S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (7-7-2019 నుంచి 13-7-2019 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో సంతానవర్గంతో సంతోషంగా గడుపుతారు. ఆలోచనలకు రూపకల్పన. అభీష్టాలు నెరవేరుతాయి. సృజనాత్మకత. సంప్రదింపులకు అత్యంత అనుకూలం. శుభవార్తలు. క్రమంలో వ్యతిరేకతలు అధికం. పోటీలు, ఒత్తిడులు తప్పకపోవచ్చు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. గుర్తింపు లభిస్తుంది. సౌకర్యాలు పెంచుకుంటారు. అధికారికమైన సంప్రదింపులుంటాయి. పెద్దల సహకారం. ఆహార విహారాల గూర్చిన ఆలోచనలుంటాయి. వారం మధ్యమంలో భాగస్వామ్యాలపై దృష్టి. పరిచయాలు, స్నేహానుబంధాలు పెంచుకుంటారు. పాతమిత్రుల కలయిక. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కొన్ని వార్తల వల్ల చికాకు. వారాంతంలో అనుకోని ఇబ్బందులుంటాయి. ఊహించని సంఘటనలు. గౌరవ లోపాలకు అవకాశం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో నిర్ణయాదులు సంతోషాన్నిస్తాయి. ఆత్మవిశ్వాసంతో కార్యక్రమాలను నిర్వహిస్తారు. బాధ్యతలు అధికం. కార్యనిర్వహణలో సంతృప్తి. లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల అనుకూలత. నిర్ణయాదులు సంతోషాన్నిస్తాయి. క్రమంగా కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. బంధువర్గంతో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. వ్యర్థమైన ఖర్చులకు అవకాశం. ప్రయాణాదుల్లో జాగ్రత్త అవసరం. వారం మధ్యమంలో సంప్రదింపులుంటాయి. మంచి వార్తలకు అవకాశం. మీడియా రంగంలోని వారికి అనుకూలత. దగ్గరి ప్రయాణాలు. వేరు వేరు రూపాల్లో ప్రయోజనాలుంటాయి. స్ర్తివర్గ అనుకూలత. మంచి వార్తలు వింటారు. వారాంతంలో ఆహార విహారాలకు అనుకూలం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత వ్యవహారాలు, విద్య, ఉద్యోగం, ప్రయాణాలపై దృష్టి. ఆధ్యాత్మిక వ్యవహారాలుంటాయి. పరిశోధనలకు అనుకూలత. భాగస్వామ్యాల్లో కొంత వత్తిడి తప్పదు. నూతన కార్యక్రమాలపై దృష్టి. క్రమంగా వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. శ్రమ ఉన్నా గుర్తింపు లభిస్తుంది. గౌరవాదరాలను పెంచుకుంటారు. సామాజికంగా ప్రత్యేకతను చూపించుకుంటారు. పదోన్నతులకు అవకాశం. వ్యాపారాదుల్లో కొంత జాగ్రత్త. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ లాభాలుంటాయి. ప్రయోజనాలు సంతృప్తిని ఇస్తాయి. పెద్దల అనుకూలత. గౌరవనీయుల కలయిక. చేసే అన్ని పనుల్లోనూ అనుకూలత లభిస్తుంది. సంతోషంగా గడుపుతారు. భాగస్వామితో కొంత జాగ్రత్త. ఖర్చులు పెట్టుబడులు తప్పవు. వేరు వేరు రూపాల్లో ప్రయాణాలకు అవకాశం.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో గృహ వాహనాది ప్రయాణ సౌకర్యాలు పెంచుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. సౌఖ్యంగా గడుస్తుంది. మాటల్లో చమత్కారం. కుటుంబానుబంధాలు మెరుగు పడతాయి. క్రమంలో అభీష్టసిద్ధి. ఆలోచనలకు రూపకల్పన. సృజనాత్మకత పెరుగుతుంది. విద్యారంగంలో ఉన్నతి. మాటల్లో అధికారిక ధోరణి తగ్గాలి. సంప్రదింపులు ప్రభావితం చేస్తాయి. వారం మధ్యమంలో వ్యతిరేకతలు పెరుగుతాయి. పోటీలు, ఒత్తిడులు అధికం. శ్రమాధిక్యం. గుర్తింపు లభిస్తుంది. సోదర వర్గంతో సమస్యలు. సంప్రదింపుల్లో జాగ్రత్త. సహకార లోపాలకు అవకాశం. మాటల్లో జాగ్రత్త అవసరం. రుణ, రోగాల వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. మొండితనంతో కార్యనిర్వహణ. వారాంతంలో అనుబంధాలు పెంచుకుంటారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులు అధికం. వేరు వేరు వస్తువుల కొనుగోలుకు అవకాశం. కాలం ధనం వ్యర్థం కాకుండా సత్ కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు. వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. అధికారిక వ్యవహారాలకు అనుకూలం. క్రమంగా ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కొత్త పనులు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. వేరు వేరు రూపాల్లో లాభాలకు అవకాశం. వారం మధ్యమంలో కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెంచుకుంటారు. నిల్వధనంపై దృష్టి. బంధువర్గ వ్యవహారాలు చర్చకు వస్తాయి. కొన్ని లాభాల వల్ల ఒత్తిడులు కూడా తప్పకపోవచ్చు. అనేక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వారాంతంలో సంప్రదింపులుంటాయి. మంచి వార్తలు వింటారు. ప్రయాణాదుల్లో అనుకూలత.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో అనుకోని ఇబ్బందులు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. అనారోగ్య లోపాలకు అవకాశం. ఊహించని నష్టాలుంటాయి. పోటీలకు దూరంగా మెలగాలి. శ్రమాధిక్యం. అప్రమత్తంగా మెలగాలి. ముఖ్య నిర్ణయాదులను వాయిదా వేసుకోవాలి. క్రమంగా ఉన్నతమైన లక్ష్యాలపై దృష్టి. కార్యనిర్వహణలో అనేకుల సహకారం అందుతుంది. కీర్తి ప్రతిష్ఠలు పెంచుకుంటారు. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలం. విద్య, పరిశోధన రంగాల వారికి విశేషమైన గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యమంలో వృత్తిలో ఉన్నతి. గుర్తింపు కోసం ప్రయత్నం. సామాజిక గౌరవం పెంచుకుంటారు. ఉద్యోగాదులు, వ్యాపారాల్లో శ్రమ ఉన్నా అనుకూలత. భాగస్వామితో జాగ్రత్త. పోటీ రంగంలో ఇబ్బందులకు అవకాశం. వారాంతంలో వేరువేరు రూపాల్లో ప్రయోజనాలు.
మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. ఇతరుల సహకారం లభిస్తుంది. సోదరవర్గంతో సంతోషంగా గడుపుతారు. అధికారిక వ్యవహారాల్లో కొంత జాగ్రత్త. నిర్ణయాదులు సంతోషాన్నిస్తాయి. క్రమంలో ఆహార విహారాలు సంతోషాన్నిస్తాయి. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. శ్రమ ఉన్నా కార్యనిర్వహణపై దృష్టి. గృహ వాహనాదుల విషయంలో అనుకూల నిర్ణయాలు. శారీరక ఒత్తిడులు తప్పకపోవచ్చు. వారం మధ్యమంలో అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. క్రియేటివిటీ పెంచుకుంటారు. వ్యాపార వ్యవహారాలకు అనుకూలం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. సంతానంతో సంతోషంగా గడుపుతారు. మాటల్లో కొంత జాగ్రత్త. నిర్ణయాదుల్లో కొంత ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుంది. వారాంతంలో పోటీ రంగంలో గుర్తింపు.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. ఉన్నత వ్యవహారాలను నిర్వహించే ప్రయత్నం. కార్యనిర్వహణ సంతోషాన్నిస్తుంది. పెద్దల ఆశీస్సులు లభించే అవకాశం. క్రమంలో ఖర్చులు పెట్టుబడులు పెరిగే అవకాశం. ప్రయాణాలుంటాయి. ఆధ్యాత్మిక యాత్రల వల్ల మేలు. వ్యాపారాదుల్లో అధికంగా వెచ్చించాలి. వృత్తి ఉద్యోగాదులపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఉన్నత లక్ష్యాలను సాధించే యత్నం. వారం మధ్యమంలో నిర్ణయాదులకు అనుకూలం. అన్ని పనుల్లోనూ శుభ పరిణామాలు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహించాల్సి వస్తుంది. బాధ్యతలు శ్రమకు గురి చేయవచ్చు. గుర్తింపు లభిస్తుంది. సుదూర ప్రాంతాలకు ప్రయాణ భావన. కొంత అసంతృప్తి.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు, అనుబంధాలు విస్తరిస్తాయి. పార్ట్‌నర్స్‌తో సంతోషంగా గడుపుతారు. ఆలోచనలకు రూపకల్పన. సంతాన వర్గ వ్యవహారాలుంటాయి. పాత మిత్రుల కలయిక. అధికారులతో భేటీ ఉంటుంది. క్రమంలో అనుకోని సమస్యలు. వ్యాపార నష్టాలకు అవకాశం. ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. దానధర్మాలు అధికంగా చేయాలి. ఆధ్యాత్మిక జీవన విధానాన్ని పెంచుకోవాలి. వారం మధ్యమంలో ఉన్నత లక్ష్యాలు. చాలా సంతోషంగా, సంతృప్తిగా గడుపుతారు. అనేక కార్యక్రమాలను శ్రమ రహితంగా నిర్వర్తిస్తారు. సుదూర ప్రయాణాలు, ప్రణాళికలు. సమున్నత వ్యవహారాలు. కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. పుణ్యబలం పెరుగుతుంది. వారాంతంలో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో అనుకూలత. బంధువర్గంలో సంతృప్తి. నిల్వధనం పెంచుకుంటారు. మాట విలువ పెరుగుతుంది. ప్రభుత్వపరమైన చెల్లింపులు తప్పకపోవచ్చు. పితృవర్గంతో గడిపే అవకాశం. పరామర్శలుంటాయి. విందులు వినోదాలు కూడా ఉంటాయి. క్రమంగా సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలుంటాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. సోదర వర్గంతో అనుకూలత. మంచి వార్తలు వింటారు. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత. వారం మధ్యమంలో ఆహార విహారాలు సంతోషాన్నిస్తాయి. శారీరక ఒత్తిడులుంటాయి. తొందరపాటు నిర్ణయాలు కూడదు. విద్యారంగంలోని వారికి మంచి ఫలితాలు. కొన్ని వ్యర్థమైన ఖర్చులుంటాయి. సౌకర్యాలు, ప్రయాణాలపై దృష్టి. వారాంతంలో అభీష్టాలు నెరవేరుతాయి.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అధికారిక వ్యవహారాలపై దృష్టి. కార్యనిర్వహణ దక్షత. అధికారుల ఆదరణ, పదోన్నతులకు అవకాశం. కొన్ని ఒత్తిడులు, అనుకోని నష్టాలకు కూడా అవకాశం. జాగ్రత్త. క్రమంలో అన్ని పనుల్లోనూ లాభాలుంటాయి. వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఊహించని ప్రయాణాలుంటాయి. వ్యాపారానుకూలత. ఆరోగ్య లోపాలు. వారం మధ్యమంలో ఖర్చులు అధికం. వ్యాపార వ్యవహారాల్లో పెట్టుబడులు తప్పవు. విశ్రాంతి లభిస్తుంది. ప్రయాణాలకు అవకాశం. కాంట్రాక్టు వ్యవహారాలకు అనుకూలం. దానధర్మాల వల్ల లోపాలు అధిగమించబడతాయి. వారాంతంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అనేక బాధ్యతలుంటాయి. కార్యనిర్వహణలో సంతోషం. సంతృప్తి. గుర్తింపు లభిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో వ్యతిరేకతలుంటాయి. పోటీలు, వత్తిడులను అధిగమించాల్సి ఉంటుంది. శ్రమాధిక్యం. వ్యవహార విజయం. కాంపిటీషన్ రంగంలోని వారికి అనుకూలం. గుర్తింపు లభిస్తుంది. సౌకర్యాలు సమకూర్చుకునే ప్రయత్నం. క్రమంలో పరిచయాలు పెంచుకుంటారు. పాత కొత్త మిత్రులు అధికవౌతారు. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వ్యాపార వ్యవహారాల్లో మంచి నిర్ణయాలుంటాయి. సౌకర్యాలు కొంత శ్రమకు గురి చేస్తాయి. వారం మధ్యలో అనుకోని ఇబ్బందులుంటాయి. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. అనుకోని నష్టాలకు అవకాశం. తొందరపాటు కూడదు. కాంట్రాక్టు వ్యవహారాల్లో లోపాలు. సంతోషం తగ్గవచ్చు. వారాంతంలో ఉన్నత వ్యవహారాలుంటాయి. ఆధ్యాత్మిక, విద్య, పరిశోధన, వైజ్ఞానిక రంగాల వారికి అత్యంత అనుకూలత.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744