S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అభ్యర్థనర్జీ

సూర్యుడినడిగా.. చంద్రుడినడిగా..
పగలు రాత్రి కలిపేస్తుంటారు
లోకం చుట్టేస్తుంటారు.
ఎండలు కాయిస్తుంటారు
వెనె్నల కురిపిస్తుంటారు
మలినాల్ని కలుషాల్ని కడిగేస్తుంటారు
నీ చూపు సోకి సరోజం మురిసి మురిసి
ప్రకాశిస్తుంటంది.
శశికిరణం తాకి కలువ చలువ
కురిపిస్తుంటుంది
మరి నాకెందుకు ఈ నైరాశ్యం
నాకెందుకు ఈ నిశీది యాగం
ఎందులకీ ఈ విరహతాపం...
నా చెలి నెచ్చెలి ఎచ్చట దాగెనో
ఎప్పటికి నా కన్నుల కగుపడునో
దారులన్ని వెతికే నీవైనా తెలుపుమా!
రేయైనా పగలైనా మీరెరుగనిదా
నా చెలియ... ...
తను నన్ను చేరగ చేయలేరా?

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505