S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పనులు( సండే గీత)

ఎన్నో పనులు.
మనం చేయాల్సినవి ఎన్నో పనులు.
చాలా పనులు మర్చిపోతూ ఉంటాం.
పనులు మరిచిపోకుండా ఎలా చేసుకోవాలో చెప్పడానికి చాలా పథ్ధతులు వచ్చాయి. అందులో ఒకటి - థింగ్స్ టుడూ. రేపు చేయాల్సిన పనులని వాటి ప్రాధాన్యతలను బట్టి వరుస క్రమంలో రాసుకొని జేబులో పెట్టుకోవడం. ఆ కాగితాన్ని చూసినప్పుడు ఆ రోజు చేయాల్సిన పనులు మన మదిలో మెదలుతాయి. అప్పుడు వాటిని మరిచిపోకుండా చేసుకునే వీలుంది. ఇది చాలా మంచి పద్ధతి.
ఆ పనులు చేసుకోవడానికి మనం ప్రణాళికలు వేసుకుంటాం. ఎంత ప్రణాళికలు వేసుకున్నా కొన్నిసార్లు మన పనులు పూర్తి కావు. అవి అలా మిగిలిపోతూనే ఉంటాయి.
ఇంకా కొంతమంది రోజువారీ పనుల కోసం ఓ పట్టికను తయారుచేసుకొని ఆ విధంగా పాటిస్తూ ఉంటారు. ఎనిమిది గంటల వరకు టెలిఫోన్ జోలికి వెళ్లరు.
టీవీని కూడా తీరిగ్గా కూర్చోని చూడరు. అవసరమైన ప్రోగ్రామ్స్‌ని వారి తీరిక సమయంలో యూ ట్యూబ్‌లో చూస్తూ ఉంటారు. ఇదో రకమైన క్రమశిక్షణ.
ఇంత క్రమశిక్షణతో మెదులుతున్న వ్యక్తుల పనులు కూడా అన్నీ పూర్తి అవవు.
ఇది సహజం.
కొన్నిసార్లు మన సంకల్పం బాగున్నా పనులు జరగవు. తక్కువగా జరుగుతాయి.
మన అలసత్వం వల్ల కూడా కొన్నిసార్లు పనులు పూర్తి కాకపోవచ్చు.
వాటికి మనం సాకులు చెప్పుకొని సంతృప్తి చెందుతూ ఉంటాం.
లేదా
మనల్ని మనం తిట్టుకుంటూ ఉంటాం.
కారణాలు ఏవైనా కొన్ని పనులు పూర్తి అవకుండా అలా మిగిలిపోతాయి.
పర్వాలేదు.
బాధపడాల్సిన పని లేదు.
చింతిస్తూ కూర్చోవాల్సిన పని అంతకంటే లేదు.
ఈ రోజు పూర్తికాని పనులని పూర్తి చేసుకోవడానికి రేపు మళ్లీ ప్రయత్నం చేయవచ్చు.
ఉత్సాహం తెచ్చుకొని
మిగిలిన పనులని రేపు చేసుకోవడానికి
ప్రయత్నం చేయాలి.
రేపు అనేది వుందన్న విషయం మర్చిపోకూడదు.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001