S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విజన్

ఒక ప్రిన్సిపాల్ నుంచి సమాజం ఏం ఆలోచిస్తుందో అని చెప్పటం చాలా కష్టం. ప్రిన్సిపాల్‌ను ఆదేశించటం, నిర్దేశించటం కష్టం. మా ఆలోచనను బట్టి ప్రిన్సిపాల్‌కు ఏడే విద్యుక్త ధర్మాలను సూచించామే కానీ సమాజం ప్రిన్సిపాల్ నుంచి చాలా ఆశిస్తుంది.
ఉదాహరణకు అబ్రహాం లింకన్ తన కొడుకు గురించి ఒక టీచర్‌కు రాసిన ఉత్తరమే దీనికి సాక్ష్యం.
* * *
తరగతి గదిలో కొంతమంది మంచి టీచర్లుగా పేరు పొందారు కానీ మంచి ప్రిన్సిపాల్ కాలేక పోయారు. ఒక కాలంలో మంచి ప్రిన్సిపాల్ అయితే అన్ని కాలాల్లో మంచి ప్రిన్సిపాల్ పేరు రావాలనేమీ లేదు. ఒక స్కూల్లో మంచి పేరు వస్తే అన్నీ స్కూళ్లల్లో మంచి ప్రిన్సిపాల్ అని పేరు రావాల్సిన అవసరం లేదు. ఒక ప్రిన్సిపాల్ అనుభవపూర్వకమైన ఎత్తుగడ ఒక స్కూల్లో ఉపయోగపడితే, అదే ఎత్తుగడ అన్ని స్కూళ్లల్లో పనికి వస్తుందని కాదు. ప్రిన్సిపాల్ విధులు నిర్వహించటం చాలా కష్టం. ప్రతి స్కూల్ లోపల సమస్యలుంటాయి. ప్రిన్సిపాల్ తనదైన శైలిలో ఆ సమస్యను పరిష్కరిస్తారు. గడియారం ముల్లును నడిపించటానికి ఉండే స్ప్రింగ్ బోర్డులాగా హెడ్‌మాస్టర్ చాకచక్యమనే స్ప్రింగ్ బోర్డులో స్కూలును నడిపిస్తారు.
* * *
ప్రతి సంవత్సరం జనవరిలో విడుదల చేసినట్లుగానే జనవరి 16న, 2017 నివేదికను ‘ప్రథమ్’ అనే ఆర్గనైజేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ స్కూళ్లల్లో 5-16 సం.ల మధ్యన గల బాలబాలికలు విద్యా ప్రమాణాల మీద పాఠశాల స్థితిగతులపై సర్వే చేయించారు. పిల్లల ఇళ్లకు వెళ్లి సమాచారాన్ని తీసుకున్నారు. ఆ సమాచారం తీసుకున్నవారు ప్రథమ సంస్థ నియమించిన కొంతమంది రిపోర్టర్లు కావచ్చును. అనుకున్న ప్రకారమే, ఎప్పటిలాగే ప్రభుత్వ స్కూళ్లల్లో విద్యా ప్రమాణాలలు కూలిపోతున్నాయని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. కానీ, ఆ వలంటీర్లు ఒక ప్రశ్నపత్రాలను తయారుచేసుకున్నారు. పిల్లలను ఇంటర్వ్యూ చేసుకున్నారు. ప్రభుత్వ విద్యాలయాలపై ఒక నిర్ణయానికి వచ్చే ముందు బాధ్యతాయుతమైన వ్యక్తులతో విచారణ జరిపితే బాగుండేది. పిల్లలు కొత్త మనుష్యులతో వాస్తవమైన విషయాన్ని చెప్పలేక పోతారు. కానీ, ఆ సమాచారం ఆధారం చేసుకుని ప్రభుత్వ స్కూళ్లపైన కామెంట్ చేయటం ప్రజాస్వామిక వ్యవస్థకే అది ప్రమాదంగా భావించవచ్చు. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రభుత్వ స్కూళ్లు కీలక పాత్ర వహిస్తాయి. అలాంటి స్కూళ్ల మీద అపనమ్మకం కలిగిస్తే కామన్ స్కూల్ సిస్టం బలహీనమవుతుంది. గత రెండు మూడు సంవత్సరాల నుంచి నేను ప్రభుత్వ స్కూళ్లను తిరుగుతున్నాను. అందరూ అనుకున్నట్లుగా లేవు. చలామంది ఉపాధ్యాయులు దీక్షతో పని చేస్తూ ఉన్నారు. ఒకటి రెండు శాతం పొరపాట్లు ఉండవచ్చు. 98 శాతం దీక్షతో పనిచేస్తున్నప్పుడు ఒక శాతం పొరపాట్లనే గోరంతలు కొండంతలు చేసి చూపించటం భావ్యం కాదు. డ్రాప్ అవుట్స్ ఉన్నారు వాస్తవమే. డ్రాప్ అవుట్స్‌కు కారణాలు స్కూలు పనిచేయక పోవటం కారణం కాదు. విద్యార్థుల కుటుంబ ఆర్థిక స్థితిగతులను గమనంలోకి తీసుకోవాలి. పత్తి పంటల ఏరివేతల సమయంలో వారి తల్లిదండ్రులే పిల్లలను బడి నుంచి తీసుకుపోతున్నారు. దాన్ని ఆధారం చేసుకుని 14 సంవత్సరాల వయసు పిల్లలు డ్రాప్ అవుట్ 5.3% ఉన్నారని, 15 సం.ల వయసు పిల్లలు 8%, 16 సం.ల పిల్లలు 9% బడి మానేస్తున్నారని ప్రథమ సంస్థ నివేదిక నిస్తుంది. ఆ పిల్లలు డ్రాప్ అవుట్‌కు ఆయా కుటుంబాల సామాజిక పరిస్థితులు చెప్పాలి. అప్పుడే ఆ డ్రాప్ అవుట్స్‌ను ఎలా నివారించగలుగుతామో తెలుస్తుంది.
విమర్శ నిర్మాణాత్మకంగా ఉంటే పేద వర్గాలకు ఉపయోగపడుతుంది కానీ దానికి బదులుగా వ్యవస్థను క్రుంగదీయటానికై ఉపయోగపడితే బలహీనమవుతుంది. దీని వలన ప్రైవేట్ యాజమాన్యంతో పోల్చటం సరికాదనుకుంటాను. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులతో ప్రతి సంవత్సరం ఇంటరాక్ట్ అవుతున్నారు. ప్రమాణాల విషయంలో ప్రభుత్వ స్కూళ్లకు, ప్రైవేటు స్కూళ్లకు అంతరాయం అంత ఎక్కువేం కాదు. డ్రాప్ అవుట్ అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థపై మాట్లాడటం సరికాదు. అది కూడా ఒక్క నిజామాబాద్ జిల్లాను అంచనా వేసి జనరలైజ్ చేసి మాట్లాడటం సరికాదు. మంచికి ప్రేరణ నివ్వండి. అలా చేస్తే పేద వర్గాలకు అండగా నిలిచిన ప్రభుత్వ విద్యా వ్యవస్థ బతుకుతుంది. అన్ని దేశాల్లో కూడా ప్రభుత్వ విద్యను కాపాడుకుంటున్నారు. స్కూల్ లెవెల్‌లో మన దేశంలో, ప్రధానంగా తెలంగాణలో ప్రభుత్వ విద్యారంగమే బలమైనది. అందరం కలిసి పబ్లిక్ స్కూళ్లపై విశ్వాసాన్ని పెంచే పని చేయాలి.
సామాన్యుడు పిల్లల చదువుపై ఎంత డబ్బు ఖర్చు పెడితే ఆర్థిక ఎదుగుదలకు దోహదపడుతుంది. ప్రభుత్వ స్కూళ్లలో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులున్నారు. వాళ్లకు సెక్యూరిటీ జాబ్ ఉన్నది. ఆ స్కూళ్లను ఎంత ఆదరిస్తే సామాన్యులకు ఎంతో లాభం చేసినట్లవుతుంది. తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్లు మాత్రమే ఉండేవి. కనీసం స్కూల్ లెవెల్‌లో అయినా గానీ ప్రభుత్వ స్కూళ్ల శాతాన్ని పెంచితేనే మనం ఆశిస్తున్న బంగారు తెలంగాణకు బంగారు భవిష్యత్తు ఉంటుంది.

-చుక్కా రామయ్య