S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎక్కడ చూసినా...

ఘాతుకాలు.. దౌర్జన్యాలు.. దోపిడీలు..
మానుషహీన దుశ్చర్యలు-
నరకులు నరకులు.. అసురులంతరించిపోయినా
ఉరికే నరకులు..
బరిసెలు.. వేటకొడవళ్లు.. కత్తులు.. కటారులు..
నాటుబాంబులతో మోటు దారుణ మారణాలు
లారీలతో గుద్దిస్తరు యాక్సిడెంటుగ రుద్దేస్తరు
పంచనామా జరిపిస్తరు-
వీరి వీరి దారులే వేరు.. పంతగిస్తే
నరకపురికి పంపకపోరు వీరు
పైసలతో కాని పనులుంటవా?
అది కాదు ఇక్కడ వాదు
దీనికి తరుణోపాయమేదైనా
వుందా చూడు..
జర సోచాయించు-

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505