S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చాలా సులువైన పనులు (సండేగీత)

ఈ మధ్య ప్రముఖ దర్శకుడు బి.నర్సింగరావు కొన్ని మెసేజెస్ పంపించారు. అందులో ఒకటి మిమ్ములను ఏ విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి? మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడానికి ఆ మెసేజీలో వున్న విషయాలు చాలా సాధారణమైనవి. మనం చాలా సులువుగా చేసుకోగలిగినవి. అందులో నుంచి కొన్ని-
* చాలా పండ్లు కూరగాయలు తినండి.
* చాలా మంచి నీరు తాగండి.
* యోగాని క్రమం తప్పకుండా చేయండి.
* ఉదయానే్న కొన్ని మంచి విషయాలని చదవండి.
* ఒంటరిగా కొంత సమయం గడపండి.
* రాత్రిపూట మంచి నిద్ర తీసుకొండి.
* మిమ్మల్ని ఇష్టపడే వాళ్లతో, ప్రోత్సహించే వాళ్లతో మాట్లాడండి.
* మీకు ఇష్టమైన పాటలు వినండి.
* వీలుంటే ఇష్టమైన సినిమా చూడండి.
* టీవీని తక్కువ చూసి, యూట్యూబ్‌లో ఇష్టమైన వాటిని కొద్దిసేపు చూడండి.
* ఉదయించే సూర్యుడిని దర్శించండి.
* వీలైతే ఆకాశంలో చుక్కల్ని చూడండి.
* మీకు ఇష్టమైన భోజనాన్ని తయారుచేసుకొండి.
* ఏదో ఒక హాబీని అలవాటు చేసుకొని దానికి కొంత సమయాన్ని వెచ్చించండి.
* పుష్పాలతో మీ ఫ్లవర్ వాజ్‌ని అలంకరించండి.
* ఐదు నిమిషాలు కళ్లు మూసుకొని వుండండి.
* మీ టేబుల్‌ని సర్దుకొండి.
* పాత వస్తువులని, పనికిరాని వస్తువులని పారవేయండి.
* మీ పాత ఛాయాచిత్రాలని చూడండి.
* మంచి కాఫీ చేసుకొని తాగండి.
* దగ్గర్లో వున్న పార్క్‌కి వెళ్లి కాస్సేపు కూర్చోండి.
* రైతుబజారుకు వెళ్లి కూరగాయలు, స్వయంగా తీసుకొని రండి.
* మీ మొబైల్‌ని ఉదయం ఎనిమిది వరకు చూడకండి. రాత్రి దాన్ని దూరంగా ఉంచండి.
* ఇంటిని శుభ్రంగా ఉంచండి.
* దేవుడి పటాలని తుడిచి దీపం వెలిగించండి.
* కొద్దిసేపు టెలిఫోన్ ఆఫ్ చేసి చిన్న కునుకు తీయండి.
* కొత్తగా ఏదైనా పనిని చేయండి.
* రేపటి కోసం పనుల లిస్టుని తయారుచేయండి.
* మీరు మీకు ఎంత ముఖ్యులో ఆలోచించండి.
* మీలోకి మీరు చూసుకోవడం ఎంత ముఖ్యమైందో ఆలోచించండి.
* ఇవి చాలా సులువైన పనులు.. మనకు మనం చేసుకోవాల్సిన పనులు.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001