S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విజన్

ప్రిన్సిపాల్ ప్రతిరోజూ ఒక విజన్‌ను ఎలా చెప్పగలుగుతాడన్న ప్రశ్న వస్తుంది. భారత రాజ్యాంగవేత్తలు ప్రజలతో మమేకమవ్వటం భావి భారతదేశం ఎలా ఉండాలో తమ యొక్క విజన్‌ను రాజ్యాంగంలో రూపొందించారు. మన రాజ్యాంగం భవిష్యత్తు నిర్మాతలకు ఆదేశం లాంటిది. ఆ ఆదేశాలు మనందరికీ ముఖ్యంగా కార్యోన్ముఖులైన ప్రిన్సిపాళ్లు తమ విజన్‌ను పిల్లలకు ప్రతిరోజూ చెప్పటానికి అదే మన సోర్స్‌మెటీరియల్.
ఇది వివిధ మతాలు, కులాలు ఉన్న దేశం కాబట్టి దేశం ఐక్యతను కాపాడటానికై వచ్చే సమాజం సెక్యులరిజంను ప్రబోధించారు. మన స్కూళ్లు మత ప్రచారం కాకుండా మతాల కతీతమైనటువంటి మానవత్వపు విలువలను ప్రబోధించటమే మన కర్తవ్యం అన్నారు. ఈ విజన్‌ను ప్రిన్సిపాల్స్ తమ సహచరులకు తమ విద్యార్థుల లోపల కలిగించే అవకాశం మనకిచ్చారు. దేశ సమగ్రతను కాపాడటమే మొదటి విజన్. మన స్కూలు అసెంబ్లీలు, ఈ లక్ష్యసాధనకై మిషనరీలు కావాలి. స్వాతంత్య్ర సమరయోధులు తమ వ్యక్తిగత జీవితంలో అది సాధించారు. రాజ్యాంగంలో రూపొందించారు. తమ స్కూళ్లు దీన్ని ఆచరణయోగ్యం చేయటానికై మిషనరీ జీలుతో చేయవలసిందిగా ఆదేశించారు. మన మొదటి విజన్ మతాతీతమైన సమాజాన్ని సృష్టించటం. అదే మనం చేయవలసింది.
* * *
భారతదేశ ప్రజలందరికీ ఆగస్టు 15, జనవరి 26 ఈ రెండూ పవిత్ర దినాలు. మాకు మూడవ రోజు కూడా పవిత్రమైంది. అదే జూన్ 2. దేశం తనకు ఏమో ఇవ్వాలని కాదు. దేశ భవిష్యత్తు గురించి ఆలోచించటానికి అవకాశం ఇచ్చిన రోజు అది. తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే అవకాశం ఇచ్చిన రోజు. తెలంగాణ ప్రజల శరీరంపైన ఎన్నో గాయాలున్నాయి. ప్రతి గాయం బాధ్యతను మాలో రేకెత్తిస్తున్నది. ఈనాడు దేశం వనరులు అభివృద్ధికి సాధనాలు కావు. ప్రజలు రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు కావటం అదొక సంతోషకరమైనది. నా రాష్ట్ర అభివృద్ధిలో నేను కూడా భాగస్వామినని గర్వించే రోజు. ప్రతి వ్యక్తికి అన్ని రకాల నైపుణ్యాలు ఉండవలసిన అవసరం లేదు. చేస్తున్న పనినే నైపుణ్యంగా చేయటం అదే గొప్ప ప్రేరణ. ఆ పని ఆ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి దోహదమవుతుందనేది సందేశం. ఈ భావనతో ప్రతి వ్యక్తి తన విధిని నిర్వహించటమే అదే తమకు గొప్ప అవకాశంగా భావిసాతరు. రాష్ట్ర నిర్మాణంలో ఆ వ్యక్తి సంతృప్తి చెందటమే ఆ వ్యక్తి జీవితంలో మరిచిపోలేనిది. విద్యారంగంలో పనిచేసే అవకాశం నాకు దొరికింది. దాని ఫలితాలు ఈ క్షణంలో కనపడకపోవచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత కనపడినా కానీ నేను నా రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకున్నాననే సంతృప్తి మాత్రం చెరిగిపోకుండా ఉంటుంది. ఈ భావనే ఒక విలువ. తన చుట్టున్న సమాజాన్ని ప్రేమించటం అన్నది గొప్ప విలువ. చదువు లక్ష్యం కూడా అదే.

-చుక్కా రామయ్య