S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇపుడు లెర్నింగ్ జీవితం

టెక్నాలజీలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పుల వల్ల ప్రతిరోజూ వేలాది పుస్తకాలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. కొత్త రచయితలు, కొత్త చదువరులు చాలామంది వచ్చారు. ప్రతి వారు వస్తున్నటువంటి సాహిత్యంలో తమ జీవితాలను చూసుకొని కొత్త ఉత్సాహాన్ని, కొత్త ధైర్యాన్ని, సంతృప్తిని తెచ్చుకుంటున్నారు.
మేం చిన్నప్పుడు నవల చదివితే మా తల్లిదండ్రులు కోప్పడేవారు. అది చిన్నప్పుడు చదవవలసిన పుస్తకం కాదనేవారు. ఈనాడు చిన్నప్పటి నుంచి పిల్లలకు బొమ్మలతో, చిత్రపటాలతో భారతం, భాగవతం చదివిస్తున్నారు. పది, పనె్నండు సంవత్సరాల వయసు పిల్లలు తమలో దాగివున్న ప్రతిభను తమ ఈడు పిల్లల రచనలు చూసి ఉప్పొంగి పోతున్నారు. దాన్ని అనుకరిస్తున్నారు. మనం ఊహించలేనటువంటి లేత భావాలు చిన్నపిల్లల కలాల నుంచి జారుతుంటే సమాజం ముఖ్యంగా తల్లిదండ్రులు ఎడ్యుకేట్ అవుతున్నారు. బస్సులలో కూర్చుని నవలలను చదువుతున్న పిల్లలను చూశాను. తమ దినచర్యలో పడుతున్న బాధలన్నీ నవలా సాహిత్యంలో కనపడుతుంటే తమ జీవితాలను సరిదిద్దుకుంటున్నారు. సివిల్ పరీక్షకు వెళ్లే అభ్యర్థులే ఇంటర్వ్యూలకు వెళుతుంటే సామాజిక నవలలు చదువుకుంటూ పోతున్నారు. విద్యార్థికి సబ్జెక్ట్ రాకుంటే మేం నేర్పించుకుంటాం కానీ, సమాజం గురించి ఆలోచన లేని వారిని ఉద్యోగంలోకి తీసుకుని ఏం సాధిస్తాం అంటున్నారు.
పుస్తకం సమాచారం కన్నా సమాజాన్ని చదవటానికి ఒక ముఖ్యమైన సాధనం. వెనకటి మాదిరిగా నవలలైనా కథలైనా ప్రతి వ్యక్తికి నిత్య జీవిత అవసరమై పోయింది. అదే మాదిరిగా సాధనా పద్ధతిలో కూడా లెర్నింగ్ ప్రాసెస్ కూడా తరగతికే పరిమితం కాదు. విద్యార్థి తన జ్ఞానాన్ని పెంచుకునేందుకై ఇంటర్నెట్‌ను, గూగుల్స్‌ను చిన్నప్పటి నుంచే వాడుతున్నారు. అవి వినోదం కోసమే ఉండేది అనుకొనేవారు. నేడు కొత్త జ్ఞానాన్ని సాధించటానికి సాధనం. లెర్నింగ్ కాలమాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. ఆనాడు నాలుగు గోడల మధ్య పలక కట్టుకుంటేనే లేదా గురువు ముందు వినయంగా కూర్చుంటేనే సాధన జరుగుతుందని ఊహించుకునేది. కొత్త సాధనా పద్ధతులున్నాయి. టెక్నాలజీ మారిన కొద్దీ టీచింగ్, లెర్నింగ్‌లో కూడా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. వీటిని గమనంలోకి తీసుకుని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ ఎత్తుగడలను మార్చుకోవలసిన అవసరం ఉంటుంది. టెక్నాలజీ జీవితం ప్రతి కోణాన్ని స్పృశిస్తుంది. లెర్నింగ్ దానిలోని భాగమే.
టీచర్ అంటే తపస్వి
తరగతికి వెళ్లే ముందు ఒక ముని తపస్సుకు వెళుతున్నపుడు ఆలోచన ఎట్లా ఉంటుందో ఉపాధ్యాయుని ఆలోచన అట్లే ఉండాలి. ఉపాధ్యాయుని మనసులో తరగతి గది తప్ప వేరే విషయానికి తావు ఉండకూడదు. ఆలోచనలన్నీ తరగతి చుట్టే పరిభ్రమిస్తుండాలి. మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉంటుంది. చిన్నపిల్లలు ఆదేశాలకన్నా సమగ్రమైన భాషతో భాషించాలి. విద్యార్థి పరిసరాలను పరిహసించే భాష ఉండకూడదు. విద్యార్థి సంస్కృతిపై కావచ్చును. వారి తల్లిదండ్రుల గురించి కావచ్చును. విద్యార్థి జీవన శైలిపై కావచ్చును. అందుకు సంబంధించిన మాటలు మాట్లాడకూడదు. ఉపాధ్యాయుని నోటి నుంచి ఏ మాట వెళుతుందోనని ఎదురుచూస్తూ ఉంటారు. సబ్జెక్ట్‌కు ఉపోద్ఘాతం కొత్తదనంతో చెప్పాలి. పిల్లల్లో ఆసక్తి కలిగించాలి. ఆలోచింపజేయాలి. విద్యార్థి కాల్పనిక శక్తికి నారుగా ఉపయోగపడాలి. పాఠం స్వరూపం కళ్ల ముందు ఆడుతూ ఉండాలి. ఆనాడు చెప్పదల్చుకున్న కానె్సప్ట్ అన్నీ ఒక క్రమంలో చెప్పాలి. ఉపాధ్యాయుని ప్రతి సబ్జెక్టును విద్యార్థి జీవితంతో అనుసంధానం చేయాలి. విద్యార్థి మాటలు వినే ఓపిక కలిగి ఉండాలి. అంటే ఉపాధ్యాయుడు వినే అలవాటు చేసుకోవాలి. విద్యార్థి భయం లేకుండా మాట్లాడగలగాలి. విద్యార్థిలో భయాన్ని, నిరుత్సాహాన్ని లేకుండా చేయాలి. సబ్జెక్ట్ నుంచి దూరం కాకుండా చేసుకోవాలి. అధికార గణానికి సిలబస్ పూర్తి చేయటమే ప్రధానం. ఉపాధ్యాయునికి మాత్రం విద్యార్థికి అర్థం కావటమే ప్రధానంగా ఉంటుంది. ఈ రెండింటి మధ్యన బోధనా పద్ధతులుండాలి. ప్రశ్న ఎప్పడూ తరగతి గదిని సంబోధించాలి కానీ, పిల్లవాణ్ణి ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వేయకూడదు.
ఉపాధ్యాయుడు మాట్లాడే మాట అందరికీ వినబడుతున్నదా? కనపడుతున్నదా? చూసుకోవాలి. చాలా మందికి పోషణ బాగాలేక కంటి దోషం, చూపు దోషం ఉంటుంది.
ఉపాధ్యాయుడు ఎంత చెప్పారన్నది ముఖ్యం కాదు. పిల్లల్ని ఎంతవరకు ఆలోచింపజేశామన్నది మాత్రమే గీటురాయి. అందుకే ఉపాధ్యాయునికి ప్రతిరోజూ ఒక కొత్త రోజే. విద్యార్థి ప్రతిరోజు ఒక కొత్తదనాన్ని ఆశిస్తాడు. టీచర్ ప్రిపరేషన్ తరగతి గది భవిష్యత్తు నిర్ధారణ చేస్తుంది.
ఇది ఉపాధ్యాయులకు తెలియదని చెప్పటం లేదు. ఉపాధ్యాయుని నుంచి పిల్లలు ఏం ఆశిస్తారో వారి వైపు నుంచి నా విజ్ఞప్తి.

-చుక్కా రామయ్య