ఆత్మావలోకనం
Published Saturday, 29 June 2019భవ జలనిధినీదగ రెండు చేతులు చాలవు
భవ జలనిధిని మోదగ రెండు కాళ్ళు చాలవు
భవ రోగములను వైకల్యములను
ఎదురొడ్డగ పిడికెడు గుండె చాలదు
ఎదలో సుడిగా ఎగసిపడే
కడుగండ్లను, కన్నీటిని దాచగా
రెండు నేత్రములు చాలవు
అని.. ఆ విధి ముఖమున వ్రాసిన చేవ్రాలని
సరిపెట్టుకుంటే తీరదు వేదన
ఆత్మ స్థైర్యమొక్కటే సాధన
అప్పుడు..
తిమిరి ఇసుము తీయగవచ్చు
కంటికి కనిపించని భవజలధిని
దాటగవచ్చు
తపముతో ముక్కంటిని ప్రసన్నుడిగా
చేయగవచ్చు..