S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (18-8-2019 నుంచి 24-8-2019 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు, పెట్టుబడులు పెరుగుతాయి. విశ్రాంతి లభిస్తుంది. వినోద, విహార యాత్రలకు అవకాశం. గౌరవం పెంచుకోవడానికి ఖర్చులు చేస్తారు. ప్రయాణాదులు సంతోషాన్నీ, సంతృప్తినీ ఇస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, దానధర్మాలు చేయడం మరింత శ్రేష్ఠం. వారం మధ్యమంలో ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. కార్యనిర్వహణ దక్షత. అన్ని పనులకూ అనుకూలం. బాధ్యతలు పెంచుకుంటారు. గుర్తింపు లభిస్తుంది. ఆవేశంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. ఆలోచనలకు రూపం కలుగుతుంది. తొందరపాటు నిర్ణయాదులు కూడదు. సంతాన వ్యవహారాల విషయంలో చర్చ ఉంటుంది. వారాంతంలో కుటుంబం, బంధువర్గం వ్యవహారాల్లో ఒక సంతృప్తి. మాట విలువ పెంచుకుంటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. ఊహించని ఇబ్బందులను ఎదుర్కోవాలి. శ్రమాధిక్యం. మానసికమైన ఒత్తిడులు. కొత్త పనుల నిర్వహణకు దూరంగా మెలగాలి. కార్యనిర్వహణను వాయిదా వేయడం శ్రేష్ఠం. వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. వారం మధ్యమంలో ఉన్నత కార్యక్రమాల రూపకల్పన. విద్య వృత్తి ఉద్యోగ రంగాల్లో కీర్తి ప్రతిష్ఠలుంటాయి. సుదూర ప్రయాణాలపై ఆసక్తి. ప్రణాళికలుంటాయి. సంప్రదింపులకు అనుకూలం. శారీరకమైన వత్తిడులు తప్పకపోవచ్చు. ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్త వహించాలి. వారాంతంలో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అధికారిక కార్యక్రమాల నిర్వహణ, రూపకల్పన. సామాజిక గౌరవం పెంచుకునే సమయం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో ఆహార విహారాదులకు అనుకూలం. సౌఖ్యంగా గడిపే ఆలోచనలు. ప్రయాణాది సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. గృహ, వాహనాదుల విషయం ప్రస్తావనకు వస్తుంది. విద్యారంగంలోని వారికి అనుకూలత. శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాదులు లాభిస్తాయి. దానధర్మాల వల్ల మరింత మేలు కలుగుతుంది. విశ్రాంతి లభిస్తుంది. వారం మధ్యమంలో సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త పనులపై దృష్టి. ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గ వ్యవహారాల్లో సంతోషం. సంతృప్తి. సుదూర ప్రయాణ భావనలు. తొందరపాటు కూడదు. నిర్ణయాదులు ఇబ్బంది పెట్టవచ్చు. వారాంతంలో వ్యతిరేకతలు అధికం. పోటీలు వత్తిడులు చికాకులను అధిగమించాలి. శ్రమతో విజయ సాధన. గుర్తింపు లభిస్తుంది. రుణాదుల విషయంలోనూ జాగ్రత్త అవసరం.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ లాభాలుంటాయి. ప్రయోజనాలు సంతృప్తినీ, సంతోషాన్నీ ఇస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కొత్త పనులపై దృష్టి. ఆలోచనలకు రూపకల్పన. సంతాన వ్యవహారాల్లో సంతోషం. క్రియేటివిటీ పెరుగుతుంది. వారం మధ్యమంలో ఖర్చులు పెట్టుబడులు పెరుగుతాయి. వేరు వేరు పనుల కోసం కాలం ధనం వెచ్చిస్తారు. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాల కోసం వెచ్చిస్తారు. పెట్టుబడుల్లో, ప్రయాణాదుల్లో కొంత జాగ్రత్తగా మెలగాలి. విశ్రాంతి కొంత తగ్గే సూచనలు. సౌఖ్యం గూర్చి ఆలోచిస్తారు. కొంత వ్యతిరేకత కూడా ఉంటుంది. వారాంతంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేరువేరు బాధ్యతలు సంతోషాన్నీ, సంతృప్తినీ ఇస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరించే అవకాశం. పెద్దల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాదులుంటాయి. సంతోషంగా, సంతృప్తిగా గడుపుతారు. పాత మిత్రుల కలయిక లేదా వార్తలు అందుతాయి. సంప్రదింపులకు అనుకూలం. వారం మధ్యమంలో అనుకోని సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. చిన్నచిన్న ప్రమాదాలకు కూడా అవకాశం ఉంటుంది. వ్యర్థంగా కాలం ధనం కోల్పోయే అవకాశం. కార్యనిర్వహణలో ఇబ్బందులు. కుటుంబ ఆర్థికాంశాల్లో అప్రమత్తం. ఊహించని సమస్యలు. ఆరోగ్య లోపాలకు అవకాశం. పనులను వాయిదా వేసుకోవడం మంచిది. అన్ని పనుల్లోనూ ఆచితూచి వ్యవహరించాలి. వారాంతంలో కొత్త పనులపై దృష్టి. ఉన్నత, ఉత్తమ వ్యవహారాలకు అవకాశం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలుంటాయి. సోదరవర్గంతో అనుకూలత. వేరు వేరు రూపాల్లో గౌరవాలు, ప్రయోజనాలుంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సహకారం లభిస్తుంది. సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలం. వారం మధ్యమంలో ఆహార విహారాదులపై దృష్టి. గృహ వాహనాది సౌకర్యాదులు ప్రభావితం చేస్తాయి. వేరు వేరు రూపాల్లో సౌఖ్యం పెంచుకునే ఆలోచనలు. శ్రమ తప్పకపోవచ్చు. చిన్నచిన్న ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. కార్యనిర్వహణలో అప్రమత్తంగా మెలగాలి. వృత్తి ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్త. పదోన్నతులు కోల్పోయే అవకాశం. వారాంతంలో ఆలోచనలకు రూపకల్పన. క్రియేటివిటీతో వ్యవహారాల నిర్వహణ. సంతానవర్గ వ్యవహారాలు సంతోషాన్ని ఇస్తాయి.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. పదోన్నతులకు అవకాశం. సౌకర్యాదులు సంతోషాన్నీ, సంతృప్తినీ ఇస్తాయి. పోటీ రంగంలో విజయం. గుర్తింపు లభిస్తుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. పితృవర్గ వ్యవహారాల్లో పాల్గొంటారు. శ్రమతో సంతోషం. వారం మధ్యమంలో లాభాలుంటాయి. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. చేసే ప్రతి పనిలోనూ లాభదృష్టి ఉంటుంది. సోదర సంబంధమైన చర్చలుంటాయి. కమ్యూనికేషన్స్ విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వారాంతంలో ఖర్చులు పెట్టుబడులు అధికం. ప్రయాణాదులకు అవకాశం. విశ్రాంతి లభిస్తుంది. మంచి వార్తలు వింటారు. సంప్రదింపులకు అనుకూలం. స్ర్తి వర్గ సహకారం లభిస్తుంది.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో పోటీ రంగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యతిరేకతలపై విజయం. కార్యనిర్వహణ దక్షత. శ్రమాధిక్యం. కుటుంబ ఆర్థికాంశాలు లాభిస్తాయి. మాట విలువ పెంచుకుంటారు. శత్రు రోగ రుణాదులపై విజయం. చికాకులను అధిగమించాలి. వ్యవహారాల్లో శ్రమతో అనుకూలత. వారం మధ్యమంలో పరిచయాలు లాభిస్తాయి. లాభాలు సంతోషాన్నిస్తాయి. కొంచెం వత్తిడి తప్పకపోవచ్చు. స్నేహానుబంధాలకు అనుకూలత. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. ప్రయాణాదులకు అవకాశం. వేరువేరు రూపాల్లో ప్రయోజనాలుంటాయి. కొత్త పనుల నిర్వహణకు శ్రీకారం చుడతారు. వారాంతంలో అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. నిర్ణయాదులను వాయిదా వేసుకోవడం మంచిది.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో శుభ పరిణామాలు. మాట విలువ పెరుగుతుంది. ఊహించని ప్రయోజనాలుంటాయి. అనుకోని సమస్యలు కూడా ఉండే అవకాశం. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. బంధువర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. వారం మధ్యమంలో ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. సంప్రదింపులకు అనుకూలం. సోదరవర్గ వ్యవహరాల్లో శుభ పరిణామాలు. ఆధ్యాత్మిక, వైజ్ఞానిక యాత్రలకు అనుకూలం. భాగస్వామ్యాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార వ్యవహారాల్లో కొంత వత్తిడి తప్పకపోవచ్చు. శ్రమతో కార్యక్రమాలుంటాయి. కమ్యూనికేషన్స్ లాభిస్తాయి. మంచి వార్తలుంటాయి. వారాంతంలో ఆహార విహారాలపై దృష్టి. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి. లక్ష్యాలను సాధిస్తారు. వైజ్ఞానిక, పరిశోధన, ఉన్నత విద్యారంగాల వారికి అత్యంత అనుకూలత. సుదూర ప్రయాణాలకు అవకాశం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలోచనలు ఫలిస్తాయి. సంతాన వర్గంతో సంతోషం. వారం మధ్యమంలో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అధికారిక వ్యవహారాలుంటాయి. కుటుంబ ఆర్థికాంశాల్లో తొందరపాటు కూడదు. సామాజిక గౌరవం పెంచుకుంటారు. తండ్రి సంబంధ వర్గీకుల కార్యక్రమాలుంటాయి. వ్యాపారాదుల్లో జాగ్రత్త వహించాలి. శ్రమతో కార్యక్రమాలుంటాయి. అనేక బాధ్యతలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. వారాంతంలో లాభాలు సంతోషాన్నీ, సంతృప్తినీ ఇస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. సంతానంతో సంతోషంగా గడుపుతారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. సృజనాత్మక వ్యవహారాలుంటాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. గౌరవం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల ప్రణాళికలు సిద్ధం చేస్తారు. వారం మధ్యమంలో పోటీ రంగంలో గుర్తింపు. వ్యతిరేకతలపై విజయం. శ్రమతో వేరు వేరు కార్యక్రమాల నిర్వహణ. కార్యనిర్వహణ దక్షత. ఖర్చులు పెట్టుబడులు కూడా అధికంగానే ఉంటాయి. సామాజిక గౌరవం పెంచుకునే విషయంలో శ్రమ అధికం. శత్రువులు, రుణాలు, రోగాలపై విజయం సాధిస్తారు. వారాంతంలో సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. నూతన పరిచయాలుంటాయి. భాగస్వామ్యాల్లోనూ శుభ పరిణామాలు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణిస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో ఆత్మవిశ్వాసంతో కార్యక్రమాల నిర్వహణ. నిర్ణయాదులు లాభిస్తాయి. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు, స్నేహానుబంధాలు లాభిస్తాయి. అత్యున్నత కార్యక్రమాలపై దృష్టి. కీర్తిప్రతిష్టలు విస్తరిస్తాయి. వారం మధ్యమంలో కుటుంబంలో అనుకూలత. బంధువర్గ వ్యవహారాలపై దృష్టి. ఆర్థిక వ్యవహారాలు సంతోషాన్ని ఇస్తాయి. వ్యతిరేకతలపై విజయం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. మాట విలువ పెంచుకునే ప్రయత్నం. తొందరపాటు నిర్ణయాదులు కూడదు. వారాంతంలో సంప్రదింపులుంటాయి. మంచి వార్తలు వింటారు. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. మీడియా రంగంలోని వారికి అత్యంత అనుకూలత. స్ర్తిలకు కొంత హార్మోన్ సమస్యలు వేధించవచ్చు.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744