S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పత్ర సందేశం

వేదవాది ఆశ్రమంలో విద్యార్థులంతా ఆ రోజు మధ్యాహ్న భోజనం అయ్యాక గురువుగారి కోసం ఎదురుచూస్తూ నింబ అశ్వత్థ వృక్షాలు కలిసి ఉన్న అరుగు చుట్టూ కూర్చుని ఉన్నారు. వేదవాదుల వారు వచ్చి అరుగు మీద ఆశీనులై ‘బిడ్డలారా! ఈ వృక్ష ఛాయ ఎంత ఆహ్లాదంగా ఉందీ! చల్లని గాలులు, కమ్మని ప్రాణవాయువూ! అందుకే వృక్షాలు మన రక్షకులు అంటారు.’
‘ఔను గురుదేవా! వృక్షాలు యధార్థంగా మన రక్షకులే! మన ఆశ్రమంలోని వృక్షాలన్నీ మాకెంతో చల్లని నీడను ఇస్తున్నాయి’ అన్నాడు వినయుడు.
‘నీడే కాదు. వృక్షాలు మనకెన్నో విలువలను కూడా నేర్పుతున్నాయి వినయా!’
‘ఔను గురుదేవా! మనకు పండ్లూ, కాయలూ కూడా అందిస్తున్నాయి కదా!’ విజయుడు చెప్పాడు.
‘అంతేకాదు విజయా! వృక్షాల నుండీ మనమెన్నో మానవతా విలువలను నేర్చుకోవాల్సి ఉంది. ఈ రోజు మనం భోజనం చేసిన ఆకు ఏది?’
‘అరిటాకు గురుదేవా!’ ఆనందు చెప్పాడు.
‘ఆనందూ అరిటాకు గురించీ కొద్దిగా చెప్పగలవా?’
‘తప్పక గురుదేవా! మనం వాడిన నీటిని వాడుకుని అరటిమొక్క పెరిగి మనకు కాయలనూ, పండ్లనే కాక, భోజనం చేయను ఆకులనూ ఇస్తున్నది. గెలవేసి కొట్టేశాక, దాని ఊచనూ కూరకు వాడతాం. నారతో పూలూ కట్టుకుంటాం, తాను జీవితం చాలిస్తూ మనకు పిలకలను కూడా ఇస్తున్నది’ అన్నాడు ఆనందు.
‘మరి మనం అరటి నుండీ ఏ విలువలు నేర్చుకోవాలి ఆనందూ!’
‘గురుదేవా సంపూర్ణ పరోపకారం’
‘అంతేకాదు ఆనందూ! మనం తిని పారేసినా తాను తన సేవలను అందిస్తూనే ఉంటుంది అరటి చెట్టు. మనం ఎవరికైనా సాయం చేస్తే వారు మనలను మరచిపోయినా, మనకు కృతజ్ఞత చెప్పకపోయినా మన స్వభావాన్ని మార్చుకోక మన సేవ కొనసాగిస్తూనే ఉండాలని కూడా మనం అరటి నుండీ నేర్చుకోవాలి’
‘నిజం గురుదేవా!’ అన్నారంతా.
‘మరి కరివేప గురించీ ఏమైనా చెప్పగలరా?’
‘గురుదేవా! కరివేపలో ఖనిజాలున్నాయనీ, చాలా ఔషధ గుణాలున్నాయనీ తమరు ఒకమారు సెలవిచ్చారు’ చెప్పాడు చలపతి.
‘ఔను చలపతీ! బాగానే గుర్తుంచుకున్నావ్! ఇంకా మనం నేర్చుకోవలసింది ఉంది. ‘కూరలో కరివేపాకులా తీసిపారేసేరు’ అనే సామెత ఉంది. అంటే మన సాయం స్వీకరించి మనలను మరచినా మన స్వభావం మార్చుకోరాదనీ కరివేప నుంచీ మనం నేర్చుకోవాలి.’
‘మరి గురుదేవా! వేప చేదు కదా! దీని నుంచీ మనం ఏమి నేర్చుకోవాలీ?’
‘బాగా అడిగావు భానూ! వేప పూర్తిగా చేదైనా మానవులకు ఎంతో సేవ చేస్తున్నది. వేపలో సంపూర్ణంగా వైద్య విలువలు ఉన్నాయి. ఆకురసం చెట్లకు పోస్తే చీడ పీడలు రావు. ఒంటికి రాచుకుని స్నానం చేస్తే చర్మ వ్యాధులు రానే రావు. ఎండు ఆకులను కాల్చితే ఆ పొగకు దోమలు నశిస్తాయి. వేరు చాది ఆ గంధం వేసవిలో ఒంటికి రాస్తే చెమటకాయలు రావు. వేప నూనె కూడా చీడలను రానివ్వదు. వేపనూనె దీపం కంటికి చలువ చేస్తుంది. అందరూ చేదును ఇష్టపడకపోయినా తన సర్వస్వం సేవకే ఇస్తున్న వేప నుంచీ సేవాభావన నేర్చుకోవాలి.’
‘గురుదేవా! మన ఆశ్రమంలోని నీటి కొలనులో ఉన్న తామర మాటేంటీ?’
‘మాధవా! బాగా అడిగావు! తామరలా ఎక్కడ ఉన్నా మనం వాటిని మనస్సుకు పట్టించుకోరాదని తామర సూచిస్తుంది. నీటిలో ఉన్నా నీరు ఆకుకు అంటదు’
‘మరి మన పక్కనే ఉండి కమ్మని వాసన ఇస్తున్న మరువం మాటేంటి గురుదేవా!
‘మాధవా! మరువంలా స్నేహం ఎల్లకాలం కమ్మగా ఉండాలి. ఎండినా మరువం వాసన తరగదు. మంచి వారి స్నేహం మరువం మొక్కలా ఉండాలంటారు. ఇవన్నీ బాగా గుర్తుంచుకోండి. నేను కాస్త విశ్రమిస్తాను. రేపు మరి కొన్నింటి గురించీ చెప్పుకుందాం’ అంటూ లేచారు వేదవాది.

- ఆదూరి హైమావతి 9632503483