S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అహం పతనానికే దారి తీస్తుంది

ప్రతి మనిషికీ
ప్రతి కార్యానికీ
హద్దులుంటాయి
నియమాలూ ఉంటాయి
నడిచే దారిలో
ముళ్లు చల్లడం
సరదా అనిపించినా
క్రూరత్వం బయటపడుతుంది
తెలివైన వాడు
తప్పుకుంటూనే
నడక సాగిస్తాడు
అహం జీవితాన్ని
కూలగొడుతుంది
హృదయ ఫలకం మీద
ఎల్లలు లేని మైదానాన్ని సృష్టిస్తుంది
అక్కడ నీ అడుగులకి
గుడి కడుతుంది
ఆ దృశ్యం, నిన్నొక్కసారిగా
భ్రమల వలయంలోకి తోస్తుంది
బయటపడే దారగుపడక
తిరుగుతానే ఉంటావు
నీ మనోకాశాన్ని ఆవరించిన
నల్లమబ్బు తెరలను కరిగించి
అలజడి లేపుతున్న
అహాన్ని దహనం చేయాలి
అప్పుడే కదా
నువ్వేమిటో నీకు తెలిసేది
సమాజం పట్ల నీకున్న
కర్తవ్యం గుర్తయ్యేది
నీ వెంటపడి
నిన్ను ప్రభావితం చేస్తున్న
అసంతృప్తి దెయ్యాన్ని
తరిమేసినప్పుడు
తృప్తి-
దామెర్లవారి చిత్తరువై
మనసంతా వసంతవౌతుంది
సమాజం నుండి
మంచినే స్వీకరిస్తావు
జగత్తులోని ప్రతి అణువు
ఆకుపచ్చగా కనిపిస్తుంది
జీవితమంటే
ఎదిగిన వరికంకి!
గింజని మనిషికిచ్చి
ఎండి గడ్డవుతుంది
అది కూడా
కమ్మని పాలనిచ్చే
ఆవుకి ఆహారవౌతుంది
తృప్తి అంటే
జగత్తుకి జీవం పోయడమే కదా!

-ఎస్.ఆర్.పృథ్వి 9989223245