S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రేరణ( సండేగీత)

పిల్లలు బాగా చదవాలని, మంచి మార్కులు వస్తే ఏదైనా బహుమతిని ఇస్తామని చెబుతాం. వాళ్లకి అది ఒక ప్రేరణగా ఉంటుంది.
ఈ పరిస్థితిని మనమూ చిన్నప్పుడు చూసి ఉంటాం. చిన్నప్పుడు ప్రేరణ అవసరం. సహజం కూడా. అందరికీ అలాగే ఉంటుంది.
మనలో చాలామంది పెద్దవాళ్లు అయిన తరువాత కూడా ఇలాంటి ప్రేరణని కోరుతున్నారు. నిజంగా అది అవసరమా?
మనం ఉదయం నిద్ర లేస్తాం. లేవగానే ఇటీవల అందరూ చేస్తున్న పని వాట్సప్‌లలో మెసేజీలను చూడటం.
ఆ తరువాత బ్రష్ చేస్తాం. ‘టీ’నో కాఫీనో త్రాగుతాం.
ఈ పనులకి ప్రేరణ ఎవరు ఇస్తున్నారు..?
శారీరక, మానసిక ఆరోగ్యానికి అవసరమైన ప్రతి పనికి కూడా ప్రేరణని కోరుతున్నాం. ప్రేరణ కోసం ఎదురుచూస్తున్నాం.
ఇది అవసరమా..?
మనం అంటే మనలో చాలామంది అని అర్థం.
వాకింగ్ చేయాలంటే బద్దకం.
ఇంట్లో వాళ్ల పనుల్లో సహకరించాలంటే మరీ బద్దకం.
చదవాలంటే బద్దకం.
ఏదైనా ఉపయోగకరమైన పని చేయాలంటే అలసత్వం.
ఈ రోజు పోయి మరో రోజు వస్తుంది.
సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడు.
మళ్లీ ఉదయిస్తాడు.
ఈ క్షణం పోయి మరో క్షణం వస్తుంది.
వీటికి ఎలాంటి ప్రేరణ ఉంది?
మన ప్రమేయం లేకుండా మన వయస్సు మనల్ని వెంటాడుతుంది.
అలాంటప్పుడు
ప్రతి పనికి ప్రేరణ కోసం ఎదురుచూడటం ఎంతవరకు సమంజసం?
మనం చేయాల్సిన పనులు చేస్తూ ఉండాలి.
కొన్ని మనకు ఇష్టం ఉండవచ్చు.
మరికొన్ని ఇష్టం లేకపోవచ్చు.
మనం చేయాల్సినవి చేసుకుంటూ పోవాల్సిందే.
మనం ప్రేరణ కోసం ఎదురుచూస్తూ కూర్చుంటే అది ఊతకర్రగా మారిపోతుంది.
ఉదయానే్న
కాఫీ తాగినట్టు.. ‘టీ’ సేవించినట్టు
వాట్సప్ మెసేజ్‌లు చూసినట్టు
మన పనులు చేసుకుంటూ పోవాలి.
ప్రేరణ కోసం ఎదురుచూడటం మానేసి మనమే ఇతరులకి ప్రేరణగా నిలవాలి. కన్పించాలి.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001