S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గడ్డి వంతెన మహా గట్టిది!

గడ్డిపరకలన్నీ కలిపి మదపుటేనుగును బంధించినట్లు.. అని మనం ఎప్పుడో చదువుకున్నాం. అలాగే పెరూలోని ఓ ప్రాంతంలో ప్రవాహవంతమైన నదిని దాటడానికి అక్కడి ప్రజలు గడ్డిపరకలను పేని బలవంతమైన వంతెనను తయారుచేసి ఒక కొండ నుంచి మరో కొండను చేరుతున్నారు. నిజంగా గడ్డిపరకలు అంత బలవంతమైనవా? అనే ప్రశ్న మెదిలింది కదూ.. ఏమో చూద్దాం!
అది పెరూలోని కుస్కో ప్రాంతం. అక్కడ అపురిమక్ నది ఒడ్డున గడ్డితాళ్ళతో అల్లిన వంతెన ఒకటి ఉంటుంది.
ఈ వంతెనను ప్రతి సంవత్సరం తొలగించి కొత్తదాన్ని ఏర్పాటు చేస్తారు. ఇలా ప్రతి సంవత్సరం వంతెనను మార్చే ఆచారం దాదాపు ఆరువందల సంవత్సరాలుగా గడ్డివంతెనను ఏర్పాటుచేస్తున్నారు. ‘ఇంకా’ రాజ్యంలోని పలు ప్రధాన నగరాలను, పట్టణాలను అనుసంధానించడంలో ఇలాంటి వంతెనలు కీలకపాత్ర పోషించాయి. ఈ వంతెనల విశిష్టతను గుర్తించిన యునెస్కో 2013లో వీటిని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది.
తరతరాలుగా ఈ నైపుణ్యాన్ని ఇక్కడి ప్రజలు తమ వారసత్వ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ నదికి ఇరువైపులా ఉన్న ప్రజలు కలిపి ఈ వంతెనకు కొత్త జీవాన్ని పోస్తారు. పురుషులు మాత్రమే ఈ వంతెనను నిర్మించాలన్న సంప్రదాయం ఉంది. మహిళలు మాత్రం నదికి కొంతదూరంలో కూర్చుని చిన్న చిన్న తాళ్లను తయారుచేస్తారు. వంతెనను నిర్మించే పద్ధతిలో మొదటిరోజు మగవారు అంతా కలిసి 120 చిన్న చిన్న తాళ్లనను కలిపి మందపాటి, లావైన తాళ్లను తయారుచేస్తారు. వంతెనకు ప్రధాన బలం ఆ తాళ్లే. ‘కోయా ఇచు’ అనే దృఢమైన గడ్డి ఈ తాళ్ల తయారీకి వినియోగిస్తారు. ఈ గడ్డిని కోసిన తరువాత నీటిలో నానబెడతారు. వంతెన పనిలో నిమగ్నమయ్యే జనాల కోసం చాలామంది ఊరి జనం కోడి, పంది, చేపల మాంసంతో రకరకాల వంటకాలు వండుకుని తీసుకొస్తారు. అయితే ప్రతి వంటకంలో స్థానికంగా పండే దుంపలను మాత్రం ఖచ్చితంగా వాడతారు. గత సంవత్సరం నిర్మించిన వంతెనను తెంచేసి నదిలో వదిలేయడం ఇక్కడి ప్రజల ఆనవాయితీ. ఆరు తాళ్లలో నాలుగింటిని వంతెనపై నడిచే భాగంగా వాడతారు. మిగిలిన రెండింటిని వంతెనకు ఇరువైపులా నడిచేవారికి సహాయంగా పట్టుకోవడానికి వాడతారు. నదికి ఇరువైపులా ఈ ఆరు తాళ్లను ముందే చెక్కిన రాళ్లకు గట్టిగా కడతారు. వంతెన బిగిసేవరకూ ఇరువైపుల నుంచి ఈ తాళ్లను లాగుతారు. ఈ ప్రక్రియ విజయవంతం అవడానికి ఒక రోజు పడుతుంది. ఈ వంతెనలో చెప్పుకోదగిన విషయం ఏమిటంటే నిర్మాణ ప్రక్రియలో నేటి కాలంలో కూడా ఆధునిక సాధనాలు ఎక్కడ కూడా వాడరు. మానవశక్తి, రాళ్లు, గడ్డి మాత్రమే ఈ వంతెన నిర్మాణానికి వాడతారు. వంతెన ఏర్పాటు చేసిన తరువాత నాలుగో రోజు పాటలు పాడుతూ, వివిధ రకాల వంటకాలు వండుకుని పండుగ చేసుకుంటారు. ఈ నాలుగో రోజు ఏటా జూన్ నెల రెండో ఆదివారం అయ్యేలా చూసుకుని వంతెన నిర్మాణం చేపడతారు అక్కడి ప్రజలు.

-మహి