S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పింక్ సిటీకి వారసత్వ హోదా

పింక్ సిటీగా పిలుచుకునే జైపూర్ నగరం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి విద్యా శాస్త్ర, సాంస్కృతిక మండలి (యునెస్కో) ట్వీట్ చేసింది. యునెస్కోకు చెందిన ప్రపంచ వారసత్వ కమిటీ ఏటా కొన్ని ప్రదేశాలను ఈ జాబితాలో చేరుస్తుంటుంది. ప్రస్తుతం అజర్‌బైజాన్‌లోని బకూ నగరంలో జరుగుతున్న ఈ కమిటీ 43వ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జులై 10 వరకు జరిగిన ఈ సమావేశాల్లో ఇప్పటివరకు 19 ప్రదేశాలను కొత్తగా జాబితాలో చేర్చారు. మరిన్ని ప్రదేశాలను చేర్చే అవకాశముంది. యునెస్కో ఇప్పటివరకు 167 దేశాలకు చెందిన 1,092 ప్రాంతాలను వారసత్వ ప్రదేశాలుగా గుర్తించింది. వీటిలో సహజ సిద్ధమైన ప్రదేశాలు, మానవ నిర్మితాలు, కట్టడాలు వంటివన్నీ ఉన్నాయి.
తాజాగా చోటు దక్కించుకున్న మరికొన్ని ప్రదేశాలు..
* ఫ్రెంచ్ ఆస్ట్రల్ లాండ్స్ అండ్ సీస్(ఫ్రాన్స్)
* ఆగ్స్‌బర్గ్ వాటర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (జర్మనీ)
* వాత్నాజోకుల్ నేషనల్ పార్క్ (ఐస్‌లాండ్)
* పారాత్యాంద్ ఇలా గ్రాండీ (బ్రెజిల్)
* ఫెర్రస్ మెటలర్జీ సైట్స్ (బుర్కినాఫాసో)
* బాబిలోన్ (ఇరాక్)
* దిల్మన్ బరియల్ వౌండ్స్ (బహ్రెయిన్)
* బడ్జ్ బీమ్ కల్చరల్ ల్యాండ్‌స్కేప్ (ఆస్ట్రేలియా)
* వౌండెడ్ టూంబ్స్ (జపాన్)
* లియాంగ్జు నగర అవశేషాలు (చైనా)
* ఓంబిలిన్ కోల్ మైనింగ్ (ఇండోనేసియా)
* జియాంగ్ కుమాంగ్ మెగాలిథిక్ జార్ సైట్స్ (లావోస్)
* క్రిమియోంకీ ప్లింత్ మైనింగ్ రీజియన్ (పోలాండ్)
* కాలాడ్రూబీ నాడ్ లాబమ్ (జెకియా)
* బగాన్(మయన్మార్)
* సియోవాన్ (రిపబ్లిక్ ఆఫ్ కొరియా)
* అయిసినాయిపీ స్టోన్ రైటింగ్స్ (కెనడా)
* ఎర్జిబిర్జియా మైనింగ్ రీజియన్ (జర్మనీ).