న పిల్లలకు, చదువుకునే పిల్లలకు సంకోచం లేకుండా ఇస్తే, చదువు శ్రమను తట్టుకోగలుగుతారు. ఆటగాళ్లు, పోటుగాళ్లకు ఇది వారి శరీర దారుఢ్యాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది.
ఉబ్బసం తగ్గుతుంది. ఊపిరితిత్తులు బలసంపన్నం అవుతాయి. ఆయాసం ఆగుతుంది. శొంఠి పొడి, నేలతాడి గడ్డల పొడి సమానంగా తీసుకుని పెరుగులో కలిపి తింటే విరేచనాలు ఆగుతాయి. వాముపొడితో కలిపి తింటే దగ్గు ఆగుతుంది.

పిల్లిపీచర దుంపల కూర, పప్పు, పచ్చడి, పాయసం
శతావరి అనేది ఆయుర్వేద ఔషధాల గురించి తెలిసిన ప్రతీ ఒక్కరికీ పరిచయం ఉన్న పేరే! పిల్లిపీచర, పెద్ద పిల్లిపీచర ఇలా పిలుస్తారు. పెద్దదైనా చిన్నదైనా గుణాలు ఒక్కటే! ఇది కూడా కూరగాయల మార్కెట్లోకి తేవలసిన ఆహార ద్రవ్యమే! అవగాహన లేకపోవటం వలన మనం కోల్పోతున్న ప్రకృతి వరాలలో ఇది ఒకటి!
పురాణకాలపు మహానుభావుల మేథాశక్తికి, శరీర దారుఢ్యానికి కీలకమైన రహస్యం వారి ఆహార పదార్థాల్లో ఇలాంటి అద్భుత ద్రవ్యాలు ఉండేవి. మనం నిస్సారమైన ద్రవ్యాలను గొప్ప అనుకుని ఫ్యాషన్ కోసం తింటున్నాం. అందువలన శారీరక, మానసిక దృఢత్వాన్ని స్వయంగా కోల్పోతున్నాం.
రక్తస్రావాలు అవుతున్న వారికి, విరేచనాలు అవుతున్న వారికి, షుగరు వ్యాధి కారణంగా క్షీణించి పోతున్న వారికి, తలతిరుగుడు, ఒళ్లు తూలుడు ఉన్నవారికి, ఫిట్స్ జబ్బుతో బాధపడేవారికి, ఎయిడ్స్, క్షయ, హెపటైటిస్ బి లాంటి క్షీణింపజేసే వ్యాధులతో బాధపడేవారికి, సంతానం లేనివారికి, గర్భాశయ దోషాలతో బాధపడేవారికి, వీర్యకణాలు తక్కువగా ఉన్నవారికి, పేగుపూత, జీర్ణకోశ వ్యాధులు, ముఖ్యంగా అమీబియాసిస్ వ్యాధులతో బాధపడేవారికి, బీపీ, గుండె జబ్బుల్తో బాధపడేవారికి, లివరు వ్యాధులతో బాధపడేవారికి పిల్లిపీచర దుంపలు ఔషధంగా పని చేస్తాయి. ఇవేవీ లేనివారు తింటే ఇలాంటివి రాకుండా ఉంటాయి. అందరికీ మేలు చేసే ద్రవ్యం ఇది.
గ్రామీణ ప్రాంతాల్లో తాజా లేతదుంపలు దొరికితే కూర, పప్పు, పులుసు, పచ్చడి వగైరా చేసుకోవచ్చు. లేదా పెద్ద పచారీ షాపుల్లోనూ, వనమూలికలు అమ్మే షాపుల్లోనూ ఎండించిన దుంపలు దొరుకుతాయి. వీటిని తెచ్చుకుని మెత్తగా మిక్సీ పట్టి, ఆ పొడితో పాయసం కాచుకుని తాగవచ్చు. పాయసంలో జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, ఏలకుల్లాంటివి తగు మోతాదులో కలుపుకుని తాగితే అద్భుతంగా పని చేస్తాయి. జీర్ణకోశ వ్యాధుల్లో పెరుగుతో తీసుకుంటే మంచిది.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com