S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (21-7-2019 నుంచి 27-7-2019 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఈ వారం ప్రారంభంలో లాభాలు ప్రభావితం చేస్తాయి. అన్ని పనుల్లోనూ అనుకూలత. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సంతోషంగా గడుపుతారు. పెద్దలతో కొంత జాగ్రత్త అవసరం. క్రమంగా ఖర్చులు పెట్టుబడులు అధికం. విందులు వినోదాలు, విహారాలకు సంబంధించిన ఖర్చులు, ప్రయాణాలుంటాయి. వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సౌఖ్యంగా కాలం గడుపుతారు. కొంత అసంతృప్తి ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రల వల్ల మేలు. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. వారం మధ్యలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తారు. కార్యనిర్వహణలో సమర్థత, కొత్త పనులపై దృష్టి. కొంత నిరాశ. అనుకున్న పనులు పూర్తి కావడానికి శ్రద్ధ వహించాలి. సౌకర్యాలను పెంచుకుంటారు. ఆహార విహారాలకు అనుకూలం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాలు ప్రభావితం చేస్తాయి. సామాజిక అనుబంధాలకు అనుకూలం. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. తర్వాత అనుకోని సమస్యలు ఎదురౌతాయి. శారీరక, మానసిక వత్తిడులు. కొత్త నిర్ణయాలను వాయిదా వేసుకోవాలి. దైవధ్యానంలో కాలం గడపాలి. ఆలోచనల్లోనూ వత్తిడి. సంతానవర్గంతో జాగ్రత్త. వ్యాపారాదుల్లో అనేక రూపాల్లో పెట్టుబడులుంటాయి. కాలం వ్యర్థమయ్యే సూచనలు అధికం. వారం మధ్యమంలో సుదూర ప్రయాణాలపై దృష్టి. అనేక బాధ్యతలను సంతృప్తితో నిర్వర్తిస్తారు. ఆధ్యాత్మిక, దైవ కార్యాల వల్ల మేలు. సంతాన విషయంలో నైరాశ్యం. విందులు వినోదాలు విహారాలుంటాయి. విశ్రాంతి లభిస్తుంది. వారాంతంలో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. నిర్ణయాదుల్లో కొంత జాగ్రత్త. ధార్మిక కార్యక్రమాల కోసం కాలం ధనం వెచ్చించే అవకాశం. క్రమంలో సౌకర్యాలు పెంచుకుంటారు. విద్యారంగంలోని వారికి అనుకూలత. ఆహార విహారాల్లో శుభ పరిణామాలు. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. వ్యాపారాదుల్లో ఇబ్బందులకు అవకాశం. వారం మధ్యమంలో ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గ వ్యవహారాల్లో శుభ పరిణామాలు. క్రియేటివిటీ పెంచుకుంటారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిర్ణయాదుల్లో కొంత నైరాశ్యం ఉంటుంది. స్ర్తి వర్గంతో జాగ్రత్తగా మెలగాలి. శ్రమ రహిత ప్రయోజనాలు కోరకూడదు. వారాంతంలో పోటీలు వత్తిడులు అధికవౌతాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. సామాజిక గౌరవం సంభవం. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. అధికారుల ఆదరణ లభిస్తుంది. తర్వాత అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి. లాభాలు కొంత సంతోషాన్నీ, సంతృప్తినీ ఇస్తాయి. కొన్ని అననుకూలతలు కూడా ఉంటాయి. ఆకస్మిక ఇబ్బందులు ఏర్పడే సూచనలు. సంప్రదింపులకు అనుకూలం. ఇతరుల, వ్యాపారస్థుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలు సంభవం. కార్యనిర్వహణలో సంతోషం. వారం మధ్యమంలో ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. అనేక కార్యక్రమాల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. ధార్మిక దానాలవల్ల మేలు కలుగుతుంది. కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు. స్ర్తివర్గంతో సంప్రదింపులుంటాయి. వారి సహకారం కూడా లభిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో వ్యతిరేక ప్రభావాలు అధికం. పోటీలు ఒత్తిడులు చికాకులను అధిగమించాల్సి వస్తుంది. విజయ సాధన సంభవం. పెద్దలతో సంప్రదింపులుంటాయి. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ప్రయాణావకాశాలున్నాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. సౌకర్యాలు శ్రమకు గురిచేసే అవకాశం. ఆహార విహారాల్లో జాగ్రత్త. వ్యాపారాదుల్లో అనేక రూపాల్లో ప్రయోజనాలు లభిస్తాయి. వారం మధ్యమంలో అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త. తొందరపాటు కూడదు. ముఖ్య నిర్ణయాదులను వాయిదా వేసుకోవాలి. గృహ వాహనాదుల విషయంలో కొంత నిరాశ తప్పకపోవచ్చు. వేరు వేరు రూపాల్లో లాభాలున్నా సంతోషం ఉండదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో అనుకూలత. బంధువర్గ వ్యవహారాల్లో సంతృప్తి. మాట విలువ పెరుగుతుంది. నిల్వధనం పెంచుకుంటారు. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. క్రమంలో సంప్రదింపులకు అనుకూలం. సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలకు అనుకూలం. వ్యర్థమైన ఖర్చులు పెట్టుబడులుంటాయి. సోదరుల వ్యవహారాలపై దృష్టి. వ్యాపారానుబంధాలు విస్తరిస్తాయి. వారం మధ్యమంలో ఆహార విహారాల కోసం కాలం ధనం వెచ్చిస్తారు. శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. దైవ ధర్మ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక యాత్రల వల్ల మరింత మేలు. స్ర్తివర్గ పరిచయాలుంటాయి. వారాంతంలో అభీష్ట సిద్ధి. క్రియేటివిటీ, ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గ వ్యవహారాలపై దృష్టి.
మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత విద్య, ఉద్యోగాదులు, కీర్తి ప్రతిష్ఠలపై దృష్టి ఏర్పడుతుంది. పరిశోధన ప్రాధాన్యం. సుదూర ప్రయాణ భావన. పోటీ రంగంలో విజయం. వారం మధ్యమంలో వృత్తిలో అనుకూలత. అధికారిక వ్యవహారాలపై దృష్టి. కార్యనిర్వహణలో సంతృప్తి. సామాజిక గౌరవం, గుర్తింపులు పెరుగుతాయి. పెద్దల ఆదరణ ఉంటుంది. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త. వ్యాపార, జీవిత భాగస్వాములతో సమస్యలకు అవకాశం. కుటుంబంలో శుభ పరిణామాలు. మంచి మాట తీరువల్ల ఆకట్టుకుంటారు. ఆర్థిక నిల్వలు పెరుగుతాయి. వారం మధ్యమంలో లాభాలు ప్రభావితం చేస్తాయి. అన్ని పనుల్లోనూ అనుకూలత. కొత్త పరిచయాల్లో కొంత అప్రమత్తంగా మెలగాలి. మాటల్లో చమత్కారం ఉంటుంది. బంధువర్గంతో అనుకూలత.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. సంతాన వర్గంతో సంతోషంగా కాలం గడుపుతారు. నూతన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి. కుటుంబంలో అనుకూలత. ఆర్థిక స్థితి పెరుగుతుంది. వ్యతిరేక ప్రభావాలు అధికవౌతాయి. శత్రువులను ఎదిరించాలి. రుణాలు, రోగాల బారికి గురి అయ్యే అవకాశం. సేవక వర్గంతో సంప్రదింపులుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. వారం మధ్యమంలో పరిచయాలు స్నేహానుబంధాలు పెంచుకుంటారు. భాగస్వామితో కాలం గడుపుతారు. కమ్యూనికేషన్స్‌లో లోపం రాకుండా చూసుకోవాలి. సామాజిక అనుబంధాలలో గౌరవం పెరుగుతాయి. వారాంతంలో అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలు పెంచుకుంటారు. ఊహించని సంఘటనలకు అవకాశం.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు. కొత్త పనులపై దృష్టి. బాధ్యతలు అధికం. వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. ఆర్థిక నిల్వలపై దృష్టి. బంధువర్గంతో సంతోషంగా గడుపుతారు. ఆశించిన లాభాలు అందకపోయే అవకాశం. వ్యాపారాదుల్లో విపరీతమైన పోటీ. విజయం సాధించే ప్రయత్నం. వారం మధ్యమంలో సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలుంటాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. సోదర వర్గంతో అనుకూలత. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మంచి వార్తలు అందుతాయి. స్ర్తివర్గంతో కొంత అప్రమత్తంగా మెలగాలి. వారాంతంలో సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాలకు అనుకూలం.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. ముఖ్య నిర్ణయాదుల వాయిదా. సంతాన వ్యవహారాల్లో కొంత అనుకూలత. సుదూర ప్రయాణాలపై దృష్టి. ఆధ్యాత్మిక వ్యవహారాలుంటాయి. దైవ ధర్మ కార్యాలలో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. కార్యనిర్వహణ దక్షత. వైజ్ఞానిక పరిశోధనలపై దృష్టి. విద్య, ఉద్యోగాదుల్లోనూ సంతృప్తి. పోటీ రంగంలో కొంత అప్రమత్తంగా మెలగాలి. వ్యాపార వ్యవహారాల్లో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వారం మధ్యలో వృత్తిలో ఉన్నతి. సామాజిక గౌరవం. ఉద్యోగాదులను సక్రమంగా నిర్వర్తిస్తారు. అధికారుల ఆదరణ. పితృవర్గ సంబంధ వ్యవహారాలు చర్చకు వస్తాయి. వ్యతిరేకతలున్నా శ్రమతో విజయం. శారీరకంగా సంతోషంగా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఈ వారం ప్రారంభంలో ఆహార విహారాలకు అనుకూలం. సౌకర్యాలు పెంచుకుంటారు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. నిర్ణయాదులకు అనుకూలం. క్రమంలో అభీష్టాలు నెరవేర్చుకుంటారు. క్రియేటివిటీ పెరుగుతుంది. కొత్త పనులను ఆనందంగా నిర్వర్తిస్తారు. సంతానవర్గ వ్యవహారాల్లో అభివృద్ధి. కుటుంబంలో కొంత వత్తిడి. ఆర్థిక నిల్వలు తగ్గవచ్చు. ఉన్నత విద్య ఉద్యోగాదులు సంతోషాన్నిస్తాయి. వారం మధ్యమంలో పోటీలు వత్తిడులు వ్యతిరేకతలు చికాకులు అన్ని పనుల్లోనూ ఉంటాయి. విజయ సాధన ఉంటుంది. శ్రమ ఉన్నా గుర్తింపు లభిస్తుంది. మాటల్లో కొంత నిరాశ తప్పదు. సమున్నత లక్ష్యాలుంటాయి. వారాంతంలో కొత్త పరిచయాలుంటాయి.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులు అధికం. వేరు వేరు రూపాల్లో కాలం ధనం వెచ్చించాల్సి వస్తుంది. విశ్రాంతి లభిస్తుంది. ప్రయాణాలకు అవకాశం. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అనేక కార్యక్రమాల బాధ్యతలు చేపట్టాల్సి రావచ్చు. శ్రమ ఉన్నా గుర్తింపు, గౌరవాదులుంటాయి. కొత్త పనుల నిర్వహణ. ప్లానింగ్ ఉంటుంది. వృత్తిలో కొంత వత్తిడి ఉంటుంది. ఆలోచనల్లో అనుకూలత. వ్యాపారాల్లో సంతోషం. వారం మధ్యమంలో కుటుంబంలో శుభ పరిణామాలు. మాట తీరు వల్ల అనేక మంచి పనులు జరుగుతాయి. లోపాలను అధిగమిస్తారు. అధికారిక వ్యవహారాల్లో కొంత వత్తిడి. ఆలోచనలకు రూపకల్పన. సృజనాత్మకత. సంతాన వ్యవహారాలపై దృష్టి. వారాంతంలో సంప్రదింపులుంటాయి.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744