S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విజన్

ప్రిన్సిపాల్ తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించే పాఠాన్ని పరిశీలించటానికి రావటం లేదు. అతను చెప్పే పాఠం అన్ని వర్గాలకు అనుకూలంగా ఉందా? లేదా? చూడాలి. ప్రిన్సిపాల్ పర్యవేక్షిస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు జవాబు ఏ వర్గం నుంచి వస్తుందో ఆ వర్గం వైపునకు కేంద్రీకరిస్తాడు. అది అన్ని వర్గాలకు అందుతుందా? లేదా? చూసుకోవాలి. సమాధానం చెప్పలేని పిల్లలతో విడివిడిగా కలుసుకుని కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇంటి పరిస్థితులు కూడా విద్యార్థి అవగాహనపై ప్రభావాన్ని చూపిస్తాయి. బోధనలో ప్రత్యామ్నాయాలు ఉంటే కొందరు చురుకైన పిల్లలకు అర్థం కావచ్చు. కానీ అర్థం కాని పిల్లలకు ఆ పాఠం అర్థం కావటానికై ఉపాధ్యాయునితో ఒంటరిగా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చర్చించవచ్చు. చురుకైన పిల్లలుంటే వారిని ప్రోత్సహించటానికి కూడా అసైన్‌మెంట్‌ను కూడా సూచించవచ్చు. అనగా తరగతి గదిలో కూర్చున్నప్పుడు తప్పులు చూసిందానికన్నా ఉపాధ్యాయుని నేర్పరితనాన్ని చూసి ప్రిన్సిపాల్ ప్రోత్సహిస్తాడు. కాబట్టే ప్రిన్సిపాల్ ఉపాధ్యాయుని విశ్వాసం చూరగొంటాడు. అందుకే హెడ్‌మాస్టర్‌ను ఎకడమిక్ ఈక్వలైజర్‌గా పరిగణిస్తాం. ప్రిన్సిపాల్ చురుకైన వారికి ప్రేరణ, బలహీనమైన పిల్లలకు టానిక్‌గా ఉపయోగపడతాడు.
* * *
సాధన, బోధనలో ఏది పటిష్టతరమైనది? సాధించే వాడే బోధించగలుగుతాడు. కొన్నిసార్లు తరగతిలో పాఠం చెప్పిన తర్వాత ఒక విద్యార్థిని పిలిచి నేను చెప్పిన పాఠాన్ని చెప్పమన్నారు.
‘నాకు ఐదు నిమిషాలు సమయమివ్వండి’ అని ఆ విద్యార్థి అన్నాడు.
ఆ విద్యార్థి ఆత్మస్థైర్యంతో బోర్డు దగ్గరకు వెళ్లి నాకన్నా బాగా చెప్పగలిగాడు. పిల్లలను అడిగాను.
‘ఇప్పుడు బాగా అర్థమయ్యింది సార్’ అని పిల్లలంతా అన్నారు.
మహబూబ్‌నగర్‌లోని ‘అక్షరవనం’ అనే క్యాంప్‌లో ఇదే ప్రయోగం చేశాం.
విద్యార్థి పాఠం చెబుతున్నప్పుడు ఆ జిల్లా కలెక్టర్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, అధికారులందరూ చూశారు. శిక్షణ పొందిన అనుభవం గల ఉపాధ్యాయునికన్నా ఈ చిన్న పిల్లలు బాగా చెప్పగలిగారు. అంటే నేర్చుకునే విద్యార్థే టీచర్ అయితే? తన తోటి విద్యార్థుల మనస్తత్వం మానసిక స్థితిలోకి ప్రవేశం కాగలుగుతాడు. ఆ పాఠం చెబుతున్నప్పుడు పిల్లలు బాగా విన్నారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అందుకోసమే సాధన గుణం బోధనా గుణంకన్నా ఎక్కువ శక్తివంతమైనది. టీచర్ పుస్తకంలో ఉన్నది చెబుతాడు. అది సద్దిఅన్నం లాంటిది అదే సాధకుడైన విద్యార్థే బోధన చేస్తే అప్పుడే వండిన అన్నం తిన్నట్లు. ఏది ఆరోగ్యకరమో అంచనా వేయండి.
ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠం చెప్పే ముందు సాధకుని మనస్తత్వం ఎరిగి బోధన చేయాలి. అనగా తనకు తాను ఒక విద్యార్థిననుకుని బోధించాలి. ఇలాంటి మనస్తత్వాన్ని తోటి ఉపాధ్యాయులలో రగిలించ గలిగినవాడే ప్రిన్సిపాల్.
* * *
మనిషిని ఉపాధ్యాయునిగా చెక్కేది, బీఈడీ కాలేజీలు కావు. తోటి ఉపాధ్యాయులు, పిల్లలే. అదే సరైన శిక్షణ. పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో అన్‌ట్రైన్డ్ టీచర్లనే ఉపాధ్యాయులుగా నియమించుకునేవారు. వారి పని చూసి పూర్తి జీతం ఇచ్చి బి.ఇడి శిక్షణాలయానికి పంపించేవారు. ఆ నాలుగు సంవత్సరాల లోపల తోటి ఉపాధ్యాయులు కొత్తగా వచ్చిన అభ్యర్థికి శిక్షణ నిచ్చేవారు. ఆ వ్యక్తులనే టీచర్స్ లీడర్స్ అంటాం. అనగా కొత్తగా వచ్చిన అభ్యర్థులను పూర్వపు ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చే సంప్రదాయం ఉండేది. అదే మాదిరిగా కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, గురుకుల విద్యాలయాలు కొత్తగా వచ్చిన అభ్యర్థులను టీచర్ లీడర్స్‌ను తయారుచేస్తారు. నన్ను భువనగిరిలో స్కూల్‌లో వెంకట్రావుగారే టీచర్‌గా తీర్చిదిద్దారు.
ఇటీవల కేంద్రీయ విద్యాలయ వారు గచ్చిబౌలిలో ఇండియన్ నేషనల్ మేథమ్యాటిక్ ట్రైనింగ్‌ను ఏర్పాటు చేశారు. దేశంలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో పని చేస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు వచ్చారు. ఆ సమావేశంలో పాల్గొన్నాను. కేంద్రీయ ఉపాధ్యాయులు తోటి ఉపాధ్యాయులు ఏమి ట్రైనింగ్ ఇస్తారో చూశాను. అందరూ ఉపాధ్యాయులే. రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టే ఒకే ఆవరణలో ఉంటారు. ప్రిన్సిపాల్ తన లక్ష్యాన్ని రాత్రింబవళ్లు తన కార్యక్రమంలో చూపిస్తాడు. అందరిలో కూడా అదే లక్ష్యం వొంటపట్టి ఉంటుంది. ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యతాయుతంగా ప్రిన్సిపాల్ మాదిరిగానే వ్యవహరించారు. అనగా ప్రిన్సిపాల్ టీచర్ లీడర్స్‌ను తయారుచేశాడు. కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్స్ లోపల ప్రిన్సిపాల్‌కు శిక్షణ దొరకుతుంది. అదే విధంగా గురుకులాల్లో కూడా ప్రతి టీచర్ ప్రిన్సిపాల్‌గా తయారవుతాడు. ప్రిన్సిపాల్ అనే ఒక వ్యక్తి ఆదేశాలను పాటించటం కాకుండా ప్రతి టీచర్ స్వతంత్రంగా ఆలోచించి కార్యక్రమాలను విజయవంతం చేస్తాడు. టీచర్ లీడర్ అనగా విద్యా కార్యక్రమాలను ఎవరి ఆదేశాలు లేకుండా స్వతహాగా భాగస్వామి కావటం ఆ విద్యాలయాల ప్రత్యేకత. ప్రిన్సిపాల్ విద్యుక్త ధర్మం టీచర్ లీడర్స్‌ను తయారుచేయాలి. లీడర్ అంటే పెత్తనం చేయటం కాదు, బాధ్యతాయుతంగా తనే ప్రిన్సిపాల్ అనుకుని తన విద్యుక్త ధర్మాన్ని ఉపాధ్యాయుడు నిర్వహించటం. ప్రిన్సిపాల్ అంటే కలెక్టివ్ లీడర్‌షిప్‌ను అభివృద్ధి చేయటం. అదే డెమోక్రటిక్ లీడర్‌షిప్. ప్రిన్సిపాల్ ఒక డెమోక్రటిక్ లీడర్. ప్రతి ఉపాధ్యాయునిలో తానే ప్రిన్సిపాల్ అనే భావన కలిగిస్తాడు.

-చుక్కా రామయ్య