S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కెమెరా కన్నులో జ్ఞాపకాలు పదిలం భళారే.. ‘చిత్రం’!

గడిపిన క్షణాలను, గడిచిన సంఘటనలను మధుర జ్ఞాపకాలుగా మన ముందుంచేవి ఫొటోలు. ఒక చిత్రం వేవేల భావాలకు సమాహారం. కదిలే కాలాన్ని బంధించే శక్తి ఒక్క ఫొటోకే ఉంది. గతాన్ని కళ్ల ముందు ఉంచే సాధనం, చరిత్రను వర్తమానంతో చూపడం ఒక్క ఛాయాచిత్రానికే సాధ్యం. బంధాలకూ, అనుబంధాలకూ బాసటగా నిలబడగలదు. ఒక మాట వింటే కొన్ని రోజుల తర్వాత మరచిపోవచ్చు. ఒక వాక్యం చదివితే కొన్ని నెలల తరువాత మరచిపోవచ్చు. కానీ, ఒక ఫొటో చూస్తే మాత్రం ఎప్పటికీ మరచిపోలేం. ఎందుకంటే అది మనసులో ముద్ర పడిపోతుంది. వేయి మాటలు చెప్పలేని భావాన్ని ఒకే ఒక్క ఫొటో చెప్పగలదు.
1839లో ఫ్రాన్స్‌లో లూరుూ డాగ్యూరే అనే వ్యక్తి డెగేరియోటైప్ అనే విధానం ద్వారా ఫొటో తీసే విధానాన్ని కనిపెట్టాడు. సూర్యకాంతితో ఫొటో తీయడం ఈ విధానం ప్రత్యేకత. ఫొటోను తీయడం కోసం ఒక గోడను ఇంటి కప్పు పై భాగాన్ని, చినీని ఈ విధానంలో ఉపయోగించుకున్నారు. అతడు వాడిన టెక్నిక్ పేరు హెలియోగ్రఫీ. డెగేరియో టైప్‌నే మొదటి కెమెరాగా చెబుతారు. దీన్ని 19, ఆగస్టు 1839లో ఫ్రెంచి ప్రభుత్వం గుర్తించి ప్రపంచానికి ‘ఉచిత బహుమతి’గా ఇచ్చింది. అందువల్ల ఆగస్టు 19న ఫొటోగ్రఫీ జన్మించినట్లు భావిస్తారు. అందుకనే ఈ తేదీని ‘వరల్డ్ ఫొటోగ్రఫీ డే’గా జరుపుకుంటున్నారు. ఆ తర్వాత దాదాపు 20 సంవత్సరాల వరకు ఫొటోగ్రఫీ అందుబాటులోకి రాలేదు. కేవలం బ్రిటీష్ రాజు, జమీందారులు మాత్రమే ఫొటోగ్రఫీని ఉపయోగించేవారు. మన దేశంలో తొలిసారిగా ఫొటోగ్రఫీకి శ్రీకారం చుట్టింది దీనదయాళ్. ఆ తర్వాత ఎన్నో ఫొటోలు ప్రపంచానే్న మార్చివేశాయి. భవిష్యత్ తరానికి చరిత్రను అందించేందుకు తోడ్పడ్డాయి. చేదు జ్ఞాపకాలనూ మన కళ్ల ముందుంచే వారధి. ఒక్కటేమిటి కెమెరాల్లో బంధించే ప్రతి చిత్రం ఒక సుమధుర దృశ్యం.
నేపథ్యం
ఫొటోగ్రఫీ అనే పదం ‘్ఫటోస్ గ్రాఫెన్’ అనే గ్రీకు పదాల నుంచి వచ్చింది. ‘్ఫటోస్’ అంటే లైట్ అని గ్రాఫెన్ అంటే ‘డ్రా’ అని అర్థం. ‘బ్లాక్ అండ్ వైట్’ కాలం నుంచి ఇప్పటివరకూ ఎన్నో మార్పులు, మరెన్నో హంగులను అద్దుకుంటూ దినదిన ప్రవర్థమానంగా ఎదుగుతూనే ఉంది. కొత్త పుంతలు తొక్కుతూనే ఉన్నది. 1989లో మొదటి డిజిటల్ కెమెరా అందుబాటులోకి వచ్చింది. 1920-30 నుంచి రిఫ్లెక్స్ కెమెరాలు బాగా వాడుకలోకి వచ్చాయి. 1948లో పోలరాయిడ్ కెమెరాలు వచ్చాయి. 1991లో కమర్షియల్ డిఎస్‌ఎల్‌ఆర్ కెమెరాను కొడాక్ విడుదల చేసింది. ఇప్పుడు సెల్ఫీల ట్రెండ్ నడుస్తోంది. కానీ సెల్ఫీ 1839లో రాబర్ట్ కార్నిలియస్ అనే వ్యక్తి మొట్టమొదటి సెల్ఫీ దిగాడు. అంటే సెల్ఫీ 180 ఏళ్ల క్రితమే ఉంది.
19వ శతాబ్దం చివరి వరకు దాదాపు ఫిల్మ్‌ల ద్వారానే కలర్, బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు తీసేవారు. అయితే శతాబ్దం చివరలో మన ప్రాంతంలోకి డిజిటల్ ఫొటోగ్రఫీ అడుగుపెట్టింది. ఆటోమేటిక్ కెమెరాలు, అత్యధిక రిజొల్యేషన్ కలిగిన లెన్స్‌లలో రకరకాల డిజిటల్ కెమెరాలు మార్కెట్లోకి వచ్చాయి. ఒకప్పుడు కెమెరా అంటేనే ఎరుగని వారు సైతం అధునాతనమైన డిజిటల్ కెమెరాలతో చక్కగా ఫొటోలు తీసుకుంటున్నారు. డిజిటల్ రాకతో ఫొటోలు తీయడం చాలా సులభంగా మారింది. మరోవైపు తక్కువ ధరలకే కెమెరాలు లభిస్తుండటంతో చాలమాంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. సెల్‌ఫోన్లు అడుగు పెట్టినపుడు 1.3 లేదా 2 మెగా పిక్సల్ కెమెరాలు మాత్రమే వాటిలో ఉండేవి. క్రమంగా సెల్‌ఫోన్‌లో సైతం 25 మెగా పిక్సల్ కెమెరాలను నిక్షిప్తం చేస్తుండటంతో చిత్రాలు చాలా స్పష్టంగా వస్తున్నాయి. దీంతో ఇంట్లో చిన్న శుభకార్యం జరిగినా ఫొటోలు, వీడియోలు చిత్రీకరించుకుని పదిల పరచుకుంటున్నారు. మొత్తానికి మారుతున్న కాలానికి అనుగుణంగా ఫొటోగ్రఫీ సైతం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతూ కొత్తపుంతలు తొక్కుతుందని చెప్పొచ్చు.
ఆధునిక మార్పులు..
కెమెరా మొబైల్స్ వచ్చిన తర్వాత ప్రపంచంలో మన జీవన విధానంలో చాలా మార్పులొచ్చాయి. ప్రస్తుతం ఫొటోగ్రఫీతో సంబంధం లేకుండా ఒక్కరోజు గడవడటం లేదు. ఏదైనా సెల్ఫీ దిగని దృశ్యాన్ని ఊహించగలమా? వార్తలు, వినోదం, క్రీడలు, వైద్యం, సమాచార ప్రసార రంగాల వంటి ఎన్నో రంగాలలో ఫొటోగ్రఫీ ముడిపడి ఉన్నది. ప్రతి ఒక్కరి జీవితాన్ని ఇది తాకిందనేది అతిశయోక్తి కాదు.
కనురెప్ప వేసినంత లిప్తపాటు కాలాన్ని కూడా క్యాప్చర్ చేయగల శక్తి కేవలం ఫొటోగ్రఫీకి మాఅతమే ఉంది. వర్తమానాన్ని ఫొటోల రూపంలో బంధించి భవిష్యత్‌కు అందించే సాధనం ఫొటోగ్రఫీ. అలా ఎన్నో ఫొటోలు చరిత్రలో నిలిచిపోయాయి. ఈ కాలంలో ఎక్కడికెళ్లినా ఫొటో.. ఏం చేసినా ఫొటో.. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రతి ఒక్కరూ ఫొటోగ్రాఫరే. కాబట్టి ప్రత్యేకంగా కెమెరా ఉండాల్సిన అవసరం లేదు. మన రూపానికి ప్రతిరూపం ఫొటో. మన హావభావాలకి నిలువెత్తు నిదర్శనం ఫొటో. మన మధురమైన తీపి జ్ఞాపకాలను పదిలపరిచేది ఫొటో. పత్రికల్లో వార్తలను చదివించే శక్తి ఫొటోకు మాత్రమే ఉంటుంది. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆయా సంఘటనలను కవర్ చేసే ఫొటోగ్రాఫర్లు అభినందనీయులు. ఫొటోగ్రాఫర్‌లు కాదు వారు ఫొటో జర్నలిస్టులు. ఫొటో తీయడం ఒక కళ. ఇందుకు ఎంతో కష్టం, శ్రమ, ప్రతిభ, ముందుచూపు అవసరం. ధర్నాలు, ఉద్యమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యకలాపాలు, ఉగ్రవాద దాడులు, ప్రకృతి బీభత్సాలు.. ఇలా ఏది జరిగినా, అక్కడ మందుండేది ఫొటో జర్నలిస్టులే. ఈ వేళ మన దేశం గర్వించదగిన రఘురామ్ లాంటి ఫొటోగ్రాఫర్‌లు ఎందరో. సమాజాన్ని చూపించేది ఫొటోగ్రఫీయే. నేటి ఆధునిక కాలంలో ఏరియల్ ఫొటోగ్రఫీ ద్వారా ఛాయాచిత్రాలను చిత్రీకరిస్తున్నాయి. నాసా, ఐఎస్‌ఎస్ వంటి ప్రముఖ అంతరిక్ష పరిశోధనా సంస్థలు తమ ఆధునిక స్పేస్ టెక్నాలజీ సాయంతో అంతరిక్ష ఫొటోలను కూడా తీస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరింత అడ్వాన్స్‌డ్‌గా అంతరిక్ష రహస్యాలను ఛేదించేందుకు కూడా సూపర్ స్పేస్ మిషన్లు తయారుకావచ్చు. అదీ ఫోటోల యొక్క ఘనత.
సెల్ఫీ అనగా తనను తాను ఫొటో తీసుకోవడం, సాధారణంగా చేతిలో ఇమిడిపోయే డిజిటల్ కెమెరా లేదా కెమెరాఫోన్‌లతో సెల్ఫీలను తీసుకుంటారు. 1981లో సోనీ మావికా అనే కెమెరా చార్జీ కపుల్డ్ డివైస్ ఫర్ ఇమేజింగ్ అనే పరికరం ఉపయోగించి కెమెరాలో మున్ముందు ఫిలిం వాడే అవసరం లేకుండా చేశారు. డిజిటల్ ఫొటోగ్రఫీ అడుగుపెట్టాక ఫొటోలు తీయడం సులభంగా మారడంతో చాలామంది నిరుద్యోగులు దీనినే వృత్తిగా మార్చుకుని ఉపాధి పొందుతున్నారు. అంతరిక్షంలో జరిగే ప్రతీదాన్నీ ఫొటోల ద్వారా బంధించగలుగుతున్నాం. ఆధునిక ఖగోళ శాస్త్రంలో కూడా ఫొటోగ్రఫీ పాత్ర అత్యంత ముఖ్యమైనది.
గతంలో చదువులు, ఉద్యోగాల కోసం దిగే పాస్‌పోర్ట్ సైజు ఫొటో మొదలుకొని నిలువెత్తు ఫ్లెక్సీల వరకు వ్యాపించింది. పట్టణ వాసులకే కాకుండా గ్రామీణులను సైతం ఫొటోగ్రఫీ విపరీతంగా అలరిస్తోంది. పురుషులే కాక మహిళలు కూడా నేడు ఫొటోగ్రఫీ రంగంపై మక్కువ కనబరుస్తున్నారు. వివిధ విశ్వవిద్యాలయాలు కూడా ఫైన్ ఆర్ట్స్‌లో ఫొటోగ్రఫీలో శిక్షణ నిస్తున్నారు. నేటి కాలంలో కంప్యూటర్ జ్ఞానం కూడా తోడవడంతో ఫొటోగ్రఫీ ఎంతో సులువైంది.

-కె.రామ్మోహన్‌రావు 9441435912