S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నువ్వొస్తావనే ఆశతో...

నువ్వొస్తావని
నాకెన్నో ఆశలు
నువ్వొచ్చే వేళయ్యిందని
ఎద లోగిలిలో ఆనందం
ఎదురుచూసే
పరిస్థితి ఎదురవుతుందనుకోలేదు
ఎదలో ఏదో అలజడి
మొదలయ్యింది
నువ్వు వస్తావో రావో అని
అయినా ఏదో, ఎక్కడో
ఒక చిన్ని ఆశ
నువ్వు రాకపోతావా
నా ఆశ తీరకపోతుందా అని
రోజులు వారాలు పక్షాలు
ఇలా గడిచిపోతూనే ఉన్నాయి
అయినా నీ జాడలేదు
అయినా క్షణక్షణం నేను
నీ రాక కోసం
ఎదురుచూస్తూనే ఉన్నాను
నువ్వొస్తావని..
ఆశలు చంపుకోలేను
చంపుకొని బ్రతకనూ లేను
రోజురోజుకు నీ మీద
ఆశ పెరుగుతూనే ఉన్నా
వస్తావనే నమ్మకం మాత్రం పోతోంది.
ఏం చేయను విధి రాత
అనుకోనా?
నా ఖర్మ అనుకోనా?
తడి ఆరని కన్నులతో
నా హృదయం బరువెక్కిపోతోంది
ఐనా నేనెదురుచూస్తున్నా నీ కోసం
నువ్వొస్తావని
నా హృదిలోని బరువు తగ్గిస్తావని..
ఏదేమయినా ఇంకెంతకాలం
ఈ ఎదురుచూపు..
ఇంకెన్నాళ్లు..
నీ తలంపులతో బ్రతకను?

-శ్రీనివాస్ పర్వతాల 8500122910