S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రమాణాలకు ప్రతిరూపం.. ‘డీఎల్‌ఎస్’

ఆధునిక సమాజంలో మారుతున్న పరిస్థితులు, విస్తరిస్తున్న విజ్ఞానానికి అనుగుణంగా విద్యాలయాలను తీర్చిదిద్దాల్సి ఉంది. ఉపాధికి ఊతం ఇచ్చేలా విద్యావ్యవస్థలో సమూల మార్పులు రావలసి ఉంది. నేడు చదువుకు, చేసే ఉద్యోగానికి సంబంధం లేకుండా పోతోంది. ఈ కోణంలో ఆలోచిస్తూ ‘డీఎల్‌ఎస్’ ముందడుగు వేస్తోంది. ఆర్‌సీఐ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఆవరణలోని డిఫెన్స్ లాబొరెటరీస్ స్కూల్. దీనే్న పొడి అక్షరాల్లో ‘డీఎల్‌ఎస్’ అంటారు. సీబీఎస్‌ఈ విధానంలో బోధన జరుగుతున్న ఈ పాఠశాలను 12 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఆర్‌సీఐ (రీసర్చ్ సెంటర్ ఇమారత్) ఉంది. భారతీయ రక్షణ రంగానికి సంబంధించి పరిశోధనలకు ఆర్‌సీఐ కేంద్రం. మాజీ రాష్టప్రతి, ప్రపంచం గర్వించదగ్గ ప్రముఖ శాస్తవ్రేత్త, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కాలం ఆలోచనల మేరకు డీఎల్‌ఎస్‌ను ఏర్పాటు చేశారు. డీఎంఆర్‌ఎల్ (డిఫెన్స్ మెటలర్జికల్ రీసర్చ్ లాబోరేటరీ) డైరెక్టర్ డాక్టర్ పి. రామారావు 1988 లో ఈ పాఠశాలను ప్రారంభించారు. శబ్ద, వాయు, జల కాలుష్యాలు లేని ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పాఠశాల విరాజిల్లుతోంది. హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్‌లో ఉన్న మరో డీఎల్ స్కూల్‌కు ఒక శాఖగా మొదట ఈ పాఠశాలను ప్రారంభించి, దశలవారీగా అభివృద్ధి చేశారు.
నర్సరీ నుండి పదో తరగతి వరకు ‘డిజిటల్’ విధానంలో బోధన నిర్వహించడం డీఎల్‌ఎస్ ప్రత్యేకత. ‘టాటా క్లాస్ ఎడ్జ్’ సహకారంతో ప్రతి క్లాసులో ‘అల్ట్రా షార్ట్ త్రూ ఇంటరాక్టివ్ ప్రొజెక్షన్ సిస్టం’ ఏర్పాటు చేశారు. సెక్షన్లను పరిగణిస్తే మొత్తం 29 తరగతులు ఉన్నాయి. అన్ని తరగతుల్లో ప్రొజెక్టర్లను ఏర్పాటు చేశారు. ఈ విధానంలో ప్రతి తరగతిలో ఒక మల్టీపర్పస్ స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ ఒకవైపుప్రొజెక్టర్ నుండి వచ్చే బింబం పడేందుకు అనుగుణంగా ఉండటంతో పాటు, సాధారణ బోర్డుగా ఉపాధ్యాయులు వినియోగించుకునేలా ఉంది. ఈ స్క్రీన్‌పై ఏది రాసినా దాన్ని ‘సేవ్’ చేసుకునేందుకు వీలు కల్పించారు. స్క్రీన్‌కు ఎడమవైపు సాధారణ బ్లాక్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. స్క్రీన్‌పై ప్రతిబింబం స్పష్టంగా పడేలా ‘అల్ట్రా షార్ట్-త్రూ ఇంటరాక్టివ్ ప్రొజెక్టర్’ను అమర్చారు. ప్రొజెక్టర్‌ను ఆపరేట్ చేసే పరికరాలన్నీ మూడడుగుల ఎత్తులో, విద్యార్థులకు ఎదురుగా ఉండే గోడకు ఒకవైపు ప్రత్యేక బాక్స్‌లో ఉంచారు. ప్రొజెక్టర్‌ను ఉపయోగించి బోధన చేసే సమయంలోస్క్రీన్‌పై పడే ప్రతిబింబానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేశారు. దాంతో టీచర్‌కు,పిల్లలకు మధ్య బోధన సమయంలో నీడలు పడటం వంటి ఆటంకాలు ఉండని విధంగా ఏర్పాట్లు జరిగాయి. అన్ని తరగతుల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ సిస్టంను ఒక సర్వర్‌కు అనుసంధానం చేశారు. డిజిటల్ క్లాస్ సొల్యూషన్స్ కోసం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట ఏర్పాటు చేసిన ‘స్టేట్- ఆఫ్-ది- ఆర్ట్ అల్ట్రా షార్ట్-త్రూ ఇంటరాక్టివ్ ప్రోజెక్షన్ సిస్టం’ పాఠశాల డీఎల్‌ఎస్ కావడం విశేషం. డిజిటల్ విధానంలో బోధించడం టీచర్లకు కూడా సులభతరంగా ఉంటుంది. ఇందుకోసం ఈ పాఠశాలలోని టీచర్లందరికీ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
కంప్యూటర్ విధానంలో బోధన కోసం డీఎల్‌ఎస్-టాటా క్లాస్ ఎడ్జ్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. దేశంలోని ఇతర పాఠశాలలతో పాటు ఆర్‌సీఐలోని డీఎల్‌ఎస్‌కు కూడా టాటా కంపెనీ సాంకేతిక విద్యావిధానంలో చేయూత ఇస్తోంది. తాము అందించిన సాంకేతిక పరికరాల నిర్వహణకు తొలుత టాటా సంస్థ సిబ్బందిని ఏర్పాటు చేయగా, ఆ తర్వాత స్కూల్ సిబ్బందిలోని కొంతమందికి శిక్షణ ఇచ్చి నిర్వహిస్తున్నారు.
కంప్యూటర్ పరిజ్ఞానాన్ని విద్యార్థుల్లో పెంచేందుకు ప్రత్యేక విధానం కొనసాగుతోంది. ఇందుకోసం అధునాతన కంప్యూటర్లను నెలకొల్పారు. కంప్యూటర్లలో ప్రాథమిక అంశాలను బోధించేందుకు ఎంస్-ఆఫీస్, ఇంటర్నెట్ సదుపాయాలున్నాయి. ఉన్నత తరగతుల విద్యార్థులకు ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సు నేర్పిస్తున్నారు. గ్రంథాలయంలోనూ, కంప్యూటర్ లాబ్‌లోనూ ఇంటర్నెట్ సహాయంతో కొత్త కొత్త విషయాలను తెలుసుకొనే అవకాశం ఉంది. విద్యార్థులు పాఠ్యాంశాలు నేర్చుకొనేందుకు, ప్రాజెక్టు వర్క్ చేసుకునేందుకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు కంప్యూటర్లను వినియోగించుకుంటున్నారు.
పూర్తి హంగులతో కూడిన గ్రంథాలయం ఉంది. పాఠశాల సబ్జెక్టుల పుస్తకాలే కాకుండా, విద్యార్థులకు ఉపయోగపడే అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. పాఠశాలలో మ్యాథమెటిక్స్ ల్యాబ్ కూడా ఉంది.
రక్షణ శాఖ ఉద్యోగుల పిల్లల కోసం..
హైదరాబాద్‌లోని భారత రక్షణ శాఖ పరిధిలోని ఆర్‌సీఐతో పాటు అనుబంధ విభాగాలైన డీఆర్‌డీఎల్, ఏఎస్‌ఎల్, డీఎంఆర్‌ఎల్, డీఎల్‌ఆర్‌ఎల్, అనురాగ్ తదితర రక్షణ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లల కోసం ఈ పాఠశాలను నిర్వహిస్తున్నారు. డీఎల్‌ఎస్-ఆర్‌సీఐ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ‘విద్యాలయ మేనేజ్‌మెంట్ కమిటీ’ పర్యవేక్షణలో ఇది నడుస్తోంది. ఇంగ్లీష్ మీడియంలో పాఠశాల నడుస్తోంది. మూడేళ్ల నుండి ఐదేళ్ల వయస్సు ఉండే పిల్లల కోసం నర్సరీ సెక్షన్ నడుస్తోంది. ఐదేళ్లలోపు పిల్లల మనస్తత్వాన్ని అనుసరించి ఆడుతూ, పాడుతూ పాఠాలు నేర్పించడం ఇక్కడి ప్రత్యేకత. పిల్లలను ఆకట్టుకునేందుకు రకరకాల బొమ్మలు, ఇతర ఆకర్షణీయ వస్తువులు ఉన్నాయి.
ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య సత్సంబంధాలు ఉంటాయి. బోధనలో టీచర్లు అనునిత్యం విద్యార్థులకు గైడ్ చేస్తుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వచ్చేలా చర్చలు జరుగుతుంటాయి. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి తెచ్చేందుకు వారిని అశోక, గాంధీ, పటేల్, శివాజీ పేర్లతో నాలుగు విభాగాలుగా విభజించారు. సాహిత్యం, వ్యాసరచన, క్విజ్, ఉపన్యాసం, సాంస్కృతిక ప్రదర్శనలు, డ్రాయింగ్, పెయింటింగ్, పాటలు, క్రీడలు తదితర రంగాల్లో పోటీలు నిర్వహిస్తుంటారు.
పాఠశాల ఆవరణలో ఫుట్‌బాల్ గ్రౌండ్, బాస్కెట్ బాల్ గ్రౌండ్ ఉన్నాయి. క్రికెట్, వాలీబాల్, -ఖో తదితర క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. చెస్, టీటీ, క్యారం బోర్డు వంటి ఇండోర్ గేమ్స్‌లో విద్యార్థులు పాల్గొంటున్నారు.
బయటి ప్రపంచంలో నిర్వహించే పోటీ కార్యక్రమాలకు ఈ పాఠశాల విద్యార్థులు వెళుతుంటారు. సైన్స్ ఎగ్జిబిషన్స్, ఎన్‌టీఎస్‌ఈ, అటవీశాఖ నిర్వహించే పోటీలు, టీటీడీ పరీక్షలు, ఎయిర్ గ్రూప్ సింగింగ్, భారత్ వికాస్ పరిషత్ సింగింగ్ కాంపిటీషన్స్, స్పోర్ట్స్‌మీట్, మ్యాథమెటిక్స్- సైన్స్ ఒలింపియాడ్స్, జీకే టెస్టులు, భగవద్గీత పోటీలలో విద్యార్థులు పాల్గొంటున్నారు.
ఉదయం నిర్వహించే పాఠశాల అసెంబ్లీలో విద్యార్థులు తమ నైపుణ్యం ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దీని వల్ల వారిలో దాగిఉండే నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి. ఎన్‌సీసీ ఆర్మీ వింగ్‌ను కూడా విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. జీవితానికి ఉపయోగపడే ‘సోషియల్లీ యూజ్‌ఫుల్ అండ్ ప్రొడక్టివ్ వర్క్ (ఎస్‌యుపిడబ్ల్యు) కార్యక్రమాలను చేపడుతున్నారు.
విద్యార్థులకు తరచూ ఆరోగ్య తనిఖీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. యోగలో శిక్షణ ఇస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేస్తున్నారు. విద్యార్థుల మనోవికాసం పెంచేందుకు తరచూ వివిద ప్రాంతాలను చూపించేందుకు ఎక్స్‌కర్సన్స్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పాఠశాలలో, సంఘంలో ఎలా నడచుకోవాలన్న విషయమై నియమావళి రూపొందించారు.

కలాం కలల స్వరూపం
డిఫెన్స్ లాబోరేటరీస్ స్కూల్ ప్రముఖ శాస్తవ్రేత్తల కలల స్వరూపంగా చెప్పుకోవచ్చు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దాదాపు నలభై సంసవత్సరాల పాటు ఆర్‌సీఐ, దాని అనుబంధ రక్షణ విభాలలో పనిచేశారు. ఈ విభాగాల్లో పనిచేస్తున్న శాస్తవ్రేత్తలు, ఇతర సిబ్బంది పిల్లలు పాఠశాల స్థాయి విద్యకోసం దూరంగా ఉండే పాఠశాలలకు వెళ్లడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాంతో ఈ ప్రాంతంలోనే పాఠశాల ఏర్పాటు చేయాలని తలపెట్టి డీఎల్‌ఎస్ ప్రారంభించారు. అబ్దుల్ కలాంతో పాటు అనేక మంది శాస్తవ్రేత్తలు ముందుకు వచ్చి పాఠశాల ఏర్పాటులో తమవంతు బాధ్యత నిర్వర్తించారు. నేడు అనేక మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువు పూర్తి చేసుకుని, ఉన్నత చదువులకు ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. పాఠశాలలో సుశిక్షితులైన బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది అకుంఠిత దీక్షతో పాఠశాల పురోభివృద్ధికి పాటుపడుతున్నారు. దేశంలో ఉన్న రక్షణ శాఖ పాఠశాలల్లో డీఎల్‌ఎస్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థగా ఈ పాఠశాల పేరుతెచ్చుకుంది.

క్రమశిక్షణ ముఖ్యం
విద్యార్థులను భావిభారత పౌరులుగా, బాధ్యత కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. విద్యార్థుల భవిష్యత్తును వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని వారిలో దాగి ఉండే ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కావద్దన్నది మా ఉద్దేశం. పాఠశాల సబ్జెక్టుల్లో మంచి బోధన ఇస్తూ, సామాజిక స్పృహ కలిగి ఉండేలా తీర్చిదిద్దుతున్నాం. స్వయం శక్తిని, ధైర్యాన్ని, ప్రేమ, సోదరభావం, సామాజిక సేవ తదితర అంశాల్లో విద్యార్థులను తీర్చిదిద్దుతాం. మాతృభూమి పట్ల గౌరవం, ప్రేమ కలిగి ఉండేలా శిక్షణ ఇస్తున్నాం. మొక్కై వంగనిదే మానై వంగునా అన్న తెలుగు సామెతను దృష్టిలో ఉంచుకుని చిన్నప్పటి నుండే సత్ప్రవర్తన అలవడేలా సమగ్ర శిక్షణ ఇస్తున్నాం. డిజిటల్ క్లాసులకోసం ‘టాటా క్లాస్ ఎడ్జ్’ సంస్థ సహకరిస్తోంది. వారికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. డీఎల్‌ఎస్ విద్యాలయ మేనేజ్‌మెంట్ కమిటీ తరచూ సమావేశమై మాకు మార్గదర్శనం చేస్తోంది. కమిటీలో ఉన్న వారంతా శాస్తవ్రేత్తలే. ఈ కమిటీ చైర్మన్ జి. విజయశంకర్‌తో పాటు పాలక మండలిలో ఉన్న ఎల్‌ఏవీ సంహితారావు, పి. రమాదేవి, కేఎన్‌వీ సురేష్ బాబులకు హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను.
టీఎస్‌ఆర్ శాస్ర్తీ, ప్రిన్సిపాల్, డీఎల్‌ఎస్, విజ్ఞానకంచ, ఆర్‌సీఐ, హైదరాబాద్.

-పి.వి.రమణారావు 9849998093