S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జీవితాన్ని గెలవాలి

మనసు వికసిస్తే
మాట పరిమళిస్తుంది
సౌజన్యం వెల్లివిరుస్తుంది
భావం సార్వత్రికమైతే
ఆలోచన విస్తరిస్తుంది
అవగాహన విస్తృతవౌతుంది
కోపాన్ని నియంత్రిస్తే
వివేచన చొరవ తీసుకొంటుంది
బుద్ధి వికసిస్తుంది
నమ్మకాలకు నిజాల అవసరం వుంది
ఎందుకంటే అవి నిజమో కాదో తేలాలి గనక
నిజాలకు నమ్మకాలతో పనిలేదు
ఎందుకంటే నమ్మినా నమ్మకపోయినా
నిజం నిజమే గనుక
నిర్ణయాలను అభిప్రాయాలు నిర్దేశించలేవు
ఎందుకంటే అవి ఎపుడూ సందిగ్ధాలే గనక
మనసెపుడూ ఒంటరి పోరాటమే చేస్తుంది
తనది కాని మాటను అది ఎన్నడూ తలకెక్కించుకోదు
కష్టాన్నైనా, సుఖాన్నైనా అది ఒంటరిగానే భరిస్తుంది.
*
ఇలా ఎన్నో
మనిషికి తప్పని జీవిత పాఠాలు
మనసుకు వదలని ఆటుపోట్లు
జీవితాన్ని పరికించాల్సింది
ఇలాంటి వాస్తవిక దృక్కోణాల నుంచే కదా
జీవితాన్ని మలచుకోవాల్సింది
ఇలాంటి సార్వత్రికమైన
హేతుబద్ధ సోపానాల మీంచే కదా
జీవితాన్ని నడిపించాల్సింది
దృఢతరమైన ఇలాంటి సంకల్పాల
సాధనలోంచే కదా!
వాస్తవాల్ని కాదని
ఏ మనుగడా సాగింది లేదు
మనుగడలోకి వెళ్లకుండా
ఏ వాస్తవమూ బయటపడింది లేదు
మనకు కావలసింది
మనల్ని గెలిచే జీవితాలు కాదు
మనం గెలిచే జీవితాలు
గెలుచుకొన్న జీవితంలో
గొప్పతనం ఉంటుంది
ఆ గొప్పతనం వెనుక సంతృప్తి ఉంటుంది
మన గెలుపునకు బహుమతిగా
ఆ సంతృప్తే మిగులుతుంది.

-కె.రవీంద్రబాబు 90527 78988