S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆఫ్ ఎ పొయెట్

నిర్వ్యాపారంగా
ఒక పగలును మోస్తూ
రాత్రి కోసం వేచి ఉండటం
ఒకింత కొత్త అనుభవం!

ఎవరి పనుల్లోకి వాళ్లు ప్రవహించాక
ఇల్లు ఠక్కున నోరు మూసుకుంటది
టేబుల్ మీది తెల్ల కాగితం
సవాలొకటి విసురుతుంది
అబ్బో! భరించలేను ఊపిరాడని
ఈ నిశ్శబ్దాన్ని!

పగటిని పీల్చి పిప్పిచేసి
రాత్రుల్ని వెలిగించుకున్న
నేనూ నా సహచర మిత్రులు
మార్నింగ్ వాక్‌లో తప్పా
ఎక్కడా కనిపించరు!
సమూహాల్ని కోల్పోయిన ఫీలింగును
జయించక మునుపే
నేనో పాత వస్తువునై
ఒక మూలకు విసిరేయబడతాను!

నాకు వినిపించేటట్లే
నాన్న బయట తిరిగితే అలసిపోతాడు
మనమే పోదాం షాపింగ్‌కు
అనూహ్యంగా నేనిప్పుడు వాచ్‌మెన్ను

ఎవర్నీ నిందించక్కర్లేదు
కాలమే అంత కఠినమైంది
పుస్తకాన్ని పట్టుకున్న నడుస్తున్న వాణ్ణి
చివరి దాకా వెలుగునై ప్రసరిస్తా!

-కోట్ల వెంకటేశ్వరరెడ్డి 94402 33261