S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రకృతితో మమేకమై...

నేటి ఉరుకుల, పరుగుల యాంత్రిక జీవనంలో మానవుడు కాలంతో పాటు పరిగెత్తి పరిగెత్తి అలసిపోతున్నాడు. అందుకే సంవత్సరానికి ఒక్కసారైనా యాంత్రికతకు దూరంగా, ప్రకృతికి దగ్గరగా గడపాలనుకుంటున్నాడు. ఇందుకోసం కొత్త కొత్త దారులను ఎంచుకుంటున్నాడు. ఈ విషయాన్ని కనిపెట్టారేమో.. గానీ కొంతమంది వ్యాపారవేత్తలు ఇలాంటివారికోసం.., ప్రకృతితో సహజీవనం చేసేందుకు వీలుగా చెట్లపై రిసార్ట్స్‌ను నిర్మిస్తున్నారు. అన్ని రకాల సౌకర్యాలతో చాలా అందంగా, నివాసానికి అనువుగా వీటిని నిర్మిస్తున్నారు. నిజానికి ఈ ఆలోచన ఇప్పటిది కాదు. భూమి గుండ్రంగా ఉంది అన్నట్లు.. మానవుడు మళ్లీ ఆనాటి కాలానికి వెళ్లిపోయాడా? అనిపిస్తున్నాయి ఈ రిసార్టులను చూస్తుంటే.. వీటికి గొప్పచరిత్ర ఉంది. చెట్ల నివాసాలను దక్షిణ పసిఫిక్ ఆగ్నేయాసియా ప్రజలు మొదటిసారిగా కట్టారు. అప్పట్లో వీరు కుటుంబాలను జంతువుల నుంచి రక్షించుకోడానికి చెట్లపై గృహాలను నిర్మించుకునేవారు. మధ్యయుగాల్లో ప్రాన్సిస్కాన్ సన్యాసులు ధ్యానం చేయడానికి చెట్ల గదులను వినియోగించేవారు. హిందూ సన్యాసులు కూడా ఇలాంటి ఇళ్లలోనే నివసించేవారు. అనేక శతాబ్దాల తర్వాత నేడు వ్యాపారవేత్తలు.. తమ వ్యాపారంలో భాగంగా యాత్రాస్థలాల్లో ఇలాంటి గదులను నిర్మించి పర్యటకులను ఆకర్షిస్తున్నారు.
* కేరళలోని లక్కిడిలోని వైత్రి అనే రిసార్ట్స్‌ను అడవి మధ్యలో చెట్లపై నిర్మించారు. ఇక్కడ ఆయుర్వేద స్పా, స్విమ్మింగ్ పూల్, ఆటస్థలాలే గాక ఆరోగ్య కేంద్రం కూడా ఉంది.
* రాజస్థాన్‌లోని జైపూర్‌లో నేచర్ ఫామ్ పేరిట ఇలాంటి చెట్టు రిసార్టులు ఉన్నాయి. ఇవి చాలా లగ్జరీగా ఉన్నాయి. ప్రకృతిపై ప్రేమ ఉన్నవారు ఎవ్వరైనా ఇక్కడికి వెళ్లి ఉండొచ్చు.
* కేరళలోని వయనాడ్‌లో ట్రాన్‌క్విల్ రిసార్ట్ కూడా ఇదేవిధంగా నిర్మించిందే.. దట్టమైన అడవి మధ్యలో బలమైన చెట్లపై గదుల నిర్మాణాన్ని చేపట్టారు. ఇక్కడ దాదాపు వందకు పైగా పక్షులు నివసిస్తాయి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. క్రూర జంతువుల నుంచి రక్షణగా ఇక్కడ ప్రత్యేకమైన సిబ్బంది కూడా ఉంటారు.
* మధ్యప్రదేశ్‌లోని విజర్‌హియాలో కూడా ట్రీ హౌసెస్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇవి చాలా అధునాతనమైన సౌకర్యాలను కలిగి ఉన్నాయి.
* కర్ణాటకలోని దన్‌దేలిలోని హార్న్‌బిల్ రిసార్ట్ నది ఒడ్డున చెట్లపై ఉంటుంది. ఒకవైపు చెట్లు, మరొకవైపు పచ్చని ప్రకృతి, కొండలతో చాలా ఆహ్లాదకరంగా, అందంగా ఉంటాయి ఈ రిసార్ట్స్.
* తమిళనాడులో సఫారీ లాండ్ రిసార్ట్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ప్రకృతి నడుమ ట్రెక్కింగ్, గుర్రపు స్వారీ, ఏనుగు స్వారీ.. వంటి సౌకర్యాలు ఉంటాయి.
* కేరళలోని కల్‌పెట్టాలోని చెట్టుపై ఉన్న ఇళ్లు చాలా అందంగా, భిన్నంగా ఉంటాయి.
* గోవాలోని ఖామా కేత్న ఎకోలాజికల్ రిసార్ట్ బీచ్‌లకు దగ్గరగా ఉన్న చెట్లపై అందంగా కట్టారు. ఇక్కడ ఉంటే ఎంచక్కా సముద్రాన్ని వీక్షిస్తూ సూర్యోదయం, సూర్యాస్తమాలను చూడవచ్చు. ఇవి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉండి.. కేవలం సముద్ర ఘోష తప్ప.. మరింకేం శబ్దాలు వినిపించకుండా ఉంటుంది.
* పాండిచ్చేరిలోని చున్నంబార్ బీచ్ రిసార్ట్ కూడా ఇలాంటి కోవకు చెందించే. పాండిచ్చేరికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని ఈ ట్రీ హౌసెస్ చాలా అందంగా ఉంటాయ. క్రిస్టల్ క్లియర్ పూల్‌లో బోటింగ్ ఓ మధురానుభూతి.
వీలున్నపుడల్లా ఇలా ప్రకృతికి దగ్గరగా, ప్రకృతి ఒడిలో గడిపితే ఒత్తిడి పారిపోయి.. మనసు ఆహ్లాదంతో నిండిపోయి.. శరీరం, మెదడు, మనసు మరో ఐదు సంవత్సరాలు ఎటువంటి కష్టమైన పనులు, ఒత్తిడికి తట్టుకునే విధంగా తయారవుతాయి.